2, సెప్టెంబర్ 2014, మంగళవారం

నిషిద్ధాక్షరి - 7

గురువుల నిషేధంతో
గణపతిని స్తుతిస్తూ ఆటవెలదిలో
సర్వలఘు పద్యం వ్రాయండి.

31 కామెంట్‌లు:

 1. పరమ శివుని శిరము స్థిర నిలయముగను
  వెలసిన శశిని పెను వెలగ తునక
  పగిది తలచి యెగయ, నగజ వలదనిన
  అలిగిన కరిముఖుని తలచెదనిక!!

  రిప్లయితొలగించండి
 2. శ్రీగురుభ్యోనమ:

  కరిముఖునకు జయము! ఘన శుభకరునకు
  శివుని ప్రియసుతునకు శ్రియము ! దివిజ
  హితుడు, గణములకధిపతి, సుముఖుడు, హిమ
  గిరితనయ తనయున కిడెద నుతులు

  రిప్లయితొలగించండి
 3. విడువక కుడుములను కుడుచు సమయమున
  గళమున గడబిడలు గలిగి నిలువ
  జడల నడుమ కదలి జలములు వెడలగ
  గటగటమను కవుల కవికి ప్రణతి!!

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  విఘ్ననాయకుడు-వినాయకుడు
  సకలఫలదాత- సంపద లిచ్చుగాత :

  01)
  ______________________________

  ఎలుకరవుతు సుముఖు - నిభముఖు శివసుతు
  గణపతి హరిహయు స - కలము నిడగ
  మదిని స్మరణ సలుప - మరిమరి విడువక
  కలుగు చదువు ధనము - కలుగు శుభము !
  ______________________________

  రిప్లయితొలగించండి
 5. జిగురు సత్యనారాయణ గారూ,
  చక్కని ఊహతో రెండు మంచి పూరణలు చేశారు. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *

  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  గురువులునిషేధిస్తూ సర్వలఘువులతో ఆట వెలదిలొ గణపతి స్తుతి
  ఆట వెలది.” స,రి,గ,ప,ని,స ,స,ని ,ప,గ,రి, స,రవముల,త,
  కి,ట,త, ధి, మి,గణపతి నటన మలరె
  జనులు కొలువ కుడుము లును గుడపు టరిసెలు
  దినుచు నొసగు వరములను ముదమున

  రిప్లయితొలగించండి
 7. శివుని యగము గనగ చిరుభయము గలుగ
  నగపు పడతి పొదివి నదుము కొనగ
  నగుచు కరము దులిపి యగమును తగిలెడి
  కరివదనుని మదిని గనుచు గొలుతు.

  రిప్లయితొలగించండి
 8. మాస్టరుగారూ ! చంద్రశేఖర్ గారన్నట్లు మీ మీసముల ఫోటో బాగుంది.

  నాకు తోచిన సమస్య -- మీ సములే పారిపోవు మీసములుండన్

  రిప్లయితొలగించండి
 9. హరికిని తగిలెనట నగడు కన కలువ
  సఖుని కదుపులిడు రసమున చవతి
  దినమున, గజ ముఖుని తిరముగ తలతును
  శివ సుతుడు సతతము శివమిడగను

  రిప్లయితొలగించండి
 10. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘అగము’ అంటే పాము అనే అర్థం ఉన్నా, ఆ శబ్దాన్ని వినగానే కొండ, చెట్టు మాత్ర్రమే గుర్తుకు వస్తాయి. కనుక అక్కడ ‘శివుని యురగముఁ గనఁ జిరుభయము..’ అందామా?
  మీసాలతో నా ఫోటో నచ్చినందుకు ధన్యవాదాలు. మీరు సూచించిన సమస్య బాగుంది.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. పూజ్యగురుదేవులకు వందనములతో..

  శుభము గలుగు నెపుడు సుముఖుని దలచిన
  విరుల నొసగి గొలువ సిరులు గురియు
  కుడుము లిడిన జనుల నిడుములు తొలగును
  పరశు ధరుని గొలిచి ప్రణతులిడుదు!!

  రిప్లయితొలగించండి
 12. కరి ముఖుని గొలువ కలిమిని నొసగును
  రమణి !కొలువు మిపుడు రహిచె లగగ
  కొలువ మనకు నొసగు కుడుములు మఱియును
  దరగ నినిధు లచయ మరయు బాల !

  రిప్లయితొలగించండి
 13. తొలి గురువెవరనగ తొలుతను పలికెద
  గణపతి నిను దలచి గణము లకును
  కవితలకు నధిపతి గణపతి యగునని
  తెలిసి గొలుతు నెపుడు తెలివి గలిగి

  రిప్లయితొలగించండి
 14. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. ‘కరివదనుని గొలువ’ అనండి.
  *
  శీనా శ్రీనివాస్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. మల్లెల వారి పూరణలు

  మొదట కొలువ వలెను ముదము మిగులు దివి
  జ తతి కొలువ మునుపె జగతి జనులు
  గణపతి! గిరిజ సుత! గళము లవి కొలువ
  కుడుము లవియు, నరిసె కుడువనిడమె

  జగతి జనులు సుఖము సరిగను వరలగ
  మొదటి కొలుపు శివజు కదియ నిడరె
  పనస మొదలు నగుచు ఫలముల నిడుచును
  గరిక పరకలిడుటె ఘనపు కొలుపు

  రిప్లయితొలగించండి
 16. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  గడప గడపకరిగి కడు కుడుములు తిని
  యిడుములు కలుగవని హితవు బలికి
  కరము శుభము లిడెడు గణముల కధిపతి
  గణపతికి సతతము ప్రణతులిడెద

  నిన్నటి సమస్యకు నా పూరణములు

  కడికొఱకు వెతుకులాటలు
  గుడిశయు లేకుండ బ్రతికి కుందుట కాకన్
  కడు సౌఖ్యముగా జీవిం
  చెడు కాలమె జనుల కెపుడు సేమముఁ గూర్చున్.

  కొడుకుల వలె కూతురులు
  న్నడుగడుగున సేవ చేయు నల్లుళ్ళును సం
  దడి చేసెడి మనుమల గాం
  చెడు కాలమె జనుల కెపుడు సేమముఁ గూర్చున్.

  రిప్లయితొలగించండి
 17. హరుసుతుడ! గజముఖు!డనవరతము మది
  తలతు మనమున సతతమును నిలచి
  కరము దయనొసగుము వరములనిడుమయ
  యెలుక వహమున వెస నిట కడుగిడి

  రిప్లయితొలగించండి
 18. నిన్నటి పూరణ:
  శ్రీ వేంకటేశా!
  అడుగడుగున దండములిడి
  విడువక నీ నామజపము వేడుక జేయన్
  దడబడ నీయక వరమి
  చ్చెడు కాలమెజనుల కెపుడు సేమము గూర్చున్!
  నేటి నిసిద్ధాక్షరి:
  మదిఁ దలచిన పనులు వదలక నడుగిడ
  కరివదన! యవియె సుకర మగునట
  తొలుత నిను గొలచిన తుది విజయ మమరు
  నిడుము లెరుగని గతి నెగడు ప్రభువ!

  రిప్లయితొలగించండి
 19. స్వరము లయల నిడగ వరదుడు గణపతి, వరము లిడును మనకు భజన పలుక
  సిరుల వరద గురియు చిరుగనులఘనుడు ,
  కరము కరము గలుప కరుణ జిలుకు
  కొరుప్రోలు రాధ కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 20. కొలిచెద ప్రధమముగ, తలచెద ననవర
  తము మనమున సుముఖ! దయను గనుము
  కరివదన! యిడుమధిక సుఖశమములను
  వెలయు జగతి సతము కలతలడగ

  రిప్లయితొలగించండి
 21. సుబ్బారావు గారూ,
  పద్యం చివర ‘బాల’ అని దీర్ఘాన్ని ప్రయోగించారు. ‘చయ మరయు మబల’ అనండి.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘గిరిజాసుత’ అనవలసింది కదా... అక్కడ ‘ఉమ కొడుక’ అందామా?
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  నిన్నటి సమస్యకు రెండు పూరణలు, నేటి పూరణ అన్నీ బాగున్నవి. అభినందనలు.
  నిన్నటి రెండవ పూరణలో ‘కొడుకుల వలెను కుమార్తెలు/ నడుగడుగున...’ అనండి.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘గజముఖ! యనవరతము...’ అనండి.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  నిన్నటి, నేటి పూరణలు రెండూ బాగున్నవి. అభినందనలు.
  *
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. మాస్టరుగారూ ! ధన్యవాదములు. చక్కని సవరణ చేశారు. మూడవపాదంలో అగము ఉన్నా మొదట ఉరగము వ్రాశాము కాబట్టి అన్వయం సరిపోతుందని మార్చలేదు.
  మార్పు జేసిన పూరణ...

  శివుని యురగము గన జిరుభయము గలుగ
  నగపు పడతి పొదివి నదుము కొనగ
  నగుచు కరము దులిపి యగమును తగిలెడి
  కరివదనుని మదిని గనుచు గొలుతు.

  రిప్లయితొలగించండి
 24. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు.

  ప్రమథగణ యుత! గణపతి! గజముఖ! శివ
  తనయ! సుముఖ! వరద! ధవళ వపుష!
  ఖనక రథిక! పరశుకర! హరిహయ! ఘన!
  కలుము లిడుచు జనులఁ గరుణఁ గనుమ!

  రిప్లయితొలగించండి
 25. కె యస్ గురుమూర్తి ఆచార్య వెలుగోడు
  సకల మయిన పనులు సరిగ జరుగుటకును
  సులభ పథమునొకటి తెలిపెద విను
  కుడుములిడిన మెసగి యిడుమల నడచెడు
  దొరను గణపతినిక తొలుత దలతు

  రిప్లయితొలగించండి

 26. కె.ఈశ్వరప్ప గారి పూరణ :భవిత కెపుడు ప్రగతి బలమును నిడునని
  కవుల మనసు దలచ ,కలము బదులు
  శివుని సుతుని దలచి స్థిరముగ బలుకగ
  వరము లొసగు మనకు కరుణ నిలుపు

  రిప్లయితొలగించండి
 27. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కె.యస్. గురుమూర్తి ఆచార్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పదంలో ‘జరుగుటకును’ అన్నప్పుడు గణదోషం. ‘జరుగుటకు’ అంటే సరి.
  *
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. తొలుత తలతు నతని తొడగగ పనులను
  గడములనిడక గనగ గణపతిని
  వివిధ గతుల కొలుతు విభవము లలరగ
  పరగ జయము బడయ భవుని తనయు

  రిప్లయితొలగించండి
 29. సకల సుఖములొసగును కరివదనుడని
  ముదమున మనమున తలచుచు
  సతతము హరిహయుని చరణము లెడలక
  నమనము సలుపెద ఘన వరధరుని

  రిప్లయితొలగించండి