16, సెప్టెంబర్ 2014, మంగళవారం

పద్యరచన - 678 (అగ్గిపెట్టె)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“అగ్గిపెట్టె”

17 కామెంట్‌లు:

 1. భగ్గున వెలుగుచు పదముల
  బుగ్గిని చేయగలదొక్క పుల్లను గీయన్
  లగ్గగు జక్కగ వాడిన
  గగ్గకనీయగ్గిపెట్టె గావలసినదోయ్
  (పదములు =వస్తువులు,గగ్గు = సంకోచించు )

  రిప్లయితొలగించండి
 2. మానవుడి మేథ తో
  అగ్గి, పెట్టెలో దాక్కుంది
  చేయి లాగి పెట్టి రా గీస్తే
  మండి బుగ్గి అయ్యింది !!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘కావలసినదోయ్’ అన్నారు వ్యావహారికంలో. అక్కడ ‘కావలసినదే’ అనండి.
  *
  జిలేబీ గారూ,
  మీ భావానికి నా పద్యరూపం.

  మానవుని మేధతోడన్
  తా నొదిగెను పెట్టెలోనఁ దగ నగ్గియె, చే
  యానించి లాగి గీయం
  గా నదియె జ్వలించి బూదిగా మారునుగా.

  రిప్లయితొలగించండి
 4. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. సీత నశోక వనమున న
  చేతనఁ గని హనుమ రెచ్చె చిచ్చర పిడుగై!
  వాతలఁ బెట్టగ తోకకు
  భూతమ్మై 'యగ్గి పెట్టె' బూడిద జేయన్!

  రిప్లయితొలగించండి


 6. సిగరెట్టు ముట్టించి చిద్విలాసమ్ముగా
  ...........రింగుల పొగలూద హంగు నీవు !
  కటిక పేదకు పొయ్యి కట్టెను రాజేసి
  ...........వంటను జేయగా బలము నీవు !
  గడ్డివాముల, పాక లడ్డముగా గాల్చి
  ...........వైషమ్యముల బెంచ వాటమీవు !
  కాలిపోవగ తల, కట్టె పుల్లగ నుండి
  ...........చెవుల శుభ్రము జేయు చెలివి నీవు !
  పెద్ద నిద్దుర వోవ పిడికెడు బూదిగా
  .....మనిషిని మార్చెడు మహిమ నీవు!

  " నిప్పుతో చెలగాటము ముప్పు మనకు,
  నిప్పు కనిపెట్ట నరునకు ముప్పు వచ్చె "
  కన్ను కుట్టిన వారందు రెన్న నిట్లు
  నీకు నగ్గిపుల్లా! నుతుల్ నేనొనర్తు.

  తలను బాదు కొనుచు ధన ధనా పెట్టెకు
  తగుల బడుదు వీవు తాపమొదవ !
  స్వార్థ మెరుగ బోని జన్మ నెత్తితి వమ్మ!
  అగ్గిపుల్ల! జోత లమరజీవి!


  రిప్లయితొలగించండి
 7. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  అద్భుతమైన పద్యాలతో ‘అగ్గిపెట్టె’ విశ్వరూపాన్ని సాక్షాత్కరింపజేశారు. చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. అగ్గి పెట్టెను జూడగ నంద మొలుకు
  పుల్ల లుండును మందుతో పొదుపు గాను
  రాచి గీ చిన భగ్గున రగులు గొనుచు
  పచన మేదేని జేయును పవన యుతగ

  రిప్లయితొలగించండి
 9. మనుజు లందరి నేస్తమై మహిని వెలసి
  మంచి చెడ్డల నెంచక పంచు వెలుగు
  తాను కాలిన యజమాని తపన దీర్చు
  నగ్గి పుల్లల పెట్టెకు నంజలిడుదు!

  రిప్లయితొలగించండి
 10. గురువుగారూ ధన్యవాదాలు. ఈ పద్యాలు నేను సుమారు 3 నెలల క్రితమే వ్రాసినవి.

  రిప్లయితొలగించండి
 11. మడితోడ పూజారి గుడిలోననిచ్చెడు - హారతి వెలిగించునగ్గిపెట్టె
  గుడిసెలోనుండెడు గుడ్డిదీపంబుల - నంటించ గావలెనగ్గిపెట్టె
  పొయ్యిల వెలిగించ పూబోడులకునెల్ల - నవసర మెప్పుడీ యగ్గిపెట్టె
  నిప్పునంటించుకొని చనిపోవ తలచ -నాత్మహత్యకుగూడనగ్గిపెట్టె
  హోమమందునైన ధూమపానముకైన
  కాటిలోనగాలు కట్టెకైన
  మంచిచెడులయందు మానవులకెపుడు
  నండనుండునుగద యగ్గిపెట్టె

  రిప్లయితొలగించండి
 12. సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
  ‘ధూమపానమునకు’ అనండి.

  రిప్లయితొలగించండి

 13. వెగించగ పొయ్యిని సతి
  వెలిగించగ చుట్ట తాత వెలుతురు కొరకై
  వెలిగించగ లాంతర్లను
  వెలిగించగ హారతినిది వెలిగిడు పెట్టౌ.

  రిప్లయితొలగించండి
 14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 15. మిస్సన్న గారూ ! సూర్యనారాయణ గారూ 1 అగ్గిపెట్టెను బాగా వెగించారండీ...

  రిప్లయితొలగించండి