11, సెప్టెంబర్ 2014, గురువారం

పద్యరచన - 673 (ఎండమావులు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“ఎండమావులు”

20 కామెంట్‌లు:

 1. మండే గుండెలు కోరుచు
  నుండును బంధువులయండయుండగ నెపుడున్
  దండగయె యెండ మావుల
  నిండుగ నీటిఁ గని త్రాగ నెంచి పరుగిడన్

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  ఎన్నికల వాగ్దానములు-యెండమావులు గదా :

  01)
  _____________________________

  అరచేతిని వైకుంఠము
  సరి నిలిపెద మే మటంచు ♦ చాటెద రదిగో
  బరిలో నిలిచిన నేతలు
  మరి మరి జెప్పునవి యెండ ♦ మావులు గదరా !
  _____________________________
  బరి = ఎన్నికల బరి

  రిప్లయితొలగించండి
 3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. ప్రియులిచ్చు వాగ్దానములు కూడా యెండమావులే :

  02)
  _____________________________

  కోరిన ప్రాణం బిచ్చెద
  కోరుకొనుము ! నన్ను నమ్ము - కోమలి యనుచున్
  కూరిమి గాండ్లిచ్చు నుడులు
  మారునుగా తుదకు నెండ - మావుల సరణిన్ !
  _____________________________

  రిప్లయితొలగించండి
 5. నెల కైదు రెట్లిస్తా మనుటయూ - యెండమావే గదా :

  03)
  _____________________________

  జోరుగ నిచ్చెదము నెలకు
  జేరిన రూపాయ కైదు ! - చే జార్చకుడీ !
  జేరిన నా చీటీలవె
  మారునుగా కడకు నెండ - మావులె యనగన్ !
  _____________________________

  రిప్లయితొలగించండి
 6. జలమది యున్నదను భ్రమలు
  కలుగుట నీ రీతి యంద్రు; కనరావుగ నీ
  యిలలో నెన్నడు ;జనులను
  పలువురనూరించుచుండు భ్రాంతుల్ కాదే!

  రిప్లయితొలగించండి
 7. పావురాలు పంచెత్తుక పోతే -నలుడికి మిగిలిన దెండ మావే గదా !

  04)
  _____________________________

  దూరమున గాంచి పంచెను
  పారావత గుంపు పైకి - బడ విసిరినచో
  పారావత గుంపెగసిన
  మారాజుకు మిగిలె నెండ - మావే యెదుటన్ !
  _____________________________

  రిప్లయితొలగించండి
 8. వసంత కిశోర్ గారూ,
  మీరు తాజాగా పంపిన మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  నాల్గవ పూరణలో ‘పారావత గుంపు’ అనడం దుష్టసమాసం. అక్కడ ‘పారావత చయ మెగసిన’ అందాం.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. యిలలోన నరులెల్ల నిహలోక సుఖమెంచి
  పగలురాత్రి యనక పరుగులెత్తి
  అన్నదమ్ములనుచు నాలుబిడ్డలనుచు
  ననుబంధ జాలమ్ము నల్లుకొనుచు
  ఆస్తిపాస్తుల యందు నఖిల సౌఖ్యములందు
  మిగుల మక్కువ తోడ పొగులు కొనుచు
  స్వార్ధచింతనగల్గి వంచించి తన్నుతా
  నహము మనమునిండనలముకొనుచు

  పుట్టినప్పటి నుండి యీపుడమిమీద
  సతతము సమస్యలనగుచు సతమతమ్ము
  నెండమావులలో త్రాగ నెంచి నీరు
  వాని వెనుకనె మూర్ఖుడై పరుగుదీయు

  రిప్లయితొలగించండి
 10. నాయకుల మాటలనెపుడు నమ్మవద్దు
  యెండ మావుల లోన నీరెట్లు దొరకు
  నోట్లకోసమే వారెన్ని పాట్లఁ బడిన
  పదవినెక్కిన పిదప ను ప్రజలఁగనరు

  రిప్లయితొలగించండి
 11. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మంచి సీసపద్యాన్ని చెప్పారు. బాగుంది. అభినందనలు.
  పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘వద్దు + ఎండ’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘నమ్మకూడ/ దెండమావులలోన...’ అందాం.

  రిప్లయితొలగించండి
 12. మొన్నటి సార్వత్రికమౌ
  యెన్నిక లందున వరాల నిచ్చెడు విధమున్
  గన్నన్ బరిలో నాయకు
  లన్నల వర 'యెండమావు ' లవియే కాదే!

  రిప్లయితొలగించండి
 13. వినగను నేతల మాటలు
  వినసొంపుగ నుండు మరిని వీనుల కెపుడు
  న్కనగను జేతల రూపము
  మనకుంగా నవియ యెండ మావులె సుమ్మీ

  రిప్లయితొలగించండి
 14. నీరము వలె కనిపించుచు
  చేరగమరి దూరమగుచు చీదఱ బెట్టున్
  నీరీతి యెండమావులె
  ధారుణిలో మమతలన్ని దశరధరామా !

  రిప్లయితొలగించండి
 15. మరి కొన్ని విషయములు.

  - చంద్రమౌళిగారు "మండే గుండెలు" అన్నారు. మండెడు అన్న సాధుస్వరూపంతో సరిజేసుకుంటే బాగుంటుంది. అట్లాగే "అండయుండగ" అన్న యడాగమం సరికాదు, నుగాగమంతో "యండనుండగ" అని సాధువు చేయవలసి ఉంది. వారి సీసపద్యం‌బాగుంది. తొలుతనే యడాగమం తీసేయండి! అలాగే "సమస్యలనగుచు" అనటం ఒప్పదు. ఎతుగీతిని కొంచెం సవరించి అన్వయం కూడా సుభగం చేయాలి.

  -వసంతకిశోరులవారు. "అరచేతిని" కాక "అరచేతను" అనవలసి యుంటుంది. మరొక పద్యంలో కోరు పదాన్ని పునరుక్తి చేసారు - అదంత ఉచితం కాదు, పునరుక్తులు పరిహరించండి. అలాగె "ఇచ్చు నుడులు" అన్న ప్రయోగం అంత కళగా లేదు. ఆ పాదాన్ని "కూరిమి గాండ్లాడు నుడులు" అంటే కొంచెం‌ నయంగా ఉంటుంది. పారావతచయము అనండి పారావతం సంస్కృతం కాబట్టి పరపదం గుంపుఅని వేయరాదు.


  - లక్ష్మీదేవిగారు. "జలమున్న దనెడు భ్రమయది" అనండి. అంద్రు అనటం బదులు అండ్రు అని గ్రంథబాహుళ్యప్రయుక్తమైన మాట వాడండి. అలాగే అన్వయ సుభగత కోసం "పలువుర నూరించు నిట్టి భ్రాంతులు సతమున్" అనండి.

  - అన్నపురెడ్డీవారి పద్యం బాగుంది సుళువుగా.

  - సహదేవుడు గారి కందం చివరిపాదంలో మార్పుచేయాలి. అన్వయం‌ కావటం లేదు.

  -సుబ్బారావుగారు. వినగను అని పునరుక్తి చేసారు. మార్చి వ్రాయండి.

  -సుజాతగారు. పద్యం బాగుంది. కాని తృతీయపాదం మొదలు సరిగా లేదు. మొదటిపదాన్ని ఔరౌర అనండి సరిపోతుంది. అందమైన పద్యం

  రిప్లయితొలగించండి
 16. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘విధమున్ + కన్నన్ = విధము న్గన్నన్’ అవుతుంది.
  *
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  శ్యామలీయం గారూ,
  మీరు స్నేహభావంతో, భాషాభిమానంతో చేసిన సమీక్ష ప్రశంసనీయం, మీ సూచనలు ఔత్సాహిక పద్యకవులకు శిరోధార్యాలు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 17. కవిమిత్రులారా,
  శ్యామలీయం గారు సుహృద్భావంతో చేసిన సూచనలను గమనించి దోషసవరణలు చేసికొనండి.

  రిప్లయితొలగించండి
 18. శంకరార్యా ! ధన్యవాదములు !

  మిక్కిలి వాత్సల్యంతో కడు చక్కని సూచనల నందజేసిన
  శ్యామలీయం గారికి ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 19. guruvu gaariki dhanyavaadamulu.savarincina padyam:

  మొన్నటి సార్వత్రికమౌ
  యెన్నిక లందున వరాల నిచ్చెడు విధమున్
  గన్నన్ బరిలో నాయకు
  లెన్నిన పలు యెండమావు లెంచగ తరమే ?

  రిప్లయితొలగించండి