కవిమిత్రులకు నమస్కృతులు. నిన్న మరణించిన నా బాల్యమిత్రుని కర్మకాండ ఈ రోజు సాయంత్రం జరుగనున్నది. పూనా నుండి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఈరోజు చేరుకుంటున్నారు. రాత్రి వరకు నేను బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. ఈలోగా దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
కవిమిత్రులకు నమస్కృతులు. మిత్రుని అంత్యకర్మకు వెళ్ళి రావడం వల్ల ఈరోజు కూడా మీ పూరణలను సమీక్షించలేకపోయను. మన్నించండి. పూరణ లందించిన మిత్రులందరికీ అభినందనలు.
అంతంబై యొకడు దివ
రిప్లయితొలగించండిప్రాంతమ్మున తోడు లేక వగచెడి వేళన్
చెంతకు చేరు సఖుడనుచు
సంతోషముఁ గూర్చు బాల్యసఖు మరణమ్మే!!
ఎంతో బాధను పెంచి య
రిప్లయితొలగించండిసంతోషముఁ గూర్చు బాల్యసఖు మరణమ్మే
చెంతన్ దన జ్ఞాపకముల
కంతే లేకుండ పోయి కన్నులు చెమరెన్
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్న మరణించిన నా బాల్యమిత్రుని కర్మకాండ ఈ రోజు సాయంత్రం జరుగనున్నది. పూనా నుండి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఈరోజు చేరుకుంటున్నారు. రాత్రి వరకు నేను బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు.
ఈలోగా దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
చెంతకు చేరగ మిత్రులు
రిప్లయితొలగించండిసంతోషము గూర్చు; బాల్య సఖు మరణమ్మే
నెంతటి వారల కైనన్
చింతను కలిగించి కనులు చెమరించునుగా.!!
చింతలు లేనట్టి బ్రతుకు
రిప్లయితొలగించండిసంతోషము గూర్చు, బాల్య సఖు మరణమ్మే
సంతమసముఁగలిగించును
కాంతునె? యట్టి హితుననెడి కలత దహించన్
కొంత సుఖమ్మును తోడనె
రిప్లయితొలగించండియెంతో దుఃఖము నొసంగు నీ జీవనమున్
శాంతముగ వీడెనంచును
సంతోషము గూర్చు బాల్యసఖు మరణమ్మే
పూజ్యులుఉరుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండివింతగస్నేహము కలిసిన
సంతోషముఁగూర్చు. బాల్యసఖు మరణమ్మే
సంతాపము.ప్రార్ధింపగ
శాంతినొసగి ప్రభువు తనదు సన్నిధి జేర్చున్
కె .యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిసంతాన మిడిగె నెంతయు
శాంతముగ బ్రతికె నెనుబది సంవత్సరముల్
వంత నెరుగడావంతయు
సంతోషముఁ గూర్చు బాల్యసఖు మరణమ్మే!!
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండివింతౌ వినోద ముభవుడు
చింతలఁ దీర్చును, మరియును, చింతలఁ గూర్చున్.
అంతంబు నాత్మ జేర్చును.
సంతోషముఁ గూర్చు బాల్యసఖు మరణమ్మే
చింతింప సిఖము, దుఃఖము
వింతౌ చక్ర భ్రమణము, వేడుక శివుకే
అంతం బాత్మనుఁ జేరుచు.
సంతోషముఁ గూర్చు బాల్యసఖు మరణమ్మే
అంతం బవగను, మనకును
చింతా, జీవుడు తలపగ చేరడె భవునే,
వింతగ నాత్మకు చెరవిడ,
సంతోషముఁ గూర్చు బాల్యసఖు మరణమ్మే
వింతౌ గద, వే సఖుడిల
నంతంబై, చేరును గద యాత్మయె ముక్తిన్.
చింతింపంగను మనకిల
సంతోషముఁ గూర్చు బాల్యసఖు మరణమ్మే
సాంతము జీవిత సౌఖ్యము
రిప్లయితొలగించండికాంతా సుతులంద కీర్తి కనకాది సిరుల్
యెంతైన దాన గుణుడన
సంతోషముఁ గూర్చు బాల్య సఖు మరణమ్మే
కె.ఈశ్వరప్ప గారిపూరణ
రిప్లయితొలగించండిగంతలకలియుగమందున
చింతించుట కష్టమనుచు శివునితొ జేరెన్
సొంతము కాదీ జగమని
సంతోషముఁ గూర్చు బాల్యసఖు మరణమ్మే!!
రిప్లయితొలగించండిసంతోషమా యిదియ మరి
సంతోషము గూర్చు బాల్య సఖు మరణ మ్మే
సంతో ష ముకా నిదిలను
సుంతైనా గలదె సామి ! చోద్యము సుమ్మీ
చింతనc జేయగ మరణము
రిప్లయితొలగించండిచింతనుc గూర్చును సఖులకు చిత్తము నందున్,
చింత యది వియోగము ని
స్సంతోషముగూర్చు బాల్య సఖు మరణమ్మే!
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
చెంతకు చేరగ మిత్రులు
రిప్లయితొలగించండిసంతోషము, గూర్చు బాల్యసఖు మరణమ్మే
వంతను, తలపగ దైవమ
దెంతయు కలియుట, విడుటల వేలను చేసెనో!
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిమిత్రుని అంత్యకర్మకు వెళ్ళి రావడం వల్ల ఈరోజు కూడా మీ పూరణలను సమీక్షించలేకపోయను. మన్నించండి. పూరణ లందించిన మిత్రులందరికీ అభినందనలు.
చింతలు వంతలు దీర్చుచు
రిప్లయితొలగించండివింతగ సుఖశాంతులనిడు విశ్రాంతియె తా
వంతుగ ననువుగ వచ్చిన;
సంతోషముఁ గూర్చు బాల్యసఖు మరణమ్మే!
రిప్లయితొలగించండిచెంతన మిత్రుల కలయిక
సంతోషముఁ గూర్చు ;బాల్యసఖు మరణమ్మే
చింతను గూర్చు జిలేబీ
స్వాంతమ్మును చిక్క బట్టి సంయానింపన్ !
జిలేబి