12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

నిర్వచన భారత గర్భ రామాయణము – 80


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
సీ.      వచ్చి రాముశరణుఁ జొచ్చె విభీషణుం;
డతని దాశరథి లంకాధిపతిగ
సలుపుదు ననె; వార్ధి యలరి మిన్నందె ఖ
లుఁడు సచ్చునని; రాఘవుఁ డుదధి తన
కడ్డుపడెనని; సాయక మేయఁ బూనఁ,
న్పడి సముద్రుఁడు సెప్ప నలునివలన
సింధుఁ గట్టెను; లంకఁ జేరె నంగదు సంధి
కై యంప నాఱుమూడయ్యె నదియు;
గీ.      (నెఱి నటుల సంధి చెడుటయు హరి యరిగె ని
యోక్తుపాలి కంతట సునయోత్కరములు
తననుడులు, జవాబరిపట్టఁ దను మొదలిడు
ట యఖిలము పలికెన్) బెల్లు నయముగ విని. (౯౫)

భారతము-
కం.     నెఱి నటుల సంధి చెడుటయు
హరి యరిగె నియోక్తుపాలి కంతట సునయో
త్కరములు తననుడులు, జవా
బరిపట్టఁ దను మొదలిడుట యఖిలము పలికెన్. (౯౫)

టీక- హరి = (రా) హనుమంతుఁడు, (భా) కృష్ణుఁడు; నియోక్తుపాలికి = (రా) రామునికడకు, (భా) ధర్మరాజుకడకు; అరి = శత్రువు; తనున్ = తన్ను, పట్ట మొదలిడుట, సాయకము = బాణము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి