సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘ప్రగల్భ’ అన్నచోట గణదోషం. ‘ప్రాగల్భ్యము లనుచు’ అనండి. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు. ‘కనుడు మత్యంత’ అన్నదాన్ని ‘కనరె యత్యంత’ అనండి. * రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
బృహన్నల ఉత్తరకుమారునితో....
రిప్లయితొలగించండిమత్స్యదేశమందు మన్నన యుండునె?
రణము నందు గెలిచి లక్షణముగ
తిరిగి వత్తు నంటి; తిరిగి పోగ ప్రగల్భ
మగును గాదె యట్టి మాటలెల్ల?
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఏను శత్రు సమూహము నెక్కటిగను
రిప్లయితొలగించండిసమరమందున నెదిరించి, సాకు వాడ
గోవులనని ప్రగల్భముల్ కోరి బల్కి
కౌరవ దళమునంతయు గాంచి వేగ
పారిపోయె నుత్తరుడతి భయముతోడ
గొప్పలు చెప్పకు మెప్పుడు
రిప్లయితొలగించండితప్పిన తలబొప్పిగట్టు తలవంపులగున్
తప్పక తిప్పలు వచ్చును
దెప్పును జనులంత నీకు తెల్లమొగమగున్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
చేయ లేక యుండి చేతునను చు మఱి
రిప్లయితొలగించండిగొప్ప లెన్నొ జెప్పు నొప్పు గాను
బలుకు విధము నండ్రు ప్రగ ల్భ ములనుచు
దేట తెల్ల మిదియ తెలియు బాల !
విజయమందు వాడు వీరత్వమున బల్కు
రిప్లయితొలగించండిపల్కులవియె గొప్ప, పామరుండు
ఉత్తమాటలాడ నెత్తరియైనను
కనగ నవియెగా ప్రగల్భములగు.
కలిసి చిక్కినాము, విడగ కలసి రండు
రిప్లయితొలగించండిదళిత నేతకు పాలన దక్కు నటుల,
మన తెలంగాణ ప్రభవించ, మార్పు దెత్తు
ననెడి వట్టి ప్రగల్భాల వినమె మనము!
సింగపూర్ నగరమ్ము సృష్టిజేసెదమంచు
రిప్లయితొలగించండి.............. నోట్లసంపదకెల్ల తూట్లుఁ బొడిచె
భాగ్యనగరము సౌభాగ్యప్రదాతగా
............. నిర్మింతుమన్నచో మర్మమెద్ది
రైతుల ఋణమాఫి జేతుమనుచుఁ జెప్పు
............. నయవంచనము జేయు నాయకులును
విద్యుదభావంబునాద్యంతముల్ చర్చ
............ జరిపియు న్యాయమ్ము సలపరయ్య
కనుడుమత్యంత మధుర "ప్రగల్భములను"
తీయతీయగఁ బలుకెడీ నాయకులకు
కార్యనిర్వహణాసక్తి గలుగునటుల
వేడుకొనెదను దేవుని వేయిమార్లు.
విద్యుత్ + అభావము ( లేకపోవుట )
మాటలు కోటలు దాటును
రిప్లయితొలగించండిదాటవు మరిచేతలింటి ద్వారము కూడన్
పూటకు రంగులు మార్చెడు
మేటులదౌ రంగుల వల మేదిని కనగా!
సహదేవుడు గారి అభిప్రాయం తో యేకీభవిస్తూ...
రిప్లయితొలగించండినీటనిల్లుగట్టి నిప్పునుదాల్చుచు
నింగి పొలముదున్ని నేలదించి
వేల జనుల కిడెద వింత భోజనమను
పగటి వేషగాని ఫణితి యౌను
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ప్రగల్భ’ అన్నచోట గణదోషం. ‘ప్రాగల్భ్యము లనుచు’ అనండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.
‘కనుడు మత్యంత’ అన్నదాన్ని ‘కనరె యత్యంత’ అనండి.
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.