11, సెప్టెంబర్ 2014, గురువారం

నిర్వచన భారత గర్భ రామాయణము – 79


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
సీ.      దుఃఖకృత పదహతులఁ బూచి నీపైనిఁ
బడుపూలె తెల్పు శుభము, తలపువు
వాడకుండు మనుచుఁ బలికితి ననె, రాఘ
వుఁడు కీశసేనతోఁ గడలి డాసె,
నచట లంకను రాముఁ డని దిరుడనె విభీ
షణుఁడు, వెండియును రావణు సకుంభ
(కర్ణుఁ గాంచెను, దినకాంతసంతతి సుకృ
తి భవమూలమును యుధిష్ఠురు ధృతిఁ)
గీ.      (జేరు పోవడవకు క్షితిఁ జెలువుగ శుభ
మగు నని పలుక వినడయ్యె నతఁడు,) వినక
తిన్నయింటివాసంబుల నెన్నెదో ప
యోముఖవిషకుంభమ యని యుఱికి తన్నె. (౯౪)

భారతము-
ఆ.      కర్ణుఁ గాంచెను, దినకాంతసంతతి సుకృ
తి భవమూలమును యుధిష్ఠురు ధృతిఁ
జేరు పోవడవకు క్షితిఁ జెలువుగ శుభ
మగు నని పలుక వినడయ్యె నతఁడు.

టీక- దుఃఖకృత...పూలె = (రా) అశోకవృక్ష మేకాల మందైనను స్త్రీల కాలితాఁపుచేఁ బుష్పించునని కవిసమయము; (రా) దినకాంత = సూర్యుని, సంతతి = వంశములోని, సుకృతి = మంచిపనుల జేసినవాని (రాముని); భవమూలమును = జన్మమర్మము (అనగా విష్ణుఁడు రాముఁ డయి రావణుని కొఱకే యవతరించె ననుట); (భా) దినకాంత = సూర్యును; సంతతి = కుమారుఁడగు (కర్ణుఁడు) సుకృతి; భవమూలము = జన్మమర్మము (కర్ణుఁడు కుంతీసుతుఁ డనుట); యుధిష్ఠిరు = రాముని (రాముఁడు యుద్ధమందు స్థిరుఁడని చెప్పెను గనుక యుధిష్ఠిర శబ్దము రామునకే యన్వయము); కీశ = కపులు, కడలి = సముద్రము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి