12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పద్యరచన - 674

కవిమిత్రులారా,
పైచిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. రంగు రంగుల తోడను రమ్యమైన
    విటపమున పిట్ట కన్నుల విందుఁజేయ
    ప్రకృతి సౌందర్యమును కని పరవశించ
    మదిని తాకెను రయమున మారు శరము

    రిప్లయితొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    ధన్యవాదాలు. చిత్రాన్ని మార్చాను.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    ఉదయాన్నే పరవశింపజేసే పద్యాన్ని అందించారు. అభినందనలు.
    కాని.. చిత్రాన్ని మార్చాను. మరో పద్యం వ్రాయండి.

    రిప్లయితొలగించండి
  3. రామా నిను నమ్మి నాడు
    వానరులు వారధి కట్టినారు !
    నరులు తమ్ము నమ్మి నేడు
    'వారధి'లేదు పొమ్మంటున్నారు !


    శుభోదయం
    జిలేబి
    (కాల మహిమ కాకుంటే అమెరికా వాడు హిగ్గిన్ బాసన్ కణం లో త్రినేత్ర దర్శనాన్ని గాంచు తూంటే , నాటి త్రినేత్ర దార్శనిక భారద్దేశం వారధి ని సారధి ని కానజాల నంటోంది !!)

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    రామసేతువు :

    01)
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌_____________________________

    రమణి సీతను జేరగా - రామదండు
    రావణుని లంక కేగగ - రయము రయము
    రామసేతువు నిర్మించె - రమ్యముగను !
    రావణాసురు వధియించి - రాముడంత
    రమణి జేకొని; మిత్రుని - న్రాజు జేసి
    రయము వెడలె నయోధ్యను - రక్ష సేయ
    రాజ్య పట్టాభిషిక్తుడై - రంజనముగ !
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌_____________________________

    రిప్లయితొలగించండి
  5. వారధిఁ గట్టు వానరుల, పావనమూర్తుల దర్శనమ్ముతో
    వారిధి ధన్యమైతినని భావనఁ జేయుచు మానసమ్ములో
    శ్రీరఘురాము పాదములఁ జేరుచు సేవలఁ జేసి మాటనున్
    మీరక నిల్చె సద్గుణము మిన్నగఁ జూపెను దైవకార్యమున్.

    రిప్లయితొలగించండి
  6. జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం...

    నిను నమ్మి వానరలు నా
    డనువుగ వారధిని గట్టి యలరిరి రామా
    ఘనుఁడ నని నేటి మానవుఁ
    డనుమానించు నది లేద టంచును నౌరా!
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. సేతువు గట్టిరి లంకకు
    కోతులు మరి రాళ్ళ తోడ కూపారముపై
    మాతను తెచ్చెద మనుచున్
    సీతాపతి! నీకు మొక్కి జేసిరి వినతుల్ !

    రిప్లయితొలగించండి
  8. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. చెంతన్ రాముండుండగ
    యెంతటి పనినైన జేయనేపాటిదగున్
    గంతులు వేయుచు కోతులు
    వంతెనగట్టంగ రాతిబండలమోసెన్

    రిప్లయితొలగించండి
  10. రాతి రాతి పైన రామ నామము వ్రాయ
    తేల నవియె నీట స్థిరము గాను
    వాన రాదు లెల్ల వారధి నిర్మించ
    నుడత సేవఁ జేసె నురక లేసి

    రిప్లయితొలగించండి
  11. వారధిని గట్ట వార్థిపై వానరములు
    కొండలన్నియు కొనితెచ్చి కోన నుండి
    విడువ సంద్రము నందున ప్రీతితోడ
    మునిగి పోయెనా కొండలు క్షణములోన
    కనలి రాముడు రయమున ధనువునెత్త
    సాయమొనరించె సంద్రుడు స్వయముగాను
    ముదముతోడను వారధిన్ పూర్తి చేసి
    చేరె లంకకు కపిసేన శీఘ్రముగను

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘రాముం డుండగ/ నెంతటి...’ అనండి.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ తేటగీతిక బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. లంక కేగుట కొఱకునై రాము డార్య !
    వార ధిం గట్ట నుదధికి వానరు లట
    మోయు చుండిరి రాళ్ళను ముదము తోడ
    రామ శ్రీరామ యనునట్టి రవము తోడ

    రిప్లయితొలగించండి
  14. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  15. విన్నపము -గురువులు, శంకరయ్య గారికి

    విన్న వించు కొందు విన్నప మొక్కటి
    యార్య !యిప్పు డుంటి నమెరికాన
    నందు వలన "పోస్టు "లాలస్య మగుటను
    గరుణ తోడ నన్ను గనుము సామి !

    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమ:

    కడలికి సేతువు గట్టగ
    వడివడిగా శిలలజేర్చి వానరయోధుల్
    నడిసంద్రమ్మున వేయగ
    నుడుతయు తన భక్తి జాటె నుత్సాహమునన్

    రిప్లయితొలగించండి
  17. గాలి లోన తేలి గండ్రపు రాళ్ళను
    కోతి మూక తెచ్చికోరి కట్ట
    సంద్ర మందు నిలచె చక్కని వారధి
    రామ నామ మహిమ రహిని చాటి

    రిప్లయితొలగించండి
  18. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి