సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * చంద్రశేఖర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘మేలఁ బల్కిన’ అన్నప్పుడు స్పష్టత లేదు. అక్కడ ‘రాష్ట్ర మొప్పని పల్కిన’ అనండి. * శైలజ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. * మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * జిలేబీ గారూ, ????? * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్ది గారూ, మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు. ‘ఆకసము’ అనండి. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, ఆలుమగల పరిహాసాల మీ పూరణ వినోదాత్మకంగా ఉంది. అభినందనలు. మీ పద్యాలలో టైప్ దోషాలుంటున్నాయి. కొద్దిగా శ్రద్ధ తీసుకొనవలసిందిగా మనవి.
వసంత కిశోర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కె.ఈశ్వరప్ప గారి పూరణ 1. చడువువిలువల నిలువలు వదలుకొనక స్వార్ధచి౦తనతో నీవు సాగుచుండ విద్య విజ్ఞాన మొసగెడి విశ్వ మేది వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె 2. రాక్షసత్వముతపముచే రగుల జేసి ఆశనత్యాశ గామార్చి అంతమొండు మార్గ గామిగ మార్చెడి మనసునుంచు వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
పూజ్యులు గుర్గుదేవులు శంకరయ్య గారికి వందనములు మరియొక పూరణ: సురలగెల్వగ ప్రత్యేక వరము లడుగు వేళ దనుజుల నాల్కపైవిశ్వహితము గోరగా నేల జేయవే నారి యనుచు వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. టైపు దోషాలున్నాయి.... ‘చడువు, అంతమొండు’ * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ తాజా పూరణ నిస్సందేహంగా అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
చెలగి సంతోష వార్తలు చెప్పునపుడు విసిగి దుఃఖపు కబురులు వెడలి నపుడు మూగ నోము తో దినమంత పొలుప, దూర వాణికిc దెలివి లేదని బ్రహ్మ పలికె కొరుప్రోలు రాధా కృష్ణ రావు
వాణి నారాణి యనుచును బలికె నొకరు
రిప్లయితొలగించండివాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
తల్లి యామాత చదువుల తల్లి యనుచు
నేను బలుకుదు నిప్పుడు నిజము గాదె ?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీల్గి వేర్పాటు వాదులనిరి సమైక్య
రిప్లయితొలగించండిరాష్ట్రమే మేలఁ బల్కిన రమణి సత్య
వాణికిఁ దెలివి లేదని; బ్రహ్మ పలికె
వేగిరము తధాస్తని రెంటిఁ వేరు జేసి!
భువన మోహన సౌందర్యమూర్తి గనుచు
రిప్లయితొలగించండిపలికె నిటుల గిరీశము పడతి మధుర
వాణికి తెలివి లేదని,బ్రహ్మ పలికె
తెలివి వనితల సొత్తురా ! తెలుసు కొనుమ!
కుటిల బుద్ధితో విడదీసి కులజనులను
రిప్లయితొలగించండికోళ్ళపెరుతో సృష్టించి ఘోరములను
నైచ్యవాక్యముల పలుకెడు నాగమాంబ
వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
బ్రహ్మ = బ్రహ్మనాయన
పంచ వన్నెల పక్కికి ప్రాణమొసగి
రిప్లయితొలగించండిమనము నేర్పిన మాటలే మనకిజెప్పు
శుకము నిదియని శుక్లకు జూపి కీర
వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె !!!
వాణి నా వాణి అని బ్రహ్మ
రిప్లయితొలగించండివచించి'ప'రమును మరిచె!!
నీవాణి లిపి బ్రహ్మా,ఏదనినిన
వాణికిదె,'లివి' లేదని బ్రహ్మ పలికె !!
శుభోదయం
జిలేబి
సత్యకాలము నందున సంతతంబు
రిప్లయితొలగించండినాకశపు వాణి యెరిగించె నజుని యాజ్ఞ
భవిత నంతయు జనులకు భవ్యగతిన
నేడు మన సృష్టితోడ మాటాడు దూర
వాణికి తెలివిలేదని బ్రహ్మ పలికె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మేలఁ బల్కిన’ అన్నప్పుడు స్పష్టత లేదు. అక్కడ ‘రాష్ట్ర మొప్పని పల్కిన’ అనండి.
*
శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
జిలేబీ గారూ,
?????
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్ది గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.
‘ఆకసము’ అనండి.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
ఆలుమగల పరిహాసాల మీ పూరణ వినోదాత్మకంగా ఉంది. అభినందనలు.
మీ పద్యాలలో టైప్ దోషాలుంటున్నాయి. కొద్దిగా శ్రద్ధ తీసుకొనవలసిందిగా మనవి.
రిప్లయితొలగించండి"నాదు సొబగంత చెడగొట్టి నావు జీవి
తలను పిచ్చి గీతలు వ్రాయ తగునటయ్య"
యనగ నగవులు నలుమోము లను వెలయగ
వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
పూజ్యులు గుర్గుదేవులు శంకరయ్య గారికి వందనములు టైపు దోషములు సవరి౦చిన పద్యము ప్రస్తుతి
రిప్లయితొలగించండినాదు సొబగంత చెడగొట్టి నావు జీవి
తలను పిచ్చి గీతలు వ్రాయ తగునటయ్య"
యనగ నగవులు నలుమోము లను వెలయగ
వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
బ్రహ్మకు కలిమియన తాళ పత్రమనుచు
రిప్లయితొలగించండిశారదాంబ మగని తోడ సరసమాడ
లేమ లచ్చికి బిడ్డడు లేని వాడె?
వాణికిఁ దెలివి లేదని బ్రహ్మ పలికె!!
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిచదువులన్ గొని దనుజుండు జలధి దాగె
జగము లంధీకృత౦బయ్యె జలజనాభ
పలుకుల వెలంది మూర్చిలి పలుకదయ్యె
వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింపుచున్నవి !
మధురవాణి , వీణాపాణుల మధ్య సంగీతమున పోటీ - నాదబ్రహ్మ నిర్ణేత :
01)
___________________________________
వాణి, పాణుల మధ్యలో ♦ వాదనమున
ఫలితమును దేల్చ నిలిపిరి ♦ బ్రహ్మ నపుడు !
వీణ , వాణుల నిపుణత ♦ వినిన పిదప
పాణి గెలిచెను ధీమతి ♦ యౌను గాన
వాణికిఁ దెలివి లేదని ♦ బ్రహ్మ పలికె !
___________________________________
వాదనము = వాద్యమును వాయించుట
పలుకు పలుకున తేనియ లొలుకు నటుల
రిప్లయితొలగించండివరము లొసగిన తల్లిని వావి మరచి
'వాణి నా రాణి' యనువారి వదలి వేయ
వాణికిఁ దెలివి లేదని బ్రహ్మ పలికె!
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండికోర్కెలను దీర్చుకొన జేసె ఘోర తపము
నిద్ర వాంఛించె నింతలో నిజము మరచి
చపలచిత్తము కలిగిన తపసి యసుర
వాణికిఁ దెలివి లేదని బ్రహ్మ పలికె
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కె.ఈశ్వరప్ప గారి పూరణ
రిప్లయితొలగించండి1. చడువువిలువల నిలువలు వదలుకొనక
స్వార్ధచి౦తనతో నీవు సాగుచుండ
విద్య విజ్ఞాన మొసగెడి విశ్వ మేది
వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
2. రాక్షసత్వముతపముచే రగుల జేసి
ఆశనత్యాశ గామార్చి అంతమొండు
మార్గ గామిగ మార్చెడి మనసునుంచు
వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
పూజ్యులు గుర్గుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిమరియొక పూరణ:
సురలగెల్వగ ప్రత్యేక వరము లడుగు
వేళ దనుజుల నాల్కపైవిశ్వహితము
గోరగా నేల జేయవే నారి యనుచు
వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
కంసుడా చెల్లితో తాను కదలు నపుడు
రిప్లయితొలగించండిఅష్ట మంబైన గర్భంబు నతనిఁ జంపు
ననుచు, నాకాశ వాణి యె ననగఁ జూచి
వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
వాణి యన్నను మాటగు- బహుళ గతిని
మాట లయ్యవి నైపుణ్య మతుల వైన
తెలివి యైనవియగుఁ గాని, తిమిర మతుల
వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
బ్రహ్మ కొరకయి తపమును బాగుఁ జేయ
రాక్ష సాళికి వరములు రంజితముగ
నిడడె, యనగును రాక్షస నీతి వెలుగు
వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
సాయ మడుగంగఁ బోయియు సకల సేన
నడిగె రాజరాజాపార్థు డడిగె కృష్ణు
నొకనె. గర్వియౌ రారాజు నోట వచ్చు
వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
టైపు దోషాలున్నాయి.... ‘చడువు, అంతమొండు’
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ తాజా పూరణ నిస్సందేహంగా అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
సుకవిమిత్రులకు నమస్కారములు.
రిప్లయితొలగించండి(పింగళి సూరన కళాపూర్ణోదయకథలో బ్రహ్మసరస్వతుల సరస సంభాషణ నిచ్చట ననుసంధానించుకొనునది)
రెండు జన్మాల కథల విరించి చెప్పె;
వాణి తమదు ప్రణయకథా వర్ణన యనె;
వాణికిఁ దెలివి లేదని బ్రహ్మ పలికె;
బ్రహ్మ వివరణమును విని వాణి నవ్వె!!
అత్తకెప్పుడు తోడుగా నరుగదీమె
రిప్లయితొలగించండిదత్త పుత్రుల కేనాడు యత్తతోడు
చేరనీయదు చూడగా చిన్నబోవు
వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
కలిని మనుజులు వాడెడి కబురుల చర
రిప్లయితొలగించండివాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె,
కనగ మేలౌను మనకు నాకాశవాణి
యనగ నవ్వెను వాణియె హసితయౌచు
చరవాణి=సెల్ ఫోను
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండికళాపూర్ణోదయ ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నవ్వెను, హసిత యగుచు అని పునరుక్తి... ‘నవ్వెను వాణియె యందముగను’ అందామా?
అవును, మాస్టారూ.. మీరు చెప్పింది నిజమే!
రిప్లయితొలగించండిచెలగి సంతోష వార్తలు చెప్పునపుడు
రిప్లయితొలగించండివిసిగి దుఃఖపు కబురులు వెడలి నపుడు
మూగ నోము తో దినమంత పొలుప, దూర
వాణికిc దెలివి లేదని బ్రహ్మ పలికె
కొరుప్రోలు రాధా కృష్ణ రావు