12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

దత్తపది - 4 (చింత-నిమ్మ-మామిడి-వెలగ)

కవిమిత్రులారా!
చింత - నిమ్మ - మామిడి - వెలగ
పై పదాలను ఉపయోగిస్తూ
ద్రౌపది కీచకుని అధిక్షేపించడాన్ని
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

29 కామెంట్‌లు:

  1. 'చింత'ను విడు నాపై యీ
    పంతము'నిమ్మ'దిని విడుము బలముందని నీ
    కింత మద'మా! మిడి'సిపడకు
    మింతుల 'వెలగ'ట్ట నీకునెగ్గగు సుమ్మా!

    రిప్లయితొలగించండి
  2. మాను నా చింతన మత్స్య సైన్యాధ్యక్ష
    *****చింత మ్రాను పగిది త్రెంతురోయి
    నిమ్మలమ్ముగనుండు, రమ్మనుచును నాకు
    *****నిమ్మరులను జూప రొమ్ముఁ జీల్చు
    మాలావు గలుగ సుమా! మిడిసి పడకు
    *****మరి వినుమామిడి మర్దనమ్ము
    జరిపెదరిక నీకు, కరి మ్రింగిన వెలగ!
    *****వెల గట్టగలవురా వెలది మహిమ

    చిత్రమె గరుడి ముందు త్రాచింత యెగయ
    కాంక్ష జేసి ననిమ్మహీ కాంత వోలె
    తాక తరమా! మిడి వెలుంగు తరణి నేను
    కోవెల గదిలో చిలకను! కుక్కవీవు!!

    నాకున్ + ఈ + మరులు = నాకు నిమ్మరులు
    వినుము + ఆము + ఇడి = వినుమామిడి
    ఆము = ఆముదము
    త్రాచు + ఇంత = త్రాచింత
    నన్ + ఈ + మహీ కాంత = ననిమ్మహీ కాంత
    మిడి వెలుంగు = తీవ్రమైన వెలుగు / వేడి

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    కీచకునకు సైరంధ్రి నిరసన :

    01)
    _____________________________________

    నిమ్మళము జెడు నియ్యెడ ! ♦ నిజమిది విను
    మా ! మిడిసిపాటు వలననే ♦ మడిసిరి గద
    రావణాది వీరులకట ♦ రణము నందు !
    వెలగ గలవోయి కామమ్ము ♦ వీడినంత !
    బ్రతుకు నిశ్చింత గా నీవు ♦ బ్రతుక గలవు
    నాదు భర్తల చేతిలో ♦ నంతమవక !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    ప్రశంసార్హమైన చక్కని పూరణ చేశారు. దత్తపదుల త్రిగుణప్రయోగం చాలా బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వెలుఁగఁగలవు’ సరియైన రూపము. అక్కడ ‘వెలగబెట్టెడు కామమ్ము వీడినంత’ అందామా?

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా ! ధన్యవాదములు !

    శంకరాభరణమందు :

    అందరికి వసంతకిశోరు - వందనమ్ము !
    అందమైనట్టి పద్యాల - నిందు గనిన
    నెందరెందరొ మిత్రుల - నింద్యముగను
    నాంధ్ర మాతకు నాభర - ణమ్ము లనగ
    నంద జేతురు నిత్య మా - నంద మెగయ !

    రిప్లయితొలగించండి
  7. చింతనమున్ సదా సలుప చేటుగలుంగునటంచుఁ నేఱవే
    కాంతను, నన్యవీర సతిఁ గానకు నిమ్మది నిట్టులెప్పుడున్.
    వింతగు చావు చచ్చెదవు ,భీతిలుమా! మిడిమేలమేలొకో?
    సుంతయు బుద్ధిఁ జూపుమొకచో వెలగంగ మతుల్ శ్రియమ్మగున్.

    రిప్లయితొలగించండి
  8. వసంత కిశోర్ గారూ,
    సంతోషం!
    ‘మిత్రు’ తరువాత స్పేస్ ఇవ్వండి. ‘మిత్రు లనింద్యముగను’ అని.. లేకుంటే ‘మిత్రుల- నింద్యముగను’ అని అర్థం మారే అవకాశం ఉంది.
    *
    లక్ష్మీదేవి గారూ,
    చక్కని వృత్తాన్ని రచించి అలరింపజేశారు. అభినందనలు.
    వసంత కిశోర్ గారు చేసిన పొరపాటే మీరూ చేశారు. ‘వెలుగంగ’ సరియైన రూపం. దానిని సవరించండి.

    రిప్లయితొలగించండి
  9. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. చింత వలదుర కీచక! నింతిపైన
    నిమ్మళమ్ముగ లేకున్న నీకు సరి సు
    మా! మిడిసి పడబోకురా మత్తికాడ
    వెలగబెట్టిన దికచాలు వెడలిపొమ్ము !

    రిప్లయితొలగించండి
  11. చింత పడెదవు నన్నడ్డి చిక్కు వడుచు
    వెళ్ల నిమ్మని వేడిన వీడ వేమి?
    తొలగుమా మిడిసి పడక! త్రుల్లి పడకు
    వెల గలుగు నాదు పతులతో వేగ లేవు!

    రిప్లయితొలగించండి
  12. చింత కూడదు పరదార చెంత చేర
    సాధ్వి కిన్ వెలఁగట్టుట సాధ్య మగునె?
    కీచకాధమా! మిడితోడ కీడు గలుగు
    నిమ్మహిన్మత్పతులఁ దాక నెవరి తరము?
    మిడి: మిడిసిపాటు

    రిప్లయితొలగించండి
  13. మల్లెల వారి పూరణలు

    "పాపపు చింత నీవు కులభామిని నీవిధి కోరనీచమౌ
    నాపతి దేవులే వెలగ, నాస్థితి కిచ్చట నిన్ను జంపరే!
    నాపయి కామమా! మిడిని నందెదు కీచక! నాశమెమ్మెయిన్.
    ఏపుగ నుండ నిమ్మ! నను నిట్టుల" రుంచును పల్కె ద్రోపదే

    కామము తోడనీవుపర కాంతను కోరుట నీచ చింతయౌ
    నామగ లేవురా గతిని నర్మము నిమ్మహిఁ గాచుచుండగా
    సేమమ నందుమా! మిడిని చెందకు నాశము నెందు నీభువిన్
    భామయె క్రోధమున్ వెలగ, పర్వును కీచక మిత్తియప్పుడే

    రిప్లయితొలగించండి
  14. వెలగబెట్టగ చూచితి తెలివి నీది
    మడియగలవిక మానుమా ! మిడిసి పాటు
    భర్తలేవురు నిమ్మహి భయములేక
    నన్నుగాచును చింతయే నాకులేదు.

    రిప్లయితొలగించండి
  15. చింతను బెట్టబోకు మది ఛీ! మద గర్వి! వివేక మెన్న నా-
    వంతయు లేదె నీకు నకటా! వినుమా మిడిమేల మారు నా
    యంతక భీకరుల్ పతు లవశ్యముగా వెలగట్ట నీ బల-
    మ్మింత వచించినన్ వలపు నిమ్మని వేడెద వేల మూర్ఖుడా!

    రిప్లయితొలగించండి
  16. వింత ఇది ఏమి చోద్యము చింత గొలిపె
    నిమ్మ కుండరు నావారు నిన్ను దునుమ
    విడువుమా! మిడిసి పడక వింత కోర్కె
    కిరణ మాలిని బోలిన కీర్తి వెలగ
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  17. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘వెలగ, వెలుగు’ శబ్దాలకు భేదం ఉంది.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వెలుగ’ ను వెలగ అన్నారు.

    రిప్లయితొలగించండి
  18. మనసున చింతవీడుమరి మత్స్యధరాధిప! నాదు రక్షగా
    ననిమిష తేజరూప సుబలాఢ్యులు నుండగనిమ్మహీతలం
    బున నిను రక్షఁసేయ గల భూవరులేరి సుమా! మిడిన్ వడిన్
    గొనకొని వీడుమమ్ము మరి కూరిమి వేఁవెలగంగ నిద్ధరన్.

    వేఁ = వేగముగా
    మిడి = గర్వము,

    రిప్లయితొలగించండి
  19. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీరు కూడా ‘వెలుగంగ’ను ‘వెలగంగ’ అన్నారు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీగురుభ్యోనమ:

    దేహము జీర దీవెలగ దీనపుజావును చావకుండ నీ
    ద్రోహపుచింత మానుమిక, దుర్మతి చచ్చెదవీవు జూడ నా
    బాహుపరాక్రమాయుధుడు పైబడి గ్రుద్దిన, నిమ్మనమ్మునన్
    మోహము వీడుమా, మిడిసి మోదము నొందక నీచకీచకా!

    రిప్లయితొలగించండి
  21. అమ్మ సుధేష్ణ యడిగెను నిమ్మ రసము
    నీ య బోవుదు వెలగ నీ రాయసంబు
    చింత రానీ కుమా మిడి సిదనమునన
    కేలు విఱు తురు లేదేని కీచ కుండ !

    రిప్లయితొలగించండి

  22. విన్నపము -గురువులు, శంకరయ్య గారికి

    విన్న వించు కొందు విన్నప మొక్కటి
    యార్య !యిప్పు డుంటి నమెరికాన
    నందు వలన "పోస్టు "లాలస్య మగుటను
    గరుణ తోడ నన్ను గనుము సామి !

    రిప్లయితొలగించండి
  23. మిత్రులందఱకు నమస్కారములు.

    ||సీ||
    అన్యకాంతలఁ గోరు టధమ కృత్యము గాన,
    ......ననుఁ గోరునట్టి చింత నిఁక మాని,
    నా కడ్డముగ రాక, నన్నుఁ బోనిమ్మన,
    ......నడ్డుపడక వీడుమయ్య వేగ;
    వేదించకయ నీవు విడువుమా మిడిమిడి
    ......జ్ఞానమ్ము నిప్పుడు సభ్యతఁ గని,
    దివ్వెలగమి వెల్గు దీపించు నట్టుల
    ......సచ్చరితుండవై శాంతిఁ గనుము!
    ||గీ||
    లేనిచో నిన్ను నా పతులే నిహతునిఁ
    జేసి, నీ తృష్ణ నడుగంటఁ గోసి, మఱల
    నే యధముఁడిట్లు దుశ్చేష్టఁ జేయకుండఁ
    దగు సమాధాన మిత్తురు తగ విదియని!!

    రిప్లయితొలగించండి
  24. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    అది తివె‘లు’గ.. అనుకుంటాను..
    *
    సుబ్బారావు గారూ,
    మొత్తానికి కిట్టించారు. బాగుంది. అభినందనలు.
    సుధేష్ణకు మద్యానికి బదులు నిమ్మరసం ఇప్పించారు!

    ఎక్కడ నున్నను మీరలు
    చక్కని పద్యముల వ్రాసి సరగున బ్లాగున్
    నిక్కముగ వెలుగజేతురు
    చొక్కపు భాషాభిమాని! సుబ్బారావూ!
    *
    గుండు మధుసూదన్ గారూ,
    నిజంగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. నీదు చింత దీర్చి నిర్గమింపగ జేయు
    వెల గలట్టి పతులు వెన్ను కాయ
    నిమ్మహోగ్ర చింత నెమ్మది నేదాటి
    నిలువు మా! మిడియక నేర బుద్ధి

    రిప్లయితొలగించండి
  26. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    చిన్న పద్యంలో చక్కగా భావాన్ని వ్యక్తం చేసి సమర్థంగా దత్తపదిని నిర్వహించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. గురువుగారు,
    సిస్టమ్ సమస్య వల్ల స్పందించడం ఆలస్యమైనది. మన్నించండి.

    సవరించినపద్యము.

    చింతనమున్ సదా సలుప చేటుగలుంగునటంచుఁ నేఱవే
    కాంతను, నన్యవీర సతిఁ గానకు నిమ్మది నిట్టులెప్పుడున్.
    వింతగు చావు చచ్చెదవు ,భీతిలుమా! మిడిమేలమేలొకో?
    కొంత సుబుద్ధిఁ బెంచుకొని కోవెలగమ్మదిఁ జేయరాదొకో?

    రిప్లయితొలగించండి