3, సెప్టెంబర్ 2014, బుధవారం

సమస్యా పూరణం – 1512 (తెల్లని మీసములె సొబగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తెల్లని మీసములె సొబగు తెలుఁగుల కెల్లన్.
ఈ సమస్యను సూచించిన ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

27 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    అన్నీ తెల్లబడితేనే గదా - బ్రతుకు తెల్లారేది :

    01)
    ______________________________

    తుళ్ళెడి వయసున నందము
    నల్లని మీసములు మిగుల ♦ నల్లరి జేయన్ !
    త్రెళ్ళగ గొల్లని దలచుచు
    తెల్లని మీసములె సొబగు ♦ తెలుఁగుల కెల్లన్ !
    ______________________________
    గొల్లఁడు = గోపాలకుఁడు(శ్రీకృష్ణుడు,పరమాత్మ)
    త్రెళ్ళు = పడు, రాలు

    రిప్లయితొలగించండి
  2. మల్లెల స్వచ్చత గలిగిన
    చల్లని మనసున్నవారు, శాంతికి దూతల్,
    తల్లజ కపోత చిహ్నలు
    తెల్లని మీసములె సొబగు తెలుఁగుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  3. మల్లెల గంధము సోకగ
    పల్లెల నివసించి జాన పదములు ( బాడన్,
    కల్లయు కపటము లెరుగని
    తెల్లని మీసములె సొబగు తెలు (గులకెల్లన్
    కొరుప్రోలు రాధ కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  4. కల్లా కపటముల విడచి
    తెల్లముఁ జేయుచు నిజముల తేకువ తోడన్
    మల్లెలవలె మను వృద్ధుల
    తెల్లని మీసములె సొబగు తెలుగుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  5. అల్లన కంది గురుల కా
    తెల్లని మీసములె సొబగు; తెలుఁగుల కెల్లన్
    ఉల్లమలరించు బ్లాగును
    మల్లుని వలె నిర్వహించు మాంత్రికుడతడే!
    (మల్లుడు=శ్రేష్ఠుడు అనే అర్థంలో)

    రిప్లయితొలగించండి
  6. నాల్గవ పాదం ముగింపు ఇంకోరకంగా:
    అల్లన కంది గురుల కా
    తెల్లని మీసములె సొబగు; తెలుఁగుల కెల్లన్
    ఉల్లమలరించు బ్లాగును
    మల్లుని వలె నిర్వహించు మంత్రియు నతడే!
    (మల్లుడు=శ్రేష్ఠుడు; మంత్రి=ఆలోచనకర్త అనే అర్థంలో)

    రిప్లయితొలగించండి
  7. చెల్లుని ఉత్తర వాసికి
    నెల్లపుడున్ మీస లేమి,ఇటయువతకు నా
    నల్లని మీసము, పెద్దకు
    తెల్లని మీసములె సొబగు తెలుఁగుల కెల్లన్.

    రిప్లయితొలగించండి
  8. శ్రీగురుభ్యోనమ:

    ఎల్లలు దాటుచు పద్యము
    లెల్లరకున్ దెల్లమాయె నెన్నగ నేడీ
    తెల్లని యశ చిహ్నము లీ
    తెల్లని మీసములె, సొబగు తెలుఁగుల కెల్లన్
    (గురువుగారి మీసములె)

    రిప్లయితొలగించండి
  9. గురువుగారికి వందనములు.

    ఎల్లలు లేని విధంబున
    నుల్లాసముగా కవిత్వమున్నతరీతిన్
    చెల్లఁగఁ జేసిరి, తేటన్
    తెల్లని "మీసములె" సొబగు తెలుఁగులకెల్లన్.

    తేటతెల్లగా అంటే ప్రస్ఫుటంగా

    పద్యకవిత్వాన్ని పోషిస్తున్న మీరు, మీతో సమనమైనవారే కదా తెలుగుకు సొబగు.

    రిప్లయితొలగించండి
  10. ఎల్లరి మన్నన బొందుచు
    నల్లరి మనుమళ్ళ తోడ నాడుచు నెపుడున్
    పిల్లలుగ మారు పెద్దల
    తెల్లని మీసము లెసొబగు తెలుఁగుల కెల్లన్ !

    రిప్లయితొలగించండి

  11. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    చల్లగ పరిపాలించగ
    తెల్లని మీ .సములె సొబగు, తెలుగుల కెల్లన్
    నుల్లమున ప్రగతి గోరుచు
    నెల్లరు ప్రతి పక్ష నేత లేకమ్మవగన్

    రిప్లయితొలగించండి
  12. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    నల్లబజారులు వలదను
    తెల్లని మీసములె. సొబగుతెలుఁగుల కెల్లన్
    అల్లన నలుపును తెలుపును
    కొల్లలు గడ్డమ్మునందు గూడి వసిమ్పన్

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందఱకు వంంద వందనములు.

    ఉల్లము రంజిలఁ జేయుచు
    నెల్లఱ సెవి విందుసేయు నెన్నియొ పద్యా
    లల్లించు కంది శంకరుఁ
    దెల్లని మీసములె సొబగు తెలుఁగుల కెల్లన్!!

    రిప్లయితొలగించండి
  14. కల్లాకపటము తెలియని
    యల్లన మా శంకరయ్య కందము గూర్చెన్
    దెల్లని మీసము లాయవి
    తెల్లని మీసములె సొబగు తెలుగుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  15. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    సంతోషం! మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్చాస్త్రి గారికి,
    చిన్నప్పుడు హిందీ సినిమాలు చూడడం మొదలుపెట్టిన కొత్తలో మీసాలు లేని ఆ హీరోలను చూసి వింతపడే వాణ్ణి. (రాజ్ కపూర్, రాజ్ కుమార్, అప్పుడప్పుడు సునీల్ దత్ మాత్రమే మీసాలతో కనపడేవాళ్ళు)
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చెల్లునట యౌత్తరాహుల/ కెల్లపుడున్...’ అనండి. ‘మీసలేమి’ అనవచ్చునా?
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ధన్యవాదాలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. సుబ్బారావు గారూ,
    ధన్యవాదాలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  17. కె. ఈశ్వరప్పగారి పూరణలు
    1.తెల్లని పంచెయు చొక్కా
    సెల్లా భుజమండు మెరయ చెదరని నగవున్
    యిల్లాలెడురుగ నిలబడ
    తెల్లని మీసములె సొబగు తెలుగుల కెల్లన్
    2.ఇల్లాలి పిండివంటలు
    చెల్లెలి మమకార మెపుడు చెదరక యుండన్
    తల్లీ దండ్రులతండ్రుల
    తెల్లని మీసములె సొబగు తెలుగుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  18. ఉల్లము రంజిలు కథలను
    యల్లన మన ' ఆది భట్ల ' హరికథ లందున్
    చెల్లఁగ జెప్పుచు దువ్వెడు
    తెల్లని మీసములె సొబగు తెలుఁగుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  19. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    హరికథా పితామహుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కథలను + అల్లన’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఉల్లము రంజిల్లెడు కథ/ లల్లన...’ అందామా?

    రిప్లయితొలగించండి
  20. మల్లెల వారి పూరణలు

    నల్లని మీసాలెసొబగు
    నలన యవ్వన మందున, నాపయి వయసే
    మెల్లగ ముదిరిన, వారికి
    తెల్లని మీసములెసొబగు తెలుగులకెల్లన్

    ఉల్లము పరుగిడు వయసున
    నల్లని మీసాల దూకు నల్లన మనసే
    అల్లన తేటయి వయసున
    తెల్లని మీసములెసొబగు, తెలుగులకెల్లన్

    తెల్లని మనసది కలిగియు
    అల్లన సంగీతమటుల, నాడెడి భాషన్
    పల్లుగ యశమార్జించిన
    తెల్లని మీసములెసొబగు తెలుగులకెల్లన్

    అల్లన చిత్రము లందున
    తెల్లని మీసాల వారె, తెలుగు రచయితల్,
    పెల్లగు గురజాడాదిగ.
    తెల్లని మీసములె సొబగు తెలుగులకెల్లన్

    చల్లగ వయసది జారగ,
    నుల్లము నందున మెరుగుగ నుండును తలపుల్
    పిల్లల దిద్దెడి నేర్పున
    తెల్లని మీసములెసొబగు తెలుగులకెల్లన్

    అల్లన నవయుగ కవులై
    పెల్లుగ నాచిలకమర్తి, వీరేశముతా
    తెల్లని మీసముఁ బెంచరె
    తెల్లని మీసములెసొబగు తెలుగులకెల్లన్

    రిప్లయితొలగించండి
  21. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పద్యం:
    ఉల్లము రంజిల్లెడు కథ
    లల్లన మన ' ఆది భట్ల ' హరికథ లందున్
    చెల్లఁగ జెప్పుచు దువ్వెడు
    తెల్లని మీసములె సొబగు తెలుఁగుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  22. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఆరు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘నల్లన యవ్వనమునందు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  23. మల్లునకును భిల్లునకును
    కల్లాకపటమ్ము లేని ఘనగురువునకున్
    మళ్ళిన వయసున నౌలే
    తెల్లని మీసములె సొబగు! తెలుఁగుల కెల్లన్.

    రిప్లయితొలగించండి
  24. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. మాస్టరుగారూ ? ధన్యవాదములు....మీసూచనతో మార్పు చేసిన పూరణ..

    చెల్లునట యౌత్తరాహుల
    కెల్లపుడున్ పేడి మూతి ఇటయువతకు నా
    నల్లని మీసము, పెద్దకు
    తెల్లని మీసములె సొబగు తెలుఁగుల కెల్లన్.

    రిప్లయితొలగించండి
  26. చెల్లగ నరేంద్ర మోడికి
    తెల్లని గడ్డమ్ము తోడ తెల్లని జుత్తున్
    తెల్లని మీసము కనుబొమ;
    తెల్లని మీసములె సొబగు తెలుఁగుల కెల్లన్!

    రిప్లయితొలగించండి
  27. అల్లన చంద్రుల గనుమా!
    గిల్లుచు కజ్జములనాడి గెల్వగననిలో
    చల్లగ మెల్లగ గొరిగిన
    తెల్లని మీసములె సొబగు తెలుఁగుల కెల్లన్!

    రిప్లయితొలగించండి