13, సెప్టెంబర్ 2014, శనివారం

పద్యరచన - 675 (ఆడపడుచు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“ఆడపడుచు”

12 కామెంట్‌లు:

  1. ఆడువారికి యత్తింట యాడపడుచు
    యాటపట్టించి యేడ్పించునదనుజూచి
    యన్నతోచెప్పు చాడీలు తిన్నగాను
    అర్ధమొగుడన్న బిరుదమే యర్హమగును

    రిప్లయితొలగించండి
  2. ఆడ పడచు తోటి యత్తింటి కోడలు
    మెలగ వలయు మిగులఁ గలసి మెలసి
    కంట వారలెపుడు కన్నీరు గార్చిన
    సిరులు నిలువ వనుట చేదు నిజము

    రిప్లయితొలగించండి
  3. పుట్టినింటి కలిమి బుద్ధిగా గోరెడు
    యాడ పడచు యింటి కాది లక్ష్మి!
    చీర సారె లిచ్చి సేమంబు జూడనా
    కంటి వెలుగె వార లింట మెరయు!

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ అర్ధమొగుడి పద్యం బాగుంది. అభినందనలు.
    నుగాగమ యడాగమాల విషయంలో జాగ్రత్త పడండి.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. కన్నయింటి వారి కష్టముల్ గాంచిన
    కరగి పోవునట్టి కనక మామె
    తల్లి బాధ్యతలను తనివితోఁ జేయుచు
    ననవరతము మెలగు నాడపడచు

    రిప్లయితొలగించండి
  6. శ్రీగురుభ్యోనమ:

    అన్నదమ్ముల యనురాగ మందుకొనుచు
    తల్లిదండ్రుల ముద్దుల తనయ తానై
    పేర్మి మీరగ పుట్నింట ప్రేమ పంచి
    యత్తవారింట లక్ష్మిగా నవతరించి
    యశము కల్గించు మాయింటి యాడపడుచు

    రిప్లయితొలగించండి
  7. కన్నవారి కెపుడు కనులపంటగ తోచు
    అన్న సేమమరయు నాప్తురాలు
    వదిన మనసు గెలుచు వాసంత సమిరము
    నాడ పడచుగాదె నర్ధమొగుడు!

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘తానై’అన్నచోట గణభంగం. ‘అన్నదమ్ముల యనురాగ మందుకొనెడి/ తల్లిదండ్రుల ముద్దుల తనయ తాను’ అనండి.

    రిప్లయితొలగించండి
  9. శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వాసంత మారుత/ మాడపడుచు గాదె యర్ధమగడు’

    రిప్లయితొలగించండి
  10. ‘అర్ధమొగుడు/మగడు’ దుష్టసమాసమే కాని ‘అర్ధసేరు, అర్ధరూపాయి, అర్థకిలో’ లాగా జనబాహుళ్యవినియోగం వల్ల గ్రాహ్యమే అనుకుందాం.

    రిప్లయితొలగించండి
  11. ఆడ పడుచు ననగ నర్ధమగడు గాన
    భర్త కీయు గార వంబు నీయ
    వలయు నామెకు మరి వగలు గ లుగజేయ
    కెపుడు ,సిరులు గలుగు నపుడు బాల !

    రిప్లయితొలగించండి
  12. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘ఆడపడు చనంగ...’ అనండి.

    రిప్లయితొలగించండి