రావిపాటి లక్ష్మినారాయణ
రామాయణము-
సీ. మించి రాముని
నా య(మిత్రు ధృతిని మూసి
మీఱెను హరిచక్ర) మారు రహిఁ గ
పుల నొంచె బ్రహ్మాస్త్ర(మునఁ బరువడి మోద
మెనయ సంధ)వథి కేభభటులు;
ఘననాదుఁ డేగె, బావని దెచ్చె ద్రోణాద్రి;
మొన మంచె; దానిస్థలి నగ ముంచె;
దనుజులు రేఁగులఁ దంగేళ్లుగాఁ ద్రొక్కఁ
గపులు గాలిచె లంక; గంపనుఁడు మె
గీ. ఱయఁ జదిపె
వాలిభ(వుఁడు విజయుఁడు వానిఁ;
గెడపె వైరి ఘటోత్క)చిత్తుఁడగు కుంభు
బేరజంబును నీ(చున్ రవిజుఁ; డడంచె
జోక శక్తి) నికుంభుఁడన్ సోకు హనుమ. (౧౧౧)
భారతము-
ఆ. మిత్రు ధృతిని
మూసి మీఱెను హరిచక్ర
మునఁ బరువడి మోద మెనయ సైంధ
వుఁడు; విజయుఁడు వానిఁ గెడపె; వైరి ఘటోత్క
చున్ రవిజుఁ డడంచె జోక శక్తి. (౧౧౧)
టీక- (రా)
అమిత్రు = విరోధియొక్క, (భా) మిత్రున్ = సూర్యుని;
హరిచక్రము = కపులగుంపు, (భా) హరి = కృష్ణుఁడు, చక్రమున = సుదర్శనచక్రమున;
వాలిభవుఁడు = (రా) అంగదుఁడు; విజయుఁడు= (రా) జయశీలుఁడు, (రా) వైరి = శత్రువుల,
ఘట = గుంపునందు, ఉత్క = ఉత్సాహముగల,
చిత్తుఁడు = మనస్సుగలవాఁడు; (భా) వైరిన్, ఘటోత్కచున్; శక్తిన్ = (రా) బలముచేత, (భా) శక్తియను నాయుధముచేత,
ఆరురహి = ఒప్పుచున్న ప్రీతితో, బేరజము = కుత్సితుఁడు, జోక = ఉత్సాహము,
సోకు = రాక్షసుని, సైంధవ = (రా)
గుఱ్ఱము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి