రావిపాటి లక్ష్మినారాయణ
రామాయణము-
సీ. (అన సుయోధనఖలుఁ డలుకఁ దాడితభోగి
వలెను బుస్సని, వెస బంట్ల నంపి)
నిలు వంటయింటికుందెలు వయి తని, తోక
కగ్ని నంటింపించి, యనిపెఁ ద్రిప్ప;
స్వసఖజు వహ్ని గాల్పకయుండె, లంకఁ బా
వని గాల్చె, మంటార్పుకొనె, దనుజులు
(పట్టఁబోవఁగ హరి వారి వారించి, గ
ర్జనముచేఁ దనరి, విరాడ్గతిఁ జనె)
గీ. నంగదాదుల వద్దకు నబ్ధిదాటి,
వారిఁ గలిసి యరిగిఁ రామభద్రు కడకు
గంటి సీత మన్మాత లంక నని పలికి
పూస గ్రుచ్చినగతి సర్వము న్నుడివెను. (౯౩)
భారతము-
ఆ. అన సుయోధనఖలుఁ డలుకఁ దాడితభోగి
వలెను బుస్సని, వెస బంట్ల నంపి
పట్టఁబోవఁగ హరి వారి వారించి, గ
ర్జనముచేఁ దనరి విరాడ్గతిఁ, జనె. (౯౩)
టీక- సుయోధనఖలుఁడు
= (రా) రావణుఁడు, (భా) దుర్యోధనుఁడు; హరి = (రా) హనుమంతుఁడు,
(భా) కృష్ణుఁడు; విరాడ్గతి = (రా) పక్షివలెను, (భా) విరాడ్రూపముచే, తాడిత = కొట్టబడిన; భోగి = పాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి