22, సెప్టెంబర్ 2014, సోమవారం

పద్యరచన - 684

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22 కామెంట్‌లు:

  1. కూరలలో వంకాయలు
    చీరలలో కంచి పట్టు చీరలు మరియున్
    తారలలో ధ్రువతారయు
    వీరులలోనర్జునుండు పేరునుగాంచెన్

    రిప్లయితొలగించండి

  2. ఇది కొన్నేళ్ళ క్రితం 'వంకాయ కొత్తిమీర కారం' చేసే విధానంపై వ్రాసిన పద్యం. Recycled for convenience :-)

    కొత్తిమీర నూరి, కొంచెముప్పును జేర్చి,
    పులుపు, మిర్చి, వంగ ముక్కలేసి,
    పోపుజేర్చి దాన్ని పొయ్యమీదుంచితే,
    కూర రుచిగనుండు నారగింప!

    రిప్లయితొలగించండి
  3. వంకాయ కూర వండుము
    వంకాయలు దెచ్చియచట వరుసగ బెడితిన్
    వంకాయ సంఖ్య గణనకు
    బింకముగా నేడు గలవు విమలా !కంటే ?

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    ‘పుష్యం’ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదం ఉత్తరార్ధంలో వ్యావహారిక పదాలు పడ్డాయి. అక్కడ ‘పోపు జేర్చి దాని పొయ్యిమీ దుంచిన’ అందాం.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. వంకాయలు తిప్పుచు నలు
    వంకల నేపుచ్చులేక పరికించవలెన్
    వంకాయలెట్లు వండిన
    వంకలులేకుండ నుండు వాహ్ యను రుచితో.

    రిప్లయితొలగించండి
  6. కూరలఁ బెంచెడి రైతుల
    నారడిఁ బెట్టక ప్రభుత్వమాదరమునుఁజూ
    పరకట!కలికాలమ్మై
    నేరచరితులు కుమతులును నీల్గుదురయ్యా!

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    వంకాయలపై పద్యము
    పొంకమ్ముగఁ జెప్పుమన్న మునుకొని రైతుల్
    సంకటముల బడుచుండుట
    శంకింపగఁ జెప్పినారు సబబా? లక్ష్మీ!

    రిప్లయితొలగించండి
  8. గురువుగారు,
    కూరగా తీసుకొని చెప్పితిని.
    ఈ పద్యము చూడండి.

    వంకాయకు నిండుదనము
    పొంకమునిచ్చెడిది రంగు; పూబోడికి లే
    దింక మనము మెచ్చెడిదీ
    బింకమ్మగురంగుమించి ప్రియముగ తొడగన్.

    రిప్లయితొలగించండి
  9. వంకాయ కూర, వేపుడు
    వంకాయపులుసును తుదకు పచ్చడియైనన్
    పంకజము వంటి సతి యిడ
    శంకలు లేకుండ తినుడు సంతోషముతో!

    రిప్లయితొలగించండి
  10. లక్ష్మీదేవి గారూ,
    మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. నమస్కారం శంకరయ్యగారూ
    గత కొద్దిరోజులుగా గమనిస్తున్న విషయం ఏమిటంటే, కొన్ని పద్యాలలో దొర్లిన దోషాలను మీరు చూసీ చూడనట్టుగా వదిలేస్తునారేమో అనిపిస్తోంది. ఉదాహరణకి లక్ష్మీ దేవిగారి తొలి పద్యం చూడండి మూడపవపాదం హ్రస్వంతో మొదలు కాగా మిగిలిన పాదాలు దీర్ఘాలతో.

    రిప్లయితొలగించండి
  12. కామేశ్వర శర్మ గారూ,
    నిజమే! వృద్ధాప్యం వల్ల సునిశిత దృష్టి లోపిస్తున్నది. ఓపిక కూడ ఉండడం లేదు. దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. వర్ణమందు కృష్ణునకును వరసయగును
    తమ్ముడె నరునకు కిరీట ధారి యగుచు
    అతివ చెక్కిళ్లకు నునుపు నరువునిచ్చి
    పురుషులకు మేలుఁ జేసిన పుణ్య రాశి

    రిప్లయితొలగించండి
  14. గురువుగారు, శర్మగారు!
    పొరబాటు సూచించినందులకు అనేక ధన్యవాదాలు.

    కూరలఁ బెంచెడి రైతుల
    నారడిఁ బెట్టక ప్రభుత్వమాక్షేపించెన్
    ప్రారబ్ధమకట! కలినిన్
    నేరచరితులు కుమతులును నీల్గుదురయ్యా!

    రిప్లయితొలగించండి
  15. గుత్తి వంకాయ కూరను కూర్మి మిత్రు
    నింట గుడిచితి నొక్కనా డిచ్చతోడ
    పొంగిపోయెను మది కడు ముదముతోడ
    కూరలన్ రాజు వంకాయ కూరసుమ్మ!

    రిప్లయితొలగించండి
  16. జిగురు సత్యనారాయణ గారూ,
    కవితామాధుర్యం పెల్లుబికే చక్కని పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    పద్యాన్ని సవరించినందుకు సంతోషం!
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంకెల కందని రకముల
      సంకటమే లేని రీతి శాకము లెన్నో
      వంకాయల వండఁగలుగ
      వేంకన్న కిరీట మిచ్చి వేడుక జేసెన్!

      తొలగించండి
  17. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    నోరూరే గుత్తి వంకాయ కూర నెవరైనా వారింపగలరా తినకుండా :

    01)
    ______________________________

    కూరలలో మేటైనది
    నారాయణు రంగు గలిగి - నాణ్యత గలదౌ;
    నోరూరు జూచి నంతనె
    వారింపగ లేరు గుత్తి - వంకాయ్‌ కూరన్ !
    ______________________________

    రిప్లయితొలగించండి
  18. ఈ సందర్భంలో ఒక సుప్రసిద్ధమైన
    వంకాయపై చాటువును గుర్తు చేసుకోవడం ముదావహం :

    వంకాయ వంటి కూరయు
    పంకజముఖి సీతవంటి - భామా మణియున్
    శంకరుని వంటి దైవము
    లంకాధిపు వైరి వంటి - రాజును గలడే !

    రిప్లయితొలగించండి

  19. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం, గుర్తుచేసిన చాటువు బాగున్నవి. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. అత్తలు నేర్పిన చక్కటి
    గుత్తుల వంకాయ కూర గుత్తుల కొరకున్
    విత్తులు లేనట్టి వగుచు
    మెత్తని వంకాయ లిచట మిలమిల మెరిసేన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  21. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి