రావిపాటి లక్ష్మినారాయణ
రామాయణము-
ఉ. చూపరి రాము దద్(రిపులఁ జూచెను జిష్ణుఁడు శ్రీని; బంధు)ర
శ్రీపతి దుష్టులౌ (జనులఁ జివ్వను నెంతయుఁ జంపమాన)డ
చా పరముం గనెన్ (హరియు; నాదటఁ బల్కెను హాళి గీత)ముల్
ద్రోవడి క్రోఁతులున్; (నరవరుండునుఁ బూనె రణంబుఁ జేయఁ)గన్. (౯౭)
భారతము-
గీ. రిపులఁ జూచెను జిష్ణుఁడు శ్రీని; బంధు
జనులఁ జివ్వను నెంతయుఁ జంపమాన,
హరియు; నాదటఁ బల్కెను హాళి గీత
నరవరుండునుఁ బూనె రణంబుఁ జేయ. (౯౭)
టీక- జిష్ణుఁడు =
(రా) దేవేంద్రుఁడు, (భా) అర్జునుఁడు; హరి = (రా) దేవేంద్రుఁడు, (భా) కృష్ణుఁడు; గీతముల్ = (రా) పాటలను (యుద్ధమునకు ముందుత్సాహముచేత); గీత = (భా) భగవద్గీత; నరవరుండు = (రా) రాముఁడు, (భా) అర్జునుఁడు; చూపరి = అందగాఁడు; చివ్వ = యుద్ధము; ఆదట = ప్రేమ; త్రోవడి = ఒకరిచే నొకరు త్రోయబడుచు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి