జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగునన్నది. అభినందనలు. ‘ద్విజ’కు ‘యుగళజ’కు భేదం ఉందనుకుంటాను. యుగళమంటే ‘జత’ కదా! * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ (పంచపాదితో సహా) బాగున్నది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘జంకు’... ‘జడుపు’ అయితే బాగుంటుందేమో? * మాజేటి సుమలత గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో యతిదోషం. ‘త/ టాలునఁ గొనె నసుర కపటమునిగ నయి’ అనండి. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. సంపత్ కుమార్ శాస్త్రి గారు చెప్పినట్లు చివరి పాదంలో యతి తప్పింది. అంతేకాదు ‘వుగ్గబట్టు’ అన్నారు. తెలుగులో వు,వూ,వొ,వోలతో మొదలయ్యే పదాలు లేవు. ఆ పాదాన్ని ‘చివరకు నొరిగియు తను/ వును విడిచె రఘురామునిఁ గనిన పిదప’ అందామా? * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. జటాయువుకు ‘జట + ఆయువు’ అన్న వ్యుత్పత్తి ఉన్నట్టు నాకు తెలియదు. ఉంటే సరి! లేదంటే ఆ పాదంలో యతిదోషం.
గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ సవరణ బాగున్నది. అభినందనలు.
జనక పుత్రిని కావగ దనుజపతి క
రిప్లయితొలగించండిటారికి బలియయ్యె ఘనుఁడు ధీర వరుఁడు
యుగళజ కులవరుఁడు స్నేహితోత్తముఁడు! ధ
వునికి రఘు వరునికి జెప్పి చనియె తాను!!
జనక పుత్రిని తీసుకు జనుచు నట జ
రిప్లయితొలగించండిటాయువాపంగ రావణుం డాగ్రహించి
యుక్తిఁ రెక్కలు త్రుంచగ నుర్విని తను
వునిడి రామునికై వేచె పునుగచటనె
(ఐదు పాదాలు వ్రాయవచ్చు అంటే నా పద్యము క్రింది విధంగా గ్రహించ ప్రార్ధన )
జనక పుత్రిని తీసుకు జనుచు నట జ
టాయువాపంగ రావణుం డాగ్రహించి
యుక్తిఁ రెక్కలు త్రుంచగ నుర్విని తను
వునిడి రామునికై వేచి పునుగు సీత
జాడ తెలిపిన పిమ్మట జనెనుదివికి
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
తనను రక్షించడానికి యత్నించిన
జటాయువుకు పట్టిన గతికి
సీతమ్మ యెంత విలపించినదో గద :
01)
____________________________
జంకు లేకుండ నెదురొడ్డి - సారసము; త
టాలున తులువన్ దన్నిన; - జాలి మరచి
యుర్వి బడునట్లు నరికిన - గర్వి గని , చి
వుక్కు మనె సీత మనసంత; - రెక్క తెగిన
పక్షి గతి జూసి విలపించె - బాధ తోడ !
____________________________
ఎదురొడ్డు = ప్రతిఘటించు
సారసము = పక్షి
జనక రాజ కుమారిని జానకిన్ త
రిప్లయితొలగించండిటాల్న రావణు డపహరణమ్ము సేసి
యురుకు చుండుట గాంచి యుద్యుక్తుడగుచు
వుర్విజన్ గావ ప్రాణము లొడ్డె పాతి!
జనక సూతిని దొంగిలి చనుచునుండు
రిప్లయితొలగించండిటాక సంబున జూచెనా యసురు పక్షి
యురికి రక్షించ బోయి తా నొరిగె పుడమి
వుగ్గబట్టెను ప్రాణమ్ము రాము కొరకు.
జనక పుత్రిని కావఁగ సాహసపు జ
రిప్లయితొలగించండిటాయువెదిరించి రావణునమిత శక్తి
యుక్తులను బూని చివరకునోడెను ప్రభు
వునకునర్పించె జీవితమనవరతము.
శ్రీ హనుమచ్చాస్త్రి గారు,
రిప్లయితొలగించండినాలుగవ పాదములో యతి మైత్రి సందేహము.
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగునన్నది. అభినందనలు.
‘ద్విజ’కు ‘యుగళజ’కు భేదం ఉందనుకుంటాను. యుగళమంటే ‘జత’ కదా!
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ (పంచపాదితో సహా) బాగున్నది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘జంకు’... ‘జడుపు’ అయితే బాగుంటుందేమో?
*
మాజేటి సుమలత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతిదోషం. ‘త/ టాలునఁ గొనె నసుర కపటమునిగ నయి’ అనండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంపత్ కుమార్ శాస్త్రి గారు చెప్పినట్లు చివరి పాదంలో యతి తప్పింది. అంతేకాదు ‘వుగ్గబట్టు’ అన్నారు. తెలుగులో వు,వూ,వొ,వోలతో మొదలయ్యే పదాలు లేవు. ఆ పాదాన్ని ‘చివరకు నొరిగియు తను/ వును విడిచె రఘురామునిఁ గనిన పిదప’ అందామా?
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జటాయువుకు ‘జట + ఆయువు’ అన్న వ్యుత్పత్తి ఉన్నట్టు నాకు తెలియదు. ఉంటే సరి! లేదంటే ఆ పాదంలో యతిదోషం.
జనక సుతతోడ లంకేశు జనుటగని క
రిప్లయితొలగించండిటారి నెదిరింప దానవుం డాగ్రహముగ
యురుకు రెక్కలు ఖండించి పెరికి వేయ
వుర్వి బడితి రామా! యని నూపిరొదిలె !
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండిజనక జాత్మజఁ గావగ, చటుల బల, జ
టాయు వడ్డంగ రావణు డతనిఁ గొట్ట
యువతి సీతయు దుఃఖించి, యోధుని, తను
వు నటు గాంచియు నోదార్చె పొదివి యతని
జగతి నాజటాయు, వినత సంతువాడు
టావు నాకాస మందున టక్కుమనుచు
యుద్ధ మొనరించె "సీతను, యోగ్యను, విడు
వు"మని, కోల్పోయె రెక్కలు పూర్తిగాను
ఉర్వి అనేది సాధురూపం, వుర్వి అని వ్రాయకూడదు.
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండితేట గీతి జనకసుత గావ రావణు చాపమును జ
టాయువిరిచెను యసురుడు డాసికత్తి
యుగళ పక్షముల్ ఖండింప నొరిగె.నాయు
వులనిలుపుకొనె తా రాఘ వునకు దెలుప
కె.యస్.గురుమూర్తి ఆచారిగారి పూరణ
రిప్లయితొలగించండిజనకసుతగొని వెడలురాక్షసుని గని జ
టాయు వెదిరింపగని పాప మతని పక్ష
యుగము నరికె నైనబ్రతికి యుండి రాఘ
వునకు వివరించె సీతమ్మ యునికి నపుడు
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీఆదిభట్ల వారు పేర్కొన్నట్టు ‘వుర్వి’ అని ప్రయోగించడం దోషమే. ‘పెరుక రాఘ/వునకు తెలిపి ప్రాణములను వీడె నపుడు’ అందామా?
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విరిచెను + అసురుడు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘విరిచినా డసురుడు’ అనండి.
*
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజనకు పుత్రికై నసురుతో సమరమును జ
రిప్లయితొలగించండిటాయువు చలుప, వెస వాడు డాకి పక్ష
యుగ్మమును తున్మగా నవి యూడి, మృత్యు
వుతఱుముచు నుండగ జటాయువుధరఁ బడియె
జనక పుత్రికకై వీడి జంకు నదె జ-
రిప్లయితొలగించండిటాయు వెదురించి పోరాడి మాయగాని
యుగ్ర ఖడ్గంపు ధాటికి యొరిగెను తను-
వునను యూపిరుల్ నిల్పి రాముని కనుగొన.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని ‘జటాయువు’ పునరుక్తి అయింది.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు.
రిప్లయితొలగించండిజనక నంద నాపహరణ సమయమున జ
టాయు వడ్డంగ దశకంఠుఁ డమిత రోష
యుతుఁడుగా నయ్యు "నో జటాయు! గత పక్ష
వుగ నగు" మటంచుఁ బంతమ్ముఁ బూని నఱకె!
కె.ఈశ్వరప్పగారి పూరణ
రిప్లయితొలగించండిజనని జానకి చెరగొన్న దనుజ పతి జ
టాయువనిని సేయ౦గ కటారినేసి
యుత్తరించగ రెక్కల నోర్మి రాఘ
వునకు వివరించి తెలిపెను చనెను దివికి
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సూచన ననుసరించి నాలుగవ పాదాన్ని మార్చి మరల పంపుచున్నాను.
రిప్లయితొలగించండిజనకు పుత్రికై నసురుతో సమరమును జ
టాయువు చలుప, వెస వాడు డాకి పక్ష
యుగ్మమును తున్మగా నవి యూడి, మృత్యు
వు తఱుముచు నుండగన్ తనువు ధరఁబడియె
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ సవరణ బాగున్నది. అభినందనలు.
సంపత్ కుమార్ గారూ ! నిజమే త్వరపాటు లో పొరపాటు..తెలియజేసినందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమాస్టరుగారూ ! చక్కని సవరణ చూపినందులకు ధన్యవాదములు.
సవరణతో...
జనక సూతిని దొంగిలి చనుచునుండు
టాక సంబున జూడగా యపుడు వగచి
యురికె రావణు జంపగా, పడెజటాయు
వునకు రెక్కలు నరుకగా పుడమి పైన.
ధన్యవాదములు గురువు గారు! సవరణతో...
రిప్లయితొలగించండిజనక రాజ కుమారిని జానకిన్ త
టాలునఁ గొని యాచక రూప డాంబికుడట
యురుకుటన్ గాంచి నతనిపై దూకొని పటు
వుగ తలపడి కడకునసువునిడె వియతి!
గురువుగారికి వందనములు.
రిప్లయితొలగించండినిన్నటి పద్యములో కొంత తప్పిదము దొర్లినది. యతిమైత్రి దోషము.
టాయువెదిరించి రావణునమిత శక్తి
లోని తప్పును చూపిన ( యతిమైత్రి లేనివిషయము ) విషయాన్ని ఆలస్యంగా చూసాను. మన్నించండి. దానిని యీ క్రింది విధంగా సవరించినాను. తెలియజేయగలరు.
జనక పుత్రిని కావఁగ సాహసపు జ
టాయువదె వచ్చె నంత నడ్దంబుగాగ
యుక్తులను బూని చివరకునోడెను ప్రభు
వునకునర్పించె జీవితమనవరతము.