6, సెప్టెంబర్ 2014, శనివారం

నిర్వచన భారత గర్భ రామాయణము – 76


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
గీ.         (కటకట జనించెఁ జెడుతఱి విటపికిఁ గడు
కుక్కమూతిపిందె లనఁగఁ గూకటులును
మూల లెనసి యక్కట వంశము సమయుటకు
ను ఖలమతి వొడమెన్) నాదు నుడుల వినుము. (౯౧)

భారతము-
కం.       కటకట జనించెఁ జెడుతఱి
విటపికిఁ గడు కుక్కమూతిపిందె లనఁగఁ గూ
కటులును మూల లెనసి య
క్కట వంశము సమయుటకును ఖలమతి వొడమెన్. (౯౧)

టీక- ఖలమతి = (రా) దుష్టమగు బుద్ధి, (భా) దుష్టబుద్ధి యగు దుర్యోధనుఁడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి