19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పద్యరచన - 681 (ఓటమి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“ఓటమి”

13 కామెంట్‌లు:

 1. ఓటమిబొందునంచు మదినూరక నిస్పృహ పెంచునట్టి యే
  మాటలనాలకించకుము మానక చేయుము నీ ప్రయత్నముల్
  చేటగునేమి యోడినను చేకొని జ్ఞానము రాటుదేలుచున్
  దీటుచు తప్పులన్ గెలిచి తీరుట తధ్యమధైర్యమేలనో
  (దీటు= సరిచేయు)

  రిప్లయితొలగించండి
 2. పాటల పోటీలో రవి
  సాటియ యగు వార లెదుట చక్కగ బాడన్
  బాటను దడబడి నందున
  నోటమి పాలయ్యె నార్య !యూ రడి జేతున్

  రిప్లయితొలగించండి
 3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘ఉరడింతున్’ అన్న ప్రయోగ మున్నది కాని ‘ఊరడిజేతున్’ అనడం లేదు. ‘ఓదార్తు నిదే’ అందామా?

  రిప్లయితొలగించండి
 4. ఓటమి గెలుపు కి నాందని
  నోటమి పాలైన గొలది నోరిమి తోడన్
  నోటమి నోడించి గెలిచి
  మేటిగ నువు నిలువ వలయు మేదిని యందున్

  రిప్లయితొలగించండి
 5. ఓటు పడితినంచు నోజస్సుఁగోల్పోయి
  కలతఁజెంద వలదు కలలనైన
  ప్రజలసేవ సతము రక్తితోఁ జలిపిన
  భావి కాలమందు వచ్చు జయము

  రిప్లయితొలగించండి
 6. శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. ఓటమి పాలై వగచెడు
  చేటు కలుగకున్నను వగచెను ధర్మజు'డీ
  నాటికి తోఁబుట్టువనెడు
  మాటెఱుగక యేనిన సూను మరణముఁ గంటిన్.'

  రిప్లయితొలగించండి
 8. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  చివరిపాదంలొ గణదోషం.. సవరించండి.

  రిప్లయితొలగించండి
 9. గురువుగారు, మన్నించండి.

  ఓటమి పాలై వగచెడు
  చేటు కలుగకున్నను వగచెను ధర్మజు'డీ
  నాటికి తోఁబుట్టువనెడు
  మాటెఱుగకనె యినసూను మరణముఁ గంటిన్.'

  రిప్లయితొలగించండి
 10. పదివేల మార్లు యోటమి!
  పెదవే విరువని 'యెడిషను' వెలిగించె గదే!
  కుదురుగ విద్యుద్ధీపము!
  ముదమొసగు పరాజయమ్ము ముందుకు సాగన్!

  రిప్లయితొలగించండి
 11. తిట్టకు మోటమినెప్పుడు
  మెట్టది విజయమ్ము జేర మీదకు జనుచున్
  నెట్టుము వెనుకకు దానిని
  ముట్టెదవిక జయము నీవు ముచ్చటగానే.

  రిప్లయితొలగించండి
 12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. పదునెనిమిది మారులు మహ
  మదు గోరి పరాజితుఁడయి మానక పోరెన్
  గద, తుదకు గెలిచి హైందవ
  హృదయమ్ములు గుందఁ గూల్చె నిట దేవళముల్.

  రిప్లయితొలగించండి