ఓసుయోధ! నుడువ నే సరికాజాల ******నీకు! నిశాచర నేతవీవు! దుశ్శాసనుఁడు నాదు దొర రావణుఁడని యీ ******మారీచునకు మరి మరి తెలియదె ఘన శుభకర పద జనిత ధ్వని నిరోధ ******కర్ణుఁడు నారాజు కాడె చూడ నెలతపై యాశకు నిన్ను నీవు దహింప ******జేసుకొనెదవేల చెడు నడతన?
దాశరధియనగ నిఖిల ధర్మ మూర్తి విడిచె దయతోడ నన్నిట, దడుచుకొంటి రామనామమె నాకు పారాయణమ్ము రాముని సతిని చేరకు రాక్షసేంద్ర!!
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ, సీసపద్యంలో పూరణ చేయాలంటే మీరు ఎత్తుగీతి మాత్రం వ్రాసినట్టున్నారు. ఇది తేటగీతియేనా? మరో ఛందస్సా? తేటగీతి అయితే ప్రతిపాదంలోను ఒక్కొక్క అక్షరం ఎక్కువయింది.
మిస్సన్న గారు, వాటిని భారత పాత్రలుగా భావించ కూడదు. ఆ పదాల ఉత్పత్తి అర్థములనే స్వీకరించాలి. సుయోధనుడు అనగా మంచి వీరుడు అని , దుశ్శాసనుడు అనగా కఠినమైన శాసనములు చేయువాడని భావించాలి.
మిస్సన్న గారూ, మీరు ‘భారత గర్భ రామాయణ’ పద్యాలను పరిశీలిస్తే ఎన్నోసార్లు సుయోధన, దుశ్శాసన శబ్దాలు భారతార్థంలో విశేష్యాలుగాను, రామాయణార్థంలో విశేషణాలుగాను ప్రయోగించడం కనిపిస్తుంది. ఈ దత్తపదిని ఇవ్వడానికి ప్రేరణ ఆ కావ్యమే! * జిగురు సత్యనారాయణ గారూ, ధన్యవాదాలు. * శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. కాని కుంభకర్ణుడు రావణునకు హితువు చెప్పినట్టు వ్రాశారు. చెప్పినది విభీషణుడు కదా.. సీసపద్యం నాల్గవ పాదాన్ని ఇలా మారుద్దాం... కుంభకర్ణుఁడు గాని ఘోరరాక్షసవీరు లైన నాతని నెదురాడలేరు... పద్యం చివర.. ‘మన్నించగలఁడని హితప్రియోక్తు లనె విభీషణుండు’
గురువు గారికి ప్రణమములు. తప్పులు సవరించుకొని పంపిన పూరణ గమనించ గలరు. ||సీ||పరసు యోధనుడు తపముని వేషమున రాముడతి పాషాండు డా మూర్ఖ దనుజ దుశ్శాసనుడు బహు దుష్టుడా దశకంఠుని దునుమాడె నమిత నిశిత శరము లను వేసి బిట్టుగ లాఘవమొప్పగ కుంభ కర్ణుడు,ననికూల గాను రావణుని పరిమార్చగ దనుజ వినాశకుని రాముని దలచు కొందు నెపుడు (పరసు= పోడిమి, యోధనుడు= యుద్దము చేయువాడు) ||ఆ.వె|| శ్రీ రఘు కుల దివ్య చింతామణి యనగ సకల సద్గుణముల సవరు అనగ దాశరధి యనగను ధర్మ స్వరూపుడు రామ విభుడు తానె రక్ష మనకు
యోధుల మించు సుయోధను డాహవ రంగము నందున రావణుండు దుష్ట శాసనముల దుశ్శాసనుడతడు సీతను చెరపట్టి చేసె తప్పు జానకి రాముని జంపెడి కాంక్షను కోల్వడె సుతులను కుంభ కర్ణు డును జచ్చె రాఘవుడుద్దండు డై దైత్య నిర్వంశకుని గాను నీరు జేసె నెల్ల దైత్య నృపుల నేసె నాహవమున వీర రాఘవుండు విష్ణువతడు సీత తోడు గాను సిరులను వెలయించె రామ రాజ్యమొకటి రహిని వెలుగ
వినుము రావణ! సుయోధనుడ వైనను గాని ......రామునితో మైత్రి రహి వహించు సఖుడ మారీచ! దుశ్శాసనుండను నేను ......నా మాట వినవేమి నరుక గలను నేటి నీ యాశకు నిష్కృతి లేదింక ......బలియౌదు రాముని బాణమునకు కుంభకర్ణుడు, నేను కూడి యుండగ తోడ- ......సాధ్యము రాముడు చంప నిన్ను
పోవుకాలము నీకాయె, భూమిమీద నూక లిక లేవు లంకలో సోకులకును పిరికి మాటలు మాని నీవురక లెమ్ము వేళ మించిన కష్టము వేగ పొమ్ము.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * శీనా శ్రీనివాస్ గారూ, మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. సీసం నాల్గవ పాదంలో ‘నుడువుద’ అన్నారు. అక్కడ యతి తప్పింది. ‘నుడివెద’ సాధురూపం కదా! ‘విను సుయోధ! నుడువును నాదు, భక్తితో’ అందామా? * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘చెడ్డ మదిని’ అనండి. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. మాడుగుల వారి పూరణను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
ఓసుయోధ! నుడువ నే సరికాజాల
రిప్లయితొలగించండి******నీకు! నిశాచర నేతవీవు!
దుశ్శాసనుఁడు నాదు దొర రావణుఁడని యీ
******మారీచునకు మరి మరి తెలియదె
ఘన శుభకర పద జనిత ధ్వని నిరోధ
******కర్ణుఁడు నారాజు కాడె చూడ
నెలతపై యాశకు నిన్ను నీవు దహింప
******జేసుకొనెదవేల చెడు నడతన?
దాశరధియనగ నిఖిల ధర్మ మూర్తి
విడిచె దయతోడ నన్నిట, దడుచుకొంటి
రామనామమె నాకు పారాయణమ్ము
రాముని సతిని చేరకు రాక్షసేంద్ర!!
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. సుయోధనుడు, శకుని పదాల అమరిక ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
లంకా నగర మేలు రావణుండెంతయు
రిప్లయితొలగించండి-----------దనుజులందున సుయోధనుడు నౌచు
దుర్మార్గ మౌరీతి దుశ్శాసనుడు నౌచు
-----------వెల్గడే ధరపైన పెద్దగాను
కుంభకర్ణుడు నంత గొప్పగా వానికి
-----------చేదోడు నౌచును చేవఁజూప
కుజపైన తానాశకు నిలయు డౌచును
-----------చెరపట్టి యామెను, చేటుఁగొనెను
రామ కార్ముక హతికిని రాజితముగ
బలము నదియెల్ల కూలదే పాపచింత
ధర్మ మార్గంబు విడనాడ ధరణి పైన
సర్వ నాశంబు నందుటే సత్యమగును
కుంభకర్ణుడును యన్నకుం గోరిచెప్పె
రిప్లయితొలగించండినేర్వ దుశ్శాసనుడు దశకు నిల్చిపలికె
నిజ సుయోధనుడు తమ్ముడా నీవెయైనన్
రామునింజంపి రమ్మనెను రాక్షసుండు
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
సీసపద్యంలో పూరణ చేయాలంటే మీరు ఎత్తుగీతి మాత్రం వ్రాసినట్టున్నారు. ఇది తేటగీతియేనా? మరో ఛందస్సా? తేటగీతి అయితే ప్రతిపాదంలోను ఒక్కొక్క అక్షరం ఎక్కువయింది.
మల్లెల వారి పద్యం బాగున్నది. కాని కృత యుగం లోని రామాయణ పాత్రల కుపమానాలుగా ద్వాపరం లోని భారత పాత్రలను చెప్పవచ్చునా అని.
రిప్లయితొలగించండిమిస్సన్న గారు,
రిప్లయితొలగించండివాటిని భారత పాత్రలుగా భావించ కూడదు. ఆ పదాల ఉత్పత్తి అర్థములనే స్వీకరించాలి.
సుయోధనుడు అనగా మంచి వీరుడు అని , దుశ్శాసనుడు అనగా కఠినమైన శాసనములు చేయువాడని భావించాలి.
శంకరయ్యగారు,
రిప్లయితొలగించండిప్రయాణంలో ఉంటూ "సీస పద్య" మనే అంశాన్ని చూడలేదు మన్నించండి. నేను వ్రాసినది తేటగీత లయంలో సాగే మాత్రాగణయుక్తమైన చౌపది. వ్యవధియున్నచో వేరె సీసపద్యాన్ని వ్రాస్తాను.
దనుజులందున సుయోధనుడవౌ లంకేశ
రిప్లయితొలగించండి....... వినుము తమ్ముని మాట వివరముగను
దుశ్శాసనుడ వని దూరు నిన్నందరు
....... చెరను బెట్టితి వేల శీలవతిని
నెలతపై నాశకునిప్పు పెట్టుము రాజ !
....... రామసన్నిధి జేర్చు రామనిపుడె
కుంభకర్ణుడు తెల్పె కుజను వీడు మనుచు
....... హితము జెప్పి జూచెమితముగాను
రామరామ యనుచు రాజీవనేత్రుని
రక్ష గోరుమయ్య లంకనాధ!
మాత సీత నొసగ మన్నించు రాముడు
శరణువేడుగొనుము సత్వరముగ!
జిగురు సత్యనారాయణ గారూ వివరణకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీరు ‘భారత గర్భ రామాయణ’ పద్యాలను పరిశీలిస్తే ఎన్నోసార్లు సుయోధన, దుశ్శాసన శబ్దాలు భారతార్థంలో విశేష్యాలుగాను, రామాయణార్థంలో విశేషణాలుగాను ప్రయోగించడం కనిపిస్తుంది. ఈ దత్తపదిని ఇవ్వడానికి ప్రేరణ ఆ కావ్యమే!
*
జిగురు సత్యనారాయణ గారూ,
ధన్యవాదాలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని కుంభకర్ణుడు రావణునకు హితువు చెప్పినట్టు వ్రాశారు. చెప్పినది విభీషణుడు కదా.. సీసపద్యం నాల్గవ పాదాన్ని ఇలా మారుద్దాం...
కుంభకర్ణుఁడు గాని ఘోరరాక్షసవీరు
లైన నాతని నెదురాడలేరు...
పద్యం చివర.. ‘మన్నించగలఁడని
హితప్రియోక్తు లనె విభీషణుండు’
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిసీ.దశదిశాధిపతుల దశక౦ధరుడు సుయో
ధనుడుపోరి గెలిచె ఘనుడు యతడు
కుంభ కర్ణు డతని కూరిమితమ్ముడు
నిదురలోనుయారునెలలుగడపు
దుశ్శాసనుడు,ఘోర దుష్కృత్యములజేయు
మునులతపముభంగమునుయొనర్చు
చెప్ప చుప్పనాతి చెరపట్ట సీతను
కుప్పకూలె లంక కోతి వలన
తే.గీ.రణము నందునజచ్చిరి రావణాది
దుష్ట రాక్షసు లెల్లరు,యిష్టసతిని
జానకిని దెచ్చె శ్రీరామ చంద్రు డపుడు
దనుజ వంశ నాశకునికి ప్రణతు లివియె
మిత్రుడు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు.
రిప్లయితొలగించండిసీ.
అష్టదిక్పతుల ననాయాసముగ గెల్చి
....స్వఃసుయోధనుఁడుగ సన్నుతిఁ గని,
యెల్లరుఁ దనయాజ్ఞ లెల్లఁ బాలింపంగ
....దుశ్శాసనుఁడునయి దోర్బలమున,
దర్పోద్ధతినిఁ బూని తన తమ్ముఁడగు కుంభ
....కర్ణుఁడు శ్రేయమ్ముఁ గనుచు నుండ,
మేఘనాథుఁడు సతమ్మింద్రజిన్నాముఁడై
....శత్రునాశకునిగ జగతికెక్క,
గీ.
లంకఁ బాలించుచుండె సల్లక్షణుఁడని
దనుజ బృందమ్ము వొగడంగ దానవేంద్రుఁ
డసుర గణ సేవితుఁడు విదగ్ధ బల వి
రాజితుఁడు శివభక్తుఁడౌ రావణుండు!!
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఘనుడు + అతడు, నిదురలోను + ఆరు, భంగమును + ఒనర్చు, ఎల్లరు + ఇష్ట’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘చెప్ప చుప్పనాతి’ అన్నప్పుడు గణదోషం.... మీ పద్యానికి నా సవరణ...
సీ.దశదిశాధిపతుల దశక౦ధరుడు సుయో
ధనుడుపోరి గెలిచె ఘను డతండు
కుంభ కర్ణు డతని కూరిమితమ్ముడు
నిదురలోనె యారునెలలుగడపు
దుశ్శాసనుడు,ఘోర దుష్కృత్యములజేయు
మునులతపముభంగమునొనరించు
చెప్పె శూర్పణఖ తా చెరపట్ట సీతను
కుప్పకూలెను లంక కోతి వలన
తే.గీ.రణము నందునజచ్చిరి రావణాది
దుష్ట రాక్షసు లెల్లరు, నిష్టసతిని
జానకిని దెచ్చె శ్రీరామ చంద్రు డపుడు
దనుజ వంశ నాశకునికి ప్రణతు లివియె
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
||సీ||పరసు యోధనుడు తపముని వేషమున రాముడతి పాషాండు డా మూర్ఖ దనుజ
రిప్లయితొలగించండిదుశ్శాసనుడు బహు దుష్టుడా దశకంఠుని దునుమాడె నమిత నిశిత శరము
లద్భుత వేగమున వెడలగ లాగెనా వింటి నారిని కర్ణ వేధ కలుగ
రావణుని పరిమార్చగ దనుజ వినాశకుని రాముని దలచు కొందు నెపుడు
(పరసు= పోడిమి, యోధనుడు= యుద్దము చేయువాడు)
||ఆ.వె|| శ్రీ రఘు కుల దివ్య చింతామణి యనగ
సకల సద్గుణముల సవరు యనగ
దాశరధి యనగను ధర్మ స్వరూపుడు
రామ విభుడు తానె రక్ష మనకు
శీనా శ్రీనివాస్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీసం మూడవ పాదం పూర్వార్ధంలో గణ, యతి దోషాలు. ‘కర్ణుడు’ అనకుండా ‘కర్ణ’ అన్నారు. సవరు + అనగ అన్నప్పుడు యడాగమం రాదు. సవరించండి.
లంకానగరి సేనలందరు హతమయ్యె - కామాంధుడౌ రాజు గారణమున
రిప్లయితొలగించండియుద్ధరంగమున 'సుయోధను'డైనట్టి - మేఘనాధుడుగూడ మిత్తిగొనెను
రావణాసురుని దురా'శకు ని'హతుడై - కుంభ'కర్ణుడు'గూడ కుప్పకూలె
దుర్మదాంధుండును 'దుశ్శాసనుడు'నైన - దశముఖు వధియించె దాశరధియె
మంచిచెడుల విచక్షణ మరచిపోయి
శివుని భక్తుండు చెరబట్టి శీలవతిని
కోలుపోయె గడించిన గుణములెల్ల
సీతపైవాంఛ తనకెంత చేటుచేసె
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సేన లన్నియు’ అంటే బాగుంటుందేమో?
గురువు గారికి ప్రణమములు. తప్పులు సవరించుకొని పంపిన పూరణ గమనించ గలరు.
రిప్లయితొలగించండి||సీ||పరసు యోధనుడు తపముని వేషమున రాముడతి పాషాండు డా మూర్ఖ దనుజ
దుశ్శాసనుడు బహు దుష్టుడా దశకంఠుని దునుమాడె నమిత నిశిత శరము
లను వేసి బిట్టుగ లాఘవమొప్పగ కుంభ కర్ణుడు,ననికూల గాను
రావణుని పరిమార్చగ దనుజ వినాశకుని రాముని దలచు కొందు నెపుడు
(పరసు= పోడిమి, యోధనుడు= యుద్దము చేయువాడు)
||ఆ.వె|| శ్రీ రఘు కుల దివ్య చింతామణి యనగ
సకల సద్గుణముల సవరు అనగ
దాశరధి యనగను ధర్మ స్వరూపుడు
రామ విభుడు తానె రక్ష మనకు
శీనా శ్రీనివాస్ గారూ,
రిప్లయితొలగించండిసవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
‘సవరు + అనగ’ అన్నచోట యడాగమం రాదు అంటే విసంధిగా వ్రాయాలని కాదు. అక్కడ ‘సవ రనంగ’ అనండి.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
కె ఈశ్వరప్ప గారి పద్యము దుశ్శాసనుడనను దుర్మార్గభావాలు
రాముని చేతిలోలయముగావ
ఆశకు నియమాలక౦తు లేకున్నచో
నాశనాని కదియె నాంది పలుకు
నొ సుయోధనుడవై నోర్పుగ నుండగ నా౦జనేయు చెంత నదురుగాగ
కుంభకర్ణుడు నీకు గూర్చెడి సాయము లెక్కలేని దదిహుళక్కి యగును
తే.గీ.అన్నిదేలిసిన రావణా నధిపుడనిరి
గర్వ మిన్నాళ్ళు రాముని కళ్ళ బడగ
హతుడ వౌదువు నామాట లాలకించు
రాయబారిగతెలిపెద మాయ వీడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియోధుల మించు సుయోధను డాహవ రంగము నందున రావణుండు
రిప్లయితొలగించండిదుష్ట శాసనముల దుశ్శాసనుడతడు సీతను చెరపట్టి చేసె తప్పు
జానకి రాముని జంపెడి కాంక్షను కోల్వడె సుతులను కుంభ కర్ణు
డును జచ్చె రాఘవుడుద్దండు డై దైత్య నిర్వంశకుని గాను నీరు జేసె
నెల్ల దైత్య నృపుల నేసె నాహవమున
వీర రాఘవుండు విష్ణువతడు
సీత తోడు గాను సిరులను వెలయించె
రామ రాజ్యమొకటి రహిని వెలుగ
seena padyam adbhutam
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండినా పద్యమును తగిన విధముగా సవరించి నందుకు
ధన్యవాదములు
మాస్టారూ! నిజమే ! సేనలన్నియు అనే అనాలి . ధన్యవాదములు
రిప్లయితొలగించండివినుము రావణ! సుయోధనుడ వైనను గాని
రిప్లయితొలగించండి......రామునితో మైత్రి రహి వహించు
సఖుడ మారీచ! దుశ్శాసనుండను నేను
......నా మాట వినవేమి నరుక గలను
నేటి నీ యాశకు నిష్కృతి లేదింక
......బలియౌదు రాముని బాణమునకు
కుంభకర్ణుడు, నేను కూడి యుండగ తోడ-
......సాధ్యము రాముడు చంప నిన్ను
పోవుకాలము నీకాయె, భూమిమీద
నూక లిక లేవు లంకలో సోకులకును
పిరికి మాటలు మాని నీవురక లెమ్ము
వేళ మించిన కష్టము వేగ పొమ్ము.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండినీ దురాశకు నిన్ను నిందించు వనితల
యుసురు తాకగనేల? యసురరాజ
రగులుచున్ వచ్చెడి రామబాణాగ్నికి
కుంభకర్ణుడు కాలి కూలిపోడె?
దుశ్శాసనుడు కాడు దునుమాడ, ప్రజలును
ప్రేమగా పాలించు రామవిభుడు
విను, సుయోధ! నుడువుద నిజము, భక్తితో
శరణు వేడిన జాలు కరుణ జూపు
భూమిజాతను బంధింప క్షేమమగునె?
ధర్మనిష్ఠుడు రఘుపతి దానవేంద్ర
రాము దరిజేర్చు సీతను రాజ! యనుచు
విజ్ఞతన్ బల్కె హితవు విభీషణుండు
ధరణిపైనను సుయోధనుడుగా యశమొంది
రిప్లయితొలగించండిపరకాంత పొందుకై పతన మైతి
దుర్మదమున నీవు దుశ్శాసనుండవై
యవనిజన్ గొనితెచ్చి యఘమొనర్చ
ఘోరరణమునందు కుంభకర్ణుండును
కూర్మిసుతుండును కూలినారు
నీయాశకు నియతినివిడి నీవొనరించి
నట్టి పాపములకు నంతిమముగ
రాముధాటికి నీ పురి రగిలి పోయె
చిఱుయనుజుని మాటలు పెడ చెవిన బెట్టి
చేటుదెచ్చితి లంకకు చెడ్డమదిన
దనుజ జాతియు రణమున తఱిగిపోయె
ధృత్యున్నతోత్సాహ ధీరప్రకర్షంబు
రిప్లయితొలగించండి.........నెనయించెనే సుయోధనుడుగాగ
దుశ్శాసనుఁడునైన దుర్వారరాక్షసా
........ ధముని గూల్చెను దండధరుఁడు గాగ
బీతావహప్రాప్త భేరీనినాదముల్
.........కర్ణపేయముగనా కర్ణుఁడగుచు
గురుతరబ్రహ్మాంశకు నిజరూపంబైన
.........బ్రహ్మాస్త్రమునకు తాఁ బట్టువడియె
ననలునన్నితెఱంగుల వ్యాప్తి జేసి
లంకనెల్లనుఁ గాల్చె కూలంకశముగ
నట్టి ప్రభవోన్నతుండైన నాంజనేయ
విభునకిత్తును నుతులను వేనవేలు.
గురువుగారికి వందనములు.
రిప్లయితొలగించండిఒకానొక అవధానములో బ్రహ్మశ్రీ మాడుగులనాగఫణి శర్మగారికి సరిగ్గా ఇదే దత్తపది మరియు అంశము ఇచ్చినారు. వారియొక్క పూరణ......
దుర్యోధనమీ సైన్యమ
వార్యము దుశ్శాసనగత వక్రప్రతిభన్
క్రౌర్యాంశకు నిజఫలమిది
కార్యంబిదె మంచివాణి కర్ణము వడదే.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
శీనా శ్రీనివాస్ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీసం నాల్గవ పాదంలో ‘నుడువుద’ అన్నారు. అక్కడ యతి తప్పింది. ‘నుడివెద’ సాధురూపం కదా! ‘విను సుయోధ! నుడువును నాదు, భక్తితో’ అందామా?
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘చెడ్డ మదిని’ అనండి.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మాడుగుల వారి పూరణను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిగురువుగారూ దన్యవాదములు.
మన్నింప ప్రార్థన. "‘విను సుయో/ ధ నుడువు/ను నాదు,/ భక్తితో "
గణము తప్పుచున్నది కదా.
"
‘విను సుయో/ ధ నుడువు/ లను నాదు/, భక్తితో
-- --
సరిపోతుందనుకుంటాను.
శ్రీ రాముని గురించి రావణుని తలంపు...
రిప్లయితొలగించండికనగ దుశ్శాసనుడనౌచు ననికి బంప
కుంభకర్ణుఁడు విలుధాటి గూలినాడు
మనసు యోధనుఁడనియెడు మాట మెదిలె
నాదు యాశకు నిప్పులనతడు బోసె.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండినిజమే... మీరు చెప్పిందే సరి!
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ తేటగీతి పూరణ బాగున్నది. అభినందనలు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండి