2, సెప్టెంబర్ 2014, మంగళవారం

నిర్వచన భారత గర్భ రామాయణము – 72


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
చం.      అన(విని యుత్తరం బొసఁగె నా చెన టిట్లని,వెఱ్ఱి, యేనుఁ జే
సిన పనిచే)సితిన్, విడువ సీతను సున్నము వానిఁ జేతు వీ
కను, (వనటొంది వాడియునుఁ గానను హీనతఁ జిక్కియున్ రణం
బొనరుచుటా?) భలే! యుడుత యూపుల కెందును మ్రాఁకు లూఁగునే. (౮౭)

భారతము-
కం.       విని యుత్తరం బొసఁగె నా
చెన టిట్లని, వెఱ్ఱి, యేనుఁ జేసినపనిచే
వనటొంది వాడియునుఁ గా
నను హీనతఁ జిక్కియున్ రణం బొనరుచుటా. (౮౭)

టీక- చెనటి = (రా) రావణుఁడు, (భా) దుర్యోధనుఁడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి