10, సెప్టెంబర్ 2014, బుధవారం

న్యస్తాక్షరి -4

అంశం- ప్రవరుఁడు పాదలేపము కొఱకు సిద్ధుని వేడుకొనుట.
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా ప్ర-వ-రు-డు ఉండాలి.

35 కామెంట్‌లు: 1. కవిమిత్రులు నమస్కృతులు.
  నిన్న ఉదయం హైదరాబాదుకు వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. రోజంతా ఎక్కడా బ్లాగు చూడడానికి అవకాశం దొరకలేదు. అందువల్ల నిన్నటి పూరణలను, పద్యాలను సమీక్షించడానికి అవకాశం దొరకలేదు. ఈనాటి పద్యరచన, న్యస్తాక్షరి శీర్షికలను షెడ్యూల్ చెయ్యడానికి వీలులేకపోయింది. ఇప్పుడు కూడా ఏదో ఇవ్వాలను మొక్కుబడిగా ఇచ్చినవే.

  రిప్లయితొలగించండి
 2. ప్రవిమలమనస్కుఁడైన ధీవర గుణాఢ్య
  వరమునీయుము మాకు లేపనముచేత
  రుగ్మతాధిక బాధల లోబరచి క
  డు రమణీయ హిమాలయాలర
  సి వత్తు

  రిప్లయితొలగించండి
 3. ప్రణతులిడుదు పుణ్యవరేణ్య! ప్రాయమిదియె,
  వసుధలో క్షేత్ర దర్శన భాగ్యము తమ
  రు కరుణను నాకు నొసగుదురొ- మఱి నమ్ము
  డు; నిపుడేగెద నేను విడువగ బోను.

  రిప్లయితొలగించండి
 4. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. మిత్రులందఱకు నమస్కారములు.

  ప్రవరుఁ డిటు వేడె సిద్ధునిఁ "బరమపురుష!
  వరయుతౌషధసిద్ధ! సత్పథగ! ఘన! క
  రుణనుఁ బాదలేపమ్మునుం ద్రుతము నొసఁగుఁ
  డు! ననుఁ దీర్థయాత్రాచరుఁ డుగనుఁ గనుఁడు!"

  రిప్లయితొలగించండి
 6. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు ప్రబలమగు గోరిక మదిని రంజిల "యతి
  వరుడ!నాకిమ్ము పాదలేపమును,హిమగి
  రులను దర్శించి వత్తును జలజమిత్రు
  డు పడమర నస్త మించు మునుపుకడంగి"

  రిప్లయితొలగించండి
 7. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  కె .ఈశ్వరప్ప గారి పూరణ
  ప్రణతి జేయుచు సిద్ధుని ప్రవరుడనెను
  వర్ణ శోభిత కైలాస వాసునె౦చ
  రుషులసంచార వాసమ్ము రూపమును న
  డుగిడగల్గిన పసరును పొగడి నడిగె

  రిప్లయితొలగించండి
 9. మల్లెల వారి పూరణలు

  ప్రవిమలుండైన సిద్ధుని భక్తి మ్రొక్కి
  రము నిమ్మని వేడెను భవ్య హిమగి
  రున్న సొగసు కాంచగపసరు, తగ తనకి
  డుమయ యనుచును విశ్రాంతి సమయమందు

  ప్రవరు డాసిద్ధు కోరెను, ప్రకృతి శోభ
  రము నాహిమ గిరిపైన వరలు నట్టి
  రుచినిఁ జూడ స్వయముగాను, నుచిత గతి, క
  డు మహిమనుఁజూపు పసరునిడుమని, యపుడు

  రిప్లయితొలగించండి
 10. గుండు మధుసూదన్ గారి పూరణ ప్రత్యేకం. అడిగిన ప్రశ్న చిన్నదైనా కవి ప్రతిభ చూపగలడని చెబుతోంది.

  రిప్లయితొలగించండి
 11. ప్రబల కోర్కెలు మదిలోన పావనుడు ప్ర
  వరుడు సిద్ధుఁబ్రార్థించి తా భక్తి తోడ
  రుచిరహిమగిరిఁగన పసరునుగొని యపు
  డుచనెన చ్చోటుకు కడు వేడుకనుపొంద

  రిప్లయితొలగించండి
 12. సాహితీమిత్రులు మన తెలుఁగు చంద్రశేఖర్‍గారికి నమస్కారములు. నా పూరణము తమరి మెప్పులనందినందులకుఁ గడుంగడు ముదమందితిని. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 13. ప్రణతులిడి గోరె సిద్ధుని భక్తితో ప్ర
  వరుడు మునివర! పాదలేపనమిడిన గ
  రుణను తీర్ధ యాత్రలకునరుగుదు బూయు
  డు తమ చేతితో జనెద గడువడి తోడ

  రిప్లయితొలగించండి
 14. శ్రీగుండువారి పూరణ ప్రౌడత కలిగి ప్రత్యేకంగా ఉన్నది అభినందనలు. వారు దయచేసి అన్యవిధంగా భావించకపోతే ఒక చిన్న మనవి. "పరమపురుష" అని కేవలం భగవంతుని మాత్రమే సంబోధించటం సంప్రదాయం అనుకుంటాను. ఈ‌ మాట అక్షేపణ కోసం చెప్పింది కాదని వారు అర్థం చేసుకుంటే సంతోషం.

  రిప్లయితొలగించండి
 15. శ్రీగురుభ్యోనమ:

  ప్రవర జెప్పుచు సిద్ధుని పదములంటి
  వరము పొందగ ప్రార్థించె స్థిరముగాను
  రుక్కు కలుగగ లేపము రుద్ది ప్రవరు
  డు హిమగిరులు జూడగ నెంచె మహిమ చేత

  రుక్కు = కోరిక

  రిప్లయితొలగించండి
 16. శ్యామలీయంగారూ, అణిమాద్యష్టవిశిష్టసిద్ధులు పొందిన యతివర్యుఁడు భగవత్సమానుఁడగుననియు, శ్రేష్ఠతముఁడగుననియే నే నౌషధసిద్ధునకా విశేషణమును వాడితిని. నాకిందేదోషమునుం గనిపించుటలేదు. ప్రవరుని దృష్టిలో నతఁడు భగవత్స్వరూపుఁడేయని నా భావన. నేను మీ విమర్శ నాక్షేపణగా భావించుటలేదు. మీవంటివారికి సంతోషమును గలిగించుటయే కదా నాకు పరమార్థము! స్పందించినందులకుఁ గృతజ్ఞుఁడను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. ప్రకృతి రమణీయతనుజూడ పైకి నెగురు
  వరమునీయము సిద్ధుడా యరిగి హిమగి
  రులను జూచెదనని ప్రవరుడు యడుగ క
  డుదయ గలిగిలేపనమిచ్చె మదిని మెచ్చి.

  రిప్లయితొలగించండి
 18. శ్యామలీయంగారూ,

  మనుచరిత్రములోని పద్యము:

  నావుఁడు బ్రవరుం డిట్లను
  "దేవా! దేవర సమస్త తీర్థాటనము‍న్‌
  గావింపుదు రిలపై నటు
  గావున విభజించి యడుగఁ గౌతుకమయ్యెన్‌"

  అను ప్రవరుఁ డౌషధసిద్ధునితోఁ బలికిన వచనములందు "దేవా"యనుట యెంత సార్థకమో,నా పద్యమందుఁ "బరమపురుష"యనుటయు నంతియే సార్థకము కదా! పరిశీలింపుఁడు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 19. ప్రజ్ఞ తీర్థయాత్రన్ నిలచి ప్రవరుడున్న
  వచ్చె సిద్ధుడు విశేషముల పారముగని
  రుబరు బల్కి,లేపముజూప, లెచి వేడెన్
  డుంగిడక సిద్ధుడిచ్చె,జనె డేగురమన

  రిప్లయితొలగించండి
 20. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని అన్ని పాదాలలోను గణదోషం. అన్వయానికి లొంగని పదాలు కనిపిస్తున్నాయి. సవరించండి.
  *
  శ్యామలీయం గారూ,
  గుండు మధుసూదన్ గారూ,
  _/\_

  రిప్లయితొలగించండి
 21. ప్రముఖ పూజ్యులు సిద్ధుల భక్తి తోటి
  వసుధపైని హిమాలయ పర్వతఁపు సు
  రుచిర యందాలఁ దిలకించి లొట్టలేసె
  డు వర పాద లేపనము వేడుకొననిడరె?

  రిప్లయితొలగించండి
 22. ప్రధిత మునివర్య! యొసగుము పాదలేప
  వరము నాకిడ,చూచెద గిరిని యనుచు
  రుచిర వైశేష ములజూచి రోజుగడపి (గడపి+ఇడుముల)
  డుముల బడెనుగ పారుడు తమక భ్రాంతి

  రిప్లయితొలగించండి
 23. ప్రవరు డంతట సేవింప భక్తిని యతి
  వరుడు నీకిత్తు వరమని పలికెను ప్రవ-
  రుడు ముదమునను ధరను తిరుగగ నీయు-
  డు దయఁ పాద లేపనమును సదయ హృదయ!

  (అమ్మయ్య మొత్తానికి కిట్టించాను)

  రిప్లయితొలగించండి
 24. ప్రవరుడతిధినిc గోరెను ప్రష్ట యగుచు,
  “వలయు తీర్థముల జేర్చు బాదరసము”
  రుసియు బూసెను వసిగొను పసరు, ప్రవరు
  డుల్ల సిల్లుచు జేరెను తెల్ల గట్టు
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 25. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘రుచిర శోభల’ అనండి.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘గడపి + ఇడుముల’ అన్నప్పుడు తప్పక యడాగమం వస్తుంది.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ప్రవరుడు’ శబ్దం పునరుక్తమయింది. ‘పలికె క్షితిసు/రుడు...’ అందామా?
  *
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. శ్రీ శంకరయ్యగారు,
  ధన్యవాదములు. మీ సహయంతో సవరించిన పద్యం

  ప్రజ్ఞ, యాత్రలందుమునిగె ప్రవరునకును
  వచ్చె సిద్ధుడు యాత్రజ్ఞు పారముగని
  రుచిరుడాదివ్యలేపనపులోతు దెలిపి
  డుంగిడకనిచ్చె, భూసురుండోగె రభస

  రిప్లయితొలగించండి
 27. మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
  సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  లేపనపు అన్నచోట గణదోషం. ‘రుచిరు డాలేపనపు లోతులు తెలుపుచును’ అనండి. ‘ఓగె’ అంటే కీడు, మూర్ఖుడు అన్న అర్థాలున్నాయి. ‘భూసురుం డోగె నందె/ డోగె యయ్యె’ అనండి.

  రిప్లయితొలగించండి
 28. ప్రవర నామంబు నొప్పునే పరమ పురుష !
  వరముగా నిమ్ము మఱి నాకు పాదపు పస
  రు మ ఱి వేగంగ బోవను హిమగి రికిక
  డు రమ ణీ యము లైనశి ఖర ము లుగద !

  రిప్లయితొలగించండి
 29. ప్రవి భాసిలు సిద్ధుతో బలికె "నార్య!
  వలిమల వెలుంగు దివ్య సొబగుల చిత్త
  రువుల గాంచన్మది కడు పరుగులిడగ న
  డుగుచు నుంటి యాలేప్యమిడు ఘన మహిమ"

  రిప్లయితొలగించండి
 30. గురువర్యులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరు చూడ వలసిన పూరణలు మధ్యలో యింకామూడు వున్నవి.

  రిప్లయితొలగించండి
 31. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘హిమగిరి + ఉన్న’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘హిమగిరుల సొగసును కాంచగ పసరు తగ...’ అనండి.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మదిలోన’ అన్నదాన్ని ‘మది రేగ’ అంటే అన్వయం బాగా కుదురుతుంది.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మాజేటి సుమలత గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 32. గుండువారు సహృదయంతో అర్థంచేసుకున్నందుకు సంతోషం. సంప్రదాయంలో మహాత్ములను మనం భగవాన్ అని సంబోధించటమూ విరివిగా కనిపిస్తుంది. దాని అర్థం వారు భగవంతునితో తాదాత్మ్యం సిధ్ధింప జేసుకున్నవారని వినయంగా వాచానమస్కృతి తెలియజేయటమే కాని తదన్యం‌ కాదని నా భావన. పరమపురుష పదం వేఱు. దానికి కేవలం భగవంతుని ఉద్దేశించి వాడటం మాత్రమే సంప్రదాయమని నా అబిప్రాయం. మీరు విబేధించవచ్చును. మీఱొక కావ్యంలో అలా ప్రయోగిస్తె అది ఎంతవరకూ ఆమోదించబడుతుందీ అన్నది నా అనుమానం. ఇది పూరణ పద్యం మాత్రమే అని మీరు తేలిగ్గా తీసుకుంటే ఇబ్బంది లేదు.

  రిప్లయితొలగించండి
 33. గురువు గారూ సవరణకు ధన్యవాదాలు.

  మధుసూదన్, శ్యామలీయం గార్ల సంభాషణ హృద్యంగా సాగుతూ మంచి పాఠం బోధిస్తోంది.

  రిప్లయితొలగించండి
 34. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
  ప్రముఖ పూజ్యులు సిద్ధుల భక్తి తోటి
  వసుధపైని హిమాలయపర్వతఁపు సు
  రుచిర శోభలఁ దిలకించి లొట్టలేసె
  డు వర పాదలేపనము వేడుకొననిడరె?

  రిప్లయితొలగించండి