23, సెప్టెంబర్ 2014, మంగళవారం

పద్యరచన - 685

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. శిల్ప మందున జెక్కిన చిత్ర మదియ
    చూడ బ్రాణము గలదియై చూపరులను
    మోహితుల జేయు దనదైన ముఖము తోడ
    నేమి యందమ ? యాయది యేమి సొగసు ?

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పై చిత్రం చూస్తుంటే నాకు
    గానగంధర్వుడు ఘంటసాల పాడిన
    "నాగార్జునకొండ" గుర్తుకొస్తున్నది !
    మీకు కూడా గుర్తు చేద్దామనే యభిలాషతో !

    రచన : ఎస్*ఆంజనేయులు
    సంగీతం : ఘంటసాల

    రిప్లయితొలగించండి
  3. నాగార్జున కొండ

    రచన : ఎస్*ఆంజనేయులు
    సంగీతం : ఘంటసాల
    గానం : ఘంటసాల

    ****************

    నాగార్జున కొండ
    శిల్ప ప్రదర్శనము
    నేటికినీ నిజ కళా నిదర్శనము
    ఆహా! ఆ శిల్పాంగనల
    అంగాంగ భంగిమల
    శృంగారము పొంగారు చున్నది.

    01) || ఉత్పలమాల ||

    కోమల , కోమలీ మణులు ! - కోరిక లీరిక లెత్త , ఉత్కళా

    రామ ,మనోఙ్ఞ ,మంజుల, మ - రాళ ,మయూర, శరీర , శోభలన్ !

    కామ కళా కలాపములు !- కన్నుల కట్టు కధా విధానముల్ !

    భామల భంగిమల్ ! ప్రణయ - భావములున్ ! ప్రకటించి రిచ్చటన్!

    అదిగో !
    ఆ చక్కదనాల చుక్క
    నెంత చక్కగా చెక్కిరి !!!

    02) || చంపక మాల ||
    వలపు మిఠారి వాల్కనుల , - వన్నెల కాటుక గీటు నిల్పి , యా
    చిలకల కొల్కి , చెంపలకు - చేరెడు కన్నులు , చేర్చి , తీర్చి, క్రొం
    గులుకులు నొల్కగన్ , కుసుమ - కోమల దేహము , కూర్చి , పేర్చి , పెన్
    వలపు , వయారముల్ , చిలికి - నారిట ! చిత్తము తత్త రిల్లగన్ !!

    ఆహా !!!
    ఏమి !!!ఈ ప్రాచీన శిల్పుల ప్రతిభ!!!

    03) || ఉత్పలమాల ||

    ఖాయము కాదిలన్ , మనుజ - కాయము !!! కాన , వృధా యొనర్చ కీ
    ప్రాయము , పండు యవ్వనము !!! - పానము జేయుము , హాయి నీయు పా
    నీయము !!! ఓ సఖీ !!! యనుచు , - నిత్య సుఖాల నిమగ్నుడౌ , ఉమర్
    కాయ కథల్ , రచించి , రవు - రా !!! రమణీయ , రసఙ్ఞ , నైపుణిన్!!!

    కాల కంసుని కఱకు పాదముల క్రింద
    నలిగి పోయిన నాగార్జున కొండ శిథిల శిల్పాలు
    కటిక కసాయి వారినైనా కరగించి వేయును గదా! ఆహా !!!

    04) || ఉత్పలమాల ||

    మానసముల్ , ద్రవించినవి ! - మ్రాన్పడి పోయెను , మానవాళి ! యా
    దానవ కాల కార్యముల ! - ధాత్రి , నొరింగి , తొలింగి , తున్ క లై !
    శ్రీ నగ , శిల్ప , కల్పన , చె - రింగి , తరింగి , కరింగి , పోవుచున్ !
    యీ , నగ సీమ , నల్గి , నశి - యించిన , తీరులు , తేరి జూచుచున్ !

    మత ద్వేషుల , దారుణ , మారణ , క్రూర , కృత్యముల , కృంగి , కృశించి
    యింకనూ , యీ సజీవ శిల్పము , లందము చిందుచున్న వౌరా!!!

    05) || మత్తేభము ||

    దురితోన్మాదులు ! దుర్విదగ్ధులు ! మ ధాం - ధుల్ ! దుష్ట , దుర్వర్తనుల్!
    అరవిందాళికి , అందమున్ కరపన - న్యాకార , మందార , సుం
    దర , గాంధార , గభీర , శిల్ప కళ ! హ - త్యన్ జేసి , హర్షించినన్ !
    తరుగన్ లేదు !! త్వదీయ శిల్పముల , సౌం - దర్యంబు, రవ్వంతయున్!!!

    ఆహా !! ఈ శిథిల శిల్పముల,కాంచి ,కన్నీరు కార్చని,కళా హృదయు లుందురా!!!

    06) || శార్దూలము ||

    ఎన్నోయేడు , లెదన్ గదల్చు , కథలై - యేలెన్ ! కళా రాజ్యముల్ !

    చిన్నా భిన్నము లైన , యీ , వివిధ , వి - చ్చిన్నాంగ , విన్నాణముల్ !

    చిన్నెల్ , వన్నెలు , చిల్కు , యీ , శిథిలమౌ - శిల్పాల , దర్శించుచున్ !

    కన్నీ రొల్కని వాడు , లే డిచట ! యి - క్కాలాన ! నిక్కంబుగా !

    రిప్లయితొలగించండి
  4. పై పద్యాలను యీ లింకు లో విని తరింపవచ్చు

    http://www.ghantasala.info/allsongs/657_Private-Songs_041_Nagarjunakonda.m3u

    రిప్లయితొలగించండి
  5. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. నటనా పాటవ మెరుగుచు
    పటుతర హొయలన్ సొగసరి పాదముఁ గదుపన్
    నిటలాక్షుండైన మరచు
    నటరాజని తన్నుతానె నటలోలుండై!

    రిప్లయితొలగించండి
  7. రమణీ శిల్పంబిచ్చట
    రమణీయత దోచె మనసు, రక్తిని బెంచెన్
    కమనీయపు పద్యమ్మును
    సుమనమ్మున వ్రాయ దోచె చూడగ నహహా !

    రిప్లయితొలగించండి
  8. చక్కని శిల్పము భళిరా!
    మక్కువతో తీర్చిదిద్దె మగువను శిలలో
    చెక్కిన శిల్పికి జోతలు
    నిక్కంబుగ ప్రాణమున్న నెలతగ దోచెన్!

    రిప్లయితొలగించండి
  9. శ్రీగురుభ్యోనమ:

    జీవము లేని రాయివి సజీవపు శిల్పముగాగ దీర్చిరీ
    దేవళ ప్రాంగణమ్మున, విధేయత జూపెడి నాట్యభంగిమల్
    భావము జాటుచుండినవి, బాధ్యతతో నిను దీర్చినట్టి యా
    పావనమైన శిల్పికుల భాస్కరునిన్ మదినిల్పి కొల్చెదన్.

    రిప్లయితొలగించండి
  10. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ ఉత్పలమాల చాలా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ఏశిల్పి కన్న కలయో
    యీ శిలపై వచ్చి నిల్పెనీ జవరాలై
    లేశంబైన మనమునం
    దే శంకయు లేదు గొప్పదీ శిల్పమనన్

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి