చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘అలారం, యత్రం’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. ‘యంత్రము’ అంటే సరి. ‘యంత్రం/ బెడయక వ్యాపారికి సిరి..’ అందామా? * శ్యామలీయం గారూ, చిన్నప్పుడే ఇంత చక్కని పద్యాన్ని అందులోను ఆశువుగా చెప్పారన్న విషయం ఆనందం కలిగించింది. మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
వేకువ ఝామున లేపును
రిప్లయితొలగించండికోకోరక్కో యని తను కూయుచుజనులన్
లోకమున తొలి యలారం
బీ కోడి యనుట యతిశయమేమియు గాదే!
పల్లెటూరున సంక్రాంతి పండుగలకు
రిప్లయితొలగించండికోడి పందెముల్ జరిపింత్రు వేడుకనుచు
పదును గత్తుల తోడన బలము జూప
వెఱ్ఱి కేకలు వేతురు వెఱ్ఱి జనము
గుడిసెల వారికలారం
రిప్లయితొలగించండికుడిచెడు వారికిని చికెను, గ్రుడ్లకు యంత్రం
బడయగ వ్యాపారికి గన
నడచునె నీ నడక లేక నరుడిట కోడీ !
నేను చిన్నప్పుడు హైస్కూల్లో చదువుకొనే రోజుల్లో మిత్రుల కోరికపై ఆశువుగా చెప్పిన కందపద్యం.
రిప్లయితొలగించండికం. తొలిజాము కోడి కూసెను
తెలవారగ నుండె ననుచు తెలుపుట కొరకై
కలనిష్టభోగతతులన్
కులుకుచు నున్నట్టి భిక్షుకుడు కోపించెన్
సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రస్తావించాను.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అలారం, యత్రం’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. ‘యంత్రము’ అంటే సరి. ‘యంత్రం/ బెడయక వ్యాపారికి సిరి..’ అందామా?
*
శ్యామలీయం గారూ,
చిన్నప్పుడే ఇంత చక్కని పద్యాన్ని అందులోను ఆశువుగా చెప్పారన్న విషయం ఆనందం కలిగించింది. మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
కోడిపుంజు :
01)
______________________________
మిక్కుటమౌ కుక్కుటములు
చొక్కటముగ నుండు, జూడ - శోభన మిలలో
చుక్కలు మాయక మునుపే
కొక్కొరొకోయనుచు లేపు - కూతల నుర్విన్ !
______________________________
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మాస్టరుగారూ ! నమస్కారములు..మీ సవరణకు ధన్యవాదములు...
రిప్లయితొలగించండిసవరణతో.... నా పూరణ...
గుడిసెలపై మేల్కొలుపుగ
కుడిచెడు వారికి చికెనుగ, గ్రుడ్లందిస్తూ
బడసెడు వ్యాపారమ్ముగ
నడచెడు నీవన్న ప్రేమ నరునకు కోడీ !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిసవరణ బాగుంది. సంతోషం.
కాని... ‘గ్రుడ్లందిస్తూ’ అన్నారు వ్యావహారికంలో.. ‘గ్రుడ్ల నొసగుచున్’ అందామా?
పోరునకు సిద్ధ మనగాఁ
రిప్లయితొలగించండిదీరినదీ కుక్కుటమ్ము ధీరత్వముతోన్
నేరుగ పందెమ్మున నీ
పౌరుషమే నుర్వి జనుల పాఠము సుమ్మా!
కోడె వయసు తోడ కొక్కొరో కోయని
రిప్లయితొలగించండికూత కూయు చుండె కోడి పుంజు
పోటు లందు కోడి సాటి వేరెవ్వరు
సిద్ధమయ్యె సుమ్మ యుద్ధమునకు