13, సెప్టెంబర్ 2014, శనివారం

సమస్యా పూరణం – 1517 (స్త్రీలకు స్వాతంత్ర్యము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై.

38 కామెంట్‌లు:

 1. బాలిక రక్షణ తండ్రియె,
  యాలికి తీరైన భర్త, యానక కడగా
  పాలన సుతులది కాదని
  స్త్రీలకు స్వాతంత్ర్యమొసఁగఁ జెల్లదు ధరపై.
  ( ధర్మ శాస్త్ర ఉవాచ )

  రిప్లయితొలగించండి

 2. సహదేవుడుగారూ ! " ఉవాచ " బాగుంది.

  పూలతల వంటి వనితలు
  కేలును పైకెత్తి వేసె కేకలు సభలో
  ఏలాగు మనువ ? ఎందుకు
  " స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై ? "

  రిప్లయితొలగించండి
 3. పైపద్యానికి కొనసాగింపు...

  గోలనువిని మనువరచెను
  శ్రీలను పూయించు మీకు చెడు తొలగుటకై
  ఓలలన లార జెప్పితి
  " స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై "

  రిప్లయితొలగించండి
 4. లాలికముఁ బోలి తిన్నది
  చాలక తెగ చెడదిరిగెడి చవటల కట్లే
  శీలము విడచిన వేశ్యా
  స్త్రీలకు స్వాతంత్ర్యమొసఁగఁ జెల్లదు ధరపై!

  రిప్లయితొలగించండి
 5. మేలగు పాలన జరుగును
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసగ, జెల్లదు ధరపై
  నేలకు శుభముల నొసగెడి
  లోలాక్షుల నణచివేయ లోపము గాదా ?!

  రిప్లయితొలగించండి
 6. కవిమిత్రులు గోలి వారికి ధన్యవాదాలు. మీ పూరణలూ బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. మేలగు కుటుంబములకును
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసగఁ జెల్లదు ధరపై
  పాలనకు పనికి రారని
  బేలలుగతలచి పడతుల వేరుగఁ జూడన్

  రిప్లయితొలగించండి
 8. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  ‘న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ అన్న దానికి పద్యరూపం ఇచ్చి చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
  కాని ఈకాలంలో అలా అంటే దురాచారం అవుతుంది.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  స్త్రీవాదుల, మనువు మాటలుగా మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పద్యంలో వనితలు అన్నప్పుడు వేసిరి అనాలి కదా.. ‘కేలెత్తియు వేసినారు కేకలు...’ అందామా?
  *
  మనతెలుగు చంద్రశేఖర్ గారూ,
  వేశ్యలకు స్వాతంత్ర్యమీయరాదన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మనం చూస్తూనే వున్నాం.. రిజర్వుడ్ స్థానాల్లో స్త్రీలు గెలిచినా వాళ్ళ భర్తలే అధికారం చెలాయించడం...
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. మల్లెల వారి పూరణలు

  స్త్రీలే మూలము సృష్టికి
  స్త్రీలకు వరమౌను సంతు. చేడియలిలలో
  స్త్రీలను కనగను వెరచెడు
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసగ చెల్లదు ధరపై

  స్త్రీలల భర్తల విడిచియు
  చాలగ స్వేచ్ఛకు పరుగిడు చంచల మతులై
  బాలీశ వర్తన గలయా
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసగ చెల్లదు ధరపై

  స్త్రీలకు విద్యయు కావలె
  స్త్రీలల నేర్వక చదువుల చెలువము కొఱకై
  శీలము చెడు వేసము లిడ
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసగ చెల్లదు ధరపై

  పాలను నిడకను బిడ్డకు
  స్త్రీలల సొంపుల కొరకయి చెడుటయు తగునా?
  పాలను నిచ్చెడి పట్టున
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసగ చెల్లదు ధరపై

  రిప్లయితొలగించండి
 10. పాలన చక్కగ జరుగును
  స్త్రీలకు స్వాతంత్ర్యమొసగ ; చెల్లదు ధరపై
  జాలిగ బలిపశు వగుటయు,
  నేలిక పురుషాధిపతులు నీతులు చెప్పన్

  రిప్లయితొలగించండి
 11. కాలపు గమనము నందున
  మేలగు మార్పులు కలిగెను మేధిని లోనన్
  స్త్రీలకు శత్రువులౌ నా
  స్త్రీలకు స్వాతంత్ర్యమొసగ జెల్లదు ధరపై

  రిప్లయితొలగించండి
 12. శ్రీగురుభ్యోనమ:

  మేలున్ గీడుల నెంచిరి
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ, జెల్లదు ధరపై
  కాలక్షేపము జేయగ
  పాలకులకు న్యాయమగునె? ప్రభుతా గనుమా

  రిప్లయితొలగించండి
 13. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  నాలుకపైధాత సతిని
  శూలి తనువునందున పురుషోత్తము డెడదన్
  వీలుగ బంధించిరికద
  స్త్రీలకు స్వాతంత్ర్యమొసఁగఁ జెల్లదు ధరపై.
  (

  రిప్లయితొలగించండి
 14. కె యెస్ గురుమూర్తి ఆచ్చార్య గారి పూరణ
  మేలగు మాటలు నుడువక
  వీలు ననుసరించి వదర వినువారెవరీ
  కాలము,మిడిమేలపు శా
  స్త్రీలకు స్వాతంత్ర్యమొసఁగఁ జెల్లదు ధరపై.

  రిప్లయితొలగించండి
 15. కె ఈశ్వరప్ప గారి పూరణ స్త్రీలకు
  స్త్రీలకు శత్రువులెవరా?
  స్త్రీలే గమనించి జూడ చిత్రము గాదా
  స్త్రీలకు నీసులు హెచ్చవ
  స్త్రీలకు స్వాతంత్ర్యమొసఁగఁ జెల్లదు ధరపై.

  రిప్లయితొలగించండి
 16. కాలంబే మారెననుచు
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ, జెల్లదు ధరపై
  యీలీలన్ మరియాదల
  కాలన్ ద్రొక్కననె బాతకాలపువారున్

  రిప్లయితొలగించండి
 17. స్త్రీలను పొత్తము ధనముల
  మాలిమితో నింట నెపుడు మరువక దాచం-
  జాలిన శుభమను పలు కిక
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై.

  రిప్లయితొలగించండి
 18. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  మరియొక పూరణ
  మేలగు భవనము గట్టగ
  చాలిన ధనమిచ్చి పనులు జరుగుట జూడన్
  జాలక నాబాధ్యత మే
  స్త్రీలకు స్వాతంత్ర్యమొసఁగఁ జెల్లదు ధరపై.
  .
  (

  రిప్లయితొలగించండి
 19. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు.


  స్త్రీలనుఁ బూవులవలెఁ జిర
  కాలము కాపాడవలెను; ఖలపురుషుల దౌ
  ష్ట్యాలకు గుఱికాకుంటకు
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై!!

  రిప్లయితొలగించండి
 20. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణలోని చమత్కారము బాగున్నది. మేస్త్రీల రెండవ పూరణకూడా బాగున్నది. అభినందనలు.
  *
  కె.యస్. గురుమూర్తి ఆచార్య గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
  కాని ‘శాస్త్రులు’... శాస్త్రీలు అయ్యారు.
  *
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ ‘పుస్తకం వనితా విత్తం..’ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. గురువు గారికి నమస్కారములు నిన్నటి దత్తపది పూరణలో వెలగ నేను గుర్తించాను కాని అక్కడ పాదంమొత్తం మార్చాల్సిందే
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 22. పాలన బాగుగ నుండును
  స్త్రీలకు స్వాతంత్ర మొసగ , జెల్లదు ధరపై
  స్త్రీలను హింసించుట నిక
  నాలన మరి పా లనయన నంతయు వారే

  రిప్లయితొలగించండి
 23. మాస్టరుగారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు.
  మీరు చూపిన సవరణతో...


  పూలతల వంటి వనితలు
  కేలెత్తియు వేసినారు కేకలు సభలో
  ఏలాగు మనువ ? ఎందుకు
  " స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై ? "


  గోలనువిని మనువరచెను
  శ్రీలను పూయించు మీకు చెడు తొలగుటకై
  ఓలలన లార జెప్పితి
  " స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై "


  కెంబయి తిమ్మాజి రావు గారి మేస్త్రీ ఆలోచన బాగుంది..
  ఆ బాటలోనే నేను కూడా..

  నేల పునాదుల నుండియు
  నేలాగున నిల్లు గట్ట నేర్చినవారిన్
  మేలుగ నుంచుము, చిరు మే
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై

  రిప్లయితొలగించండి
 24. నా మఱొక పూరణము:

  జాలపు నీచపుఁ గూఁతలఁ
  జాలఁగఁ గూయుచును, మిగుల సాపెనలు వెసన్
  బ్రేలుచు, జగడము లాడెడి
  స్త్రేలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై!!

  రిప్లయితొలగించండి
 25. హేలాగతి కార్యంబులఁ
  కాలానుగుణంబుగా విఘాతములేకన్
  మేలుగ జేసితిమెందుకు
  స్త్రీలకు స్వాతంత్ర్యమొసఁగఁ జెల్లదు ధరపై ??

  రిప్లయితొలగించండి
 26. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘వెలదులు + అనగన్’ అన్నప్పుడు సంధి నిత్యం. ‘వెలదు లనంగన్’ అనండి. మూడవ పాదం చివర గణదోషం. ‘మార్చెడి’ అనండి.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 27. పాలను ద్రాపక సంతుకు
  పాలిండ్లను దాచుకొనుచు వగలను బోయే
  బాలల బాగును మరచిన
  స్త్రీలకు స్వాతంత్ర్యమొసగఁ జెల్లదు ధరపై!

  రిప్లయితొలగించండి
 28. పాలను మరువని పాపల
  వేలకు తెగనమ్ము వారు వెలదు లనంగన్,
  నేలను సంతగ మార్చెడి
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసగ c జెల్లదు ధరపై
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 29. కొరుప్రోలు వారూ,
  సంయుక్తాక్షరం ముందున్న తెలుగుపదంయొక్క చివరి అక్షరం గురువు కాదు. సంస్కృత సమాసాంతర్గతమైన అక్షరములే గురువు లవుతాయి. ‘సుందరస్త్రీ, దేవస్త్రీ, క్షత్రియస్త్రీ’ అన్నప్పుడు స్త్రీకి ముందున్న ర,వ,య గు గురువులు. కాని ‘అందమైన స్త్రీ, దేవలోకపు స్త్రీ, క్షత్రియకులపు స్త్రీ’ అన్నప్పుడు న,పు లు గురువులు కావు.
  స్త్రీ సంయుక్తాక్షరం. ద్విత్వాక్షరం కాదు.
  ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే అది ద్విత్వాక్షరం (ఉదా.. క్క, గ్గ, చ్చు, త్తె, ప్పొ మొ.). ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్తాక్షరం. (ఉదా... క్ర, చ్య, త్క, ద్గు, ర్షు మొ.)
  ద్విత్వ, సంయుక్తాక్షరాల గురించి ఇంతగా ఎందుకు చెప్పానో రేపటి ‘నిషిద్ధాక్షరి’లో తెలుస్తుంది.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  చాలారోజుల తరువాత మీ పూరణ వచ్చింది. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 30. గురువు గారికి నమస్కారములు చాలా విలువైన సూచన చేసారు కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 31. లాలనగా పాలివ్వక
  పాలిండ్లను దాజుకొనుచు వన్నె కోసమై
  బాలల బాగును మరచిన
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసగఁ జెల్లదు ధరపై!

  రిప్లయితొలగించండి
 32. నాలుగు కావలె; ...నాకిక
  చాలక పోయిన నొకతెకు చప్పున ననెదన్
  "చాలిక! తలాఖు!!!" ...వమ్ముగ
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై!

  రిప్లయితొలగించండి
 33. బాలుడు సింగును గొనుచును
  జాలియె సుంతయును లేక జంపుచు మెడపై
  వాలము విప్పెడి రోమను
  స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై...

  జంపు = jump

  రిప్లయితొలగించండి