జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘కున్ననమున/ నన్నము...’ అనండి. * మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ, శాస్త్రీయకారణంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. * రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘జను లిటు/ లెన్నుచు నవమానపఱుప...’ అనండి. * కొరుప్రోలు రాధాకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిన్నని బుద్దుల వదినలు
రిప్లయితొలగించండితిన్నగ జేసిన వ్యయమ్ము తీవ్రంబనుచున్
సున్నపు తేటను కలిపిరి
అన్నము సున్నం బయె వదినమ్మలు వండన్
అన్నా ! యేమిది చిత్రము !
రిప్లయితొలగించండిఅన్నము సున్నం బయె వదినమ్మలు వండ న్ ?
అన్నము సున్నమ యగునా !
మున్నెన్నడు వినగలేదు మూర్తీ ! నిజమా !
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
ఉడుకుతున్న అన్నంలో పందిరి పైనున్న పాముపిల్ల పడితే :
01)
______________________________
సన్నగ చిన్నగ నున్నది
పన్నగమది, నున్ననైన - పందిరి జారన్
తిన్నగ బడ కున్ననమున
యన్నము సున్నం బయె వది - నమ్మలు వండన్ !
______________________________
కున్ననము = కుండ
రిప్లయితొలగించండినున్నటి ముడిబియ్యపు పొర
నున్న ’కెరోటిను’ దొలగిన సున్నమెమిగులున్
ఛిన్నము ప్రోటీనంతయు
అన్నము సున్నం బయె వదినమ్మలు వండన్
వేములవాడ భీమ కవిని తోటివారు అవమానపరచగా
రిప్లయితొలగించండిమిన్నగ సంఘపు జనులిటు
యెన్నుచు యవమాన పరుప నెంతయునా భీ
మన్నయె శాపము నొసగగ
అన్నము సున్నంబయె వదినమ్మలు వండన్
నిన్నటి సన్నని బియ్యము
రిప్లయితొలగించండివన్నె యొకింత యును లేక బలమును గూర్చన్,
చెన్నుగ తెల్లని బియ్యపు
అన్నము సున్నం బయె వదినమ్మలు వండన్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కున్ననమున/ నన్నము...’ అనండి.
*
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
శాస్త్రీయకారణంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘జను లిటు/ లెన్నుచు నవమానపఱుప...’ అనండి.
*
కొరుప్రోలు రాధాకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిగిన్నెల సున్నంబుండగ
నన్నా గమనింపకుండ నాతుర తోడన్
చెన్నుగ బియ్యము పోయగ
ననము సున్నంబయె వదినమ్మలు వండన్
ఎన్నడు చూడని వింతలు
రిప్లయితొలగించండికన్నుల కనికట్టు జేసె గారడి వాడే!
వెన్నయె జున్నుగ మారెను
అన్నం సున్నం బయె వదినమ్మలు వండన్!
తిన్నగ గడసరి మరదలు
రిప్లయితొలగించండినన్నముఁ జేసెడు వదినల నాటాడించన్
పన్నిన పన్నాగమ్మున
నన్నము సున్నంబయె వదినమ్మలు వండన్!
కవిమిత్రులకు నమస్సులు.
రిప్లయితొలగించండివెన్నను నిడుమను మఱఁదికి
సున్నము నిడఁగాను మగలుఁ జూచి కనలుచున్
వెన్నంత సాఫు చేయఁగ
నన్నము సున్నంబయె వదినమ్మలు వండన్!!
కొన్నిగ నీటిని బోయక
రిప్లయితొలగించండినిన్నిన్నిగ పోసి వండ నెరుగక త్వరగా
నన్నల కొరకై, చూడగ
నన్నము సున్నం బయె వదినమ్మలు వండన్.
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండిఅన్నకు పెండ్లయె, వదినయె
అన్నము వండంగ నెరుగ, దాయమవండన్
ఎన్నగ నందరు, నాడటు
లన్నము సున్నంబయె వదినమ్మలు వండన్
అన్నము క్రొత్తగ వచ్చిన
పున్నెపు పంటది తినగను, ముచ్చటఁగాగన్
అన్నల భార్యల చేతుల
నన్నము సున్నంబయె వది నమ్మలు వండన్
జొన్నలు వండెడి వదినల
మన్ననఁ జేయుచును కోర, మరదులు నెల్లన్
అన్నము వండగ బియ్యపు
నన్నము సున్నంబయె వదినమ్మలు వండన్
మిన్నగ చదువులు చదివియు
పన్నుగ నుద్యోగములను బాగుగఁజేసే
అన్నల భార్యల వంటను
అన్నము సున్నంబయె వదినమ్మలు వందన్
అన్నము నమ్మయె వండన్,
సున్నంబయి కడుపున, వెస సుఖమే కలుగున్
అన్నము నుడుకునపుడె, తా
నన్నము సున్నంబయె, వదినమ్మలు వండన్
అన్నము వండగ నీరున
పన్నుగ బియ్యము నుడుకగ బాగగుకాదే
మిన్నగు నీరున నుడికియు
అన్నము సున్నంబయె వదినమ్మలు వండన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికెయెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిఅన్నము ఎక్కువ తినకో
యన్నా యని వేసిరి గద యన్నము నందున్ సున్నము,హోటలులో నిక
అన్నము సున్నం బయె వదినమ్మలు వండన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండి"అన్నము పెట్టుడి"యను భీ
మన్నకు పల్కిరి వదినలు"అన్నమ! యేదీ,
సున్నమిది” "తథాస్త"నగను
అన్నము సున్నం బయె వదినమ్మలు వండన్!!
కె.ఈశ్వరప్ప గారి పూరణ
రిప్లయితొలగించండిపున్నమి వెన్నెల వోలెను
యన్నము సున్నంబయె వదినమ్మలు వండన్
యన్నా! ముదుసలి సతి ఛ
ద్దన్నము తిననేల నింట నందరు జూడన్
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ ఆరు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
కె.యస్. గురుమూర్తి ఆచార్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అన్నము ఎక్కువ’ అన్నదాన్ని ‘అన్నమ్మెక్కువ’ అనండి
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వోలెను + అన్నము’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వెన్నెల వలె తెలి/ యన్నము...’ అనండి. అలాగే ‘వండన్ + అన్నా’ అన్నప్పుడూ యడాగమం రాదు. ‘వండ/ న్నన్నా’ అందాం.
చిన్నారి మరదలు కలుప
రిప్లయితొలగించండిసన్నని సున్నపు గుళికలు సరసము కొరకై
గిన్నెడు బియ్యము నందున
నన్నము సున్నంబయె వదినమ్మలు వండన్
చిన్నారి శిశువు పెరుగుచు
రిప్లయితొలగించండిపన్నుగ గర్భమ్ము లోన పవళించంగన్
వెన్నెముక బటువు కొఱకై
అన్నము సున్నం బయె వదినమ్మలు వండన్ :)
అన్నలు పేకల నాడుచు
రిప్లయితొలగించండిపన్నుగ త్రాగగను బీరు పండుగ పూటన్...
కన్నులు టీవికి నిడగా
నన్నము సున్నం బయె వదినమ్మలు వండన్