5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

నిర్వచన భారత గర్భ రామాయణము – 75


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
చం.      అనియును వెండి నా(ప్రభుని నారసి యీగతి పెల్కెఁ, బాక)మే
ఘనరుచి నుండినన్ (గుణము గ్రాహ్యమె తెడ్డునకుం? గడంక)మైఁ
గనలకు పెల్లుగా (నడవిఁ గాచిన వెన్నెల యయ్యె నాదు) క్షే
మ నయ యుతంబులౌ (నుడులు, మంజులయుక్తమునుం దలంపు)మా. (౯౦)

భారతము-
గీ.         ప్రభుని నారసి యీగతి పెల్కెఁ, బాక
గుణము గ్రాహ్యమె తెడ్డునకుం? గడంక
నడవిఁ గాచిన వెన్నెల యయ్యె నాదు
నుడులు, మంజులయుక్తమునుం దలంపు. (౯౦)

టీక- ప్రభుని = (రా) రావణుని, (భా) ధృతరాష్ట్రుని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి