25, సెప్టెంబర్ 2014, గురువారం

పద్యరచన - 687

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. పట్టు పరికిణీలోనున్న చిట్టి పాప
    ముద్దు ముద్దుగ నలరారు మోముతోడ
    పావురములకు వేయుచు ప్రాల నచట
    చిఱుత ప్రాయాన దయచాటె జీవులందు

    రిప్లయితొలగించండి

  2. చిఱు త ప్రాయము నందున చిట్టి పాప
    చల్లు చుండెను బియ్యము మెల్ల గాను
    భూత దయతోడ మఱి యాక పోత ములకు
    చూడ చక్కని బిల్లయే చూడు నీవు

    రిప్లయితొలగించండి
  3. మూర్తి త్రయంబును ముద్దుబిడ్డలుగను
    *****మార్చిన యనసూయమాత కాదె!
    వ్యాసుని క్షుత్తుకు వండివడ్డించిన
    *****ముత్తైదువౌ యన్నపూర్ణ కాదె!
    పక్షికుల వరుని పట్టిగ గలిగిన
    *****ఘనత వహించిన వినత కాదె!
    పులుగులె పెంచగ వెలుగులు జిమ్మిన
    *****కుశకులజాత శకుంతలేమొ!

    ఎవరొ? ఏమియో? తెలియదు వివరమేమి!!
    చిత్రము చిరునామా మరి చెప్పదాయె
    పావురముల సఖి మనతో పలుకదాయె
    తేరిజూడ కానగ వచ్చు తెనుగు తనము

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఎందువలన :

    01)
    _____________________________

    పావురములకు గింజలన్ - పాపబెట్ట
    పావురములన్ని నిశ్చేష్ట - పాలుపడుట
    పచ్చలంగాను గాంచిన - ముచ్చటౌనొ ?
    పాప సొగసును గనగల్గు - పరవశంబొ?
    పాప యనురాగమును గన్న - బాళి వలనొ?
    యెందు వలననొ చెప్పు డ - దేమి కతన !
    _____________________________
    పాలుపడు = పాల్పడు = స్వాధీనమగు

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘చక్కని పిల్లయే’ అనండి.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    తెలుగుదనముట్టిపడుతున్న మీ సీసపద్యం మనోహరంగా ఉంది.. అభినందనలు.
    ‘శకుంతల + ఏమొ’ అన్నప్పుడు సంధి లేదు. పై మూడు పాదాల చివర ‘కాదె’ అన్నారు. ఇక్కడ కూడా అలాగే ‘శకుంతల కద’ అనండి.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘అంతు గానని యాకసమునకు నంతు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. గుమ్మము లోన చిన్నదిట కూర్చొని యున్నది గువ్వ పిట్టలున్
    గమ్మున చూచు చుండినవి కన్యక యేమిటి చేయుచున్నదో
    అమ్మ తినంగ నిచ్చినటు లచ్చట దోచెడి నేవొ పప్పులన్
    నెమ్మది తీసి తొక్కలను నీటుగ జేసెడి నోట వేయగాన్.

    రిప్లయితొలగించండి
  8. పట్టు పావడ గట్టి చిన్నది పావురమ్ముల బిల్చుచూ
    బెట్టుచుండెను ధాన్యసారము ప్రేమ మీరగ వాటికిన్!
    చిట్టిచేతులు గట్టి మేలును చేయుచుండుట చూడగా
    మట్టి కాదుర దేశమన్నది మానవత్వమె సోదరా!

    రిప్లయితొలగించండి
  9. గురువు గారికి నమస్కారములు
    అంతు గానని యాకసం బున నంతు జూపెడు పక్షులున్
    చెంత నిల్పిన చిన్న పాపకు చింత దీర్చును ప్రేమమున్
    సంత సంబున ఒక్క చోటున సాన్నిహిత్యము చూడగన్
    శాంతి దూతలు శక్తి మంతులు సత్య శోధన సల్పగన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘పిల్చుచూ’ అనడం గ్రామ్యం. ‘పిల్చుచున్’ అనండి.
    *
    రాధాకృష్ణ రావు గారూ,
    మీరు చెప్పిందే సరి! సవరణ బాగున్నది. సంతోషం.

    రిప్లయితొలగించండి
  11. పట్టు పావడ ధరియించి చిట్టితల్లి
    పావురములకు నిడుచుండెఁ బ్రాలనిప్డు
    చిఱుత ప్రాయము నుండియే జీవులందు
    నధికప్రేమను బంచెనా యంబుజాక్షి

    రిప్లయితొలగించండి
  12. పావురములరావమ్ముల
    నీవవలోకించ నెంచ నేర్పరి వమ్మా
    యావంత తిండి బెట్టిన
    సేవక విశ్వాసముంచి సేవించునవే!

    రిప్లయితొలగించండి