21, సెప్టెంబర్ 2014, ఆదివారం

పద్యరచన - 683

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. అన్నెము పున్నెమునెరుగని
    చిన్నారికి కాలనాగు చేరువకేగెన్
    వెన్నున జలిపుట్టుగదా
    గన్నంతనె యేరికైన గడుభీతిగొనన్

    రిప్లయితొలగించండి
  2. పసి బాలుడు నిద్రించగ
    మిస మిస వర్ణంబు తోడ మెరయుచు పామున్
    పసివాని దరికి జేరగ
    శశి ధరుగా నూహ కలిగి సన్నుతి జేసెన్

    రిప్లయితొలగించండి
  3. బాలకుండు నిద్రించెను పఱుపుపైన
    కాలనాగు పరివృతుడై, కాంచగానె
    భయము తోడను దేహము వణకు చుండె
    నెట్టి కీడును బొందునో యెంచ గలమె?

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగున్నది మీ పద్యం. అభినందనలు.
    ‘సన్నుతి జేతున్’ అంటే బాగుంటుందేమో!
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. పాపడట్టుల నిద్రించ పరుపు పైన
    పడక పైనెక్కె చూడుడా పాపరేడు
    పడగ పట్టగ వచ్చెనా పాపపైన ?
    పట్టినట్లైన మున్ముందు పాప ఱేడు !

    రిప్లయితొలగించండి
  6. శిశువు నిదురించు తావున
    విసదారియె పరుపు పైన ప్రీతిగ జేరెన్
    శశిభూషణ! వందనములు
    పసికూనను గావవేగ పరుగున రావే!

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. కాల నాగు లైన కాల యముండైన
    మేలు కొలుప లేవు బాల నిద్ర!
    చింత లేని నిద్ర శ్రీరామ రక్షయౌ!
    నలత లన్ని దీర్చి వెలుగు నింపు!

    రిప్లయితొలగించండి
  9. ఆద మరచి యున్న అందాల పసిపాప
    కనగ లేరు యచట కన్న వారు ,
    పొంచి యున్న విషపు పుట్ట దిట్టనుజూడ
    కాన వచ్చెనాకు కలుష మంత ,
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  10. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘లేరు + అచట = లేరచట’ అవుతుంది. యడాగమం రాదు. ‘కనగ నచట లేరు...’ అనండి.

    రిప్లయితొలగించండి