17, సెప్టెంబర్ 2014, బుధవారం

పద్యరచన - 679 (విమాన ప్రయాణము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“విమాన ప్రయాణము”

17 కామెంట్‌లు:

  1. దక్షిణ మెరికా యందున్న తనయు జూడ
    పయన మైతి వి మానము పైన మేము
    పక్షి మాదిరి గగనాన పరుగు లిడుచు
    మహిని దిగియెను మరియా వి మాన మపుడు

    రిప్లయితొలగించండి

  2. విమానము ఆకసమున ఎగుర చూసి
    చిన్నతనమున హృదయము మురిసినది !
    నేడు విమాన ప్రయాణమున ఎగుర చూసి
    బిక్కు బిక్కుమని హృదయము అలసినది !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. గగన వీధుల నెగిరెడి ఖగము వోలె
    పాల మబ్బుల మధ్యలో పరుగు దీయు
    దూర మెంతైన చిటికెలో చేరుకొనుచు
    హాయిగొల్పు విమాన ప్రయాణ మనిన!!!

    రిప్లయితొలగించండి
  4. బంధుమిత్రు లెల్ల విదేశపర్యటనలు
    జేసి తమ యనుభవములఁ జెప్పుచుండ
    నెప్పు డాకాశయానమ్ము చొప్పడునొ యని
    కల్ల లని తెలిసియు నేను కలలు గందు.

    రిప్లయితొలగించండి
  5. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *

    జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం....

    ఆకసమున విమానము లరుగుచుండ
    చిన్నతనమునఁ గంటిమి చిత్ర మనుచు
    నిప్పు డావిమానమ్ముల నెక్కి తిరుగ
    బెదరి నా హృదయము బిక్కుబిక్కుమనును.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. సామర్థ్య మాకస మెగయ
    నేమూర్ఖత నావహించి నేమార్చె నిటుల్
    సామూహిక నాశానికిఁ
    దా మార్చె మనిషి విమాన దారుడ్యమునే!

    రిప్లయితొలగించండి
  7. బిడ్డలంత నేడు వివిధదేశాలలో
    కొలువులఁగొని యచట వెలుగు చుండ్రి
    చేరగమ్యములకు శీఘ్రమ్ముగా నేడు
    ఆవిమానపయన మవసరమ్ము

    రిప్లయితొలగించండి
  8. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘విమానపయనము’ దుష్టసమాసము. ఆ పాదాన్ని ‘ఆ విమానయాన మవసరమ్ము’ అనండి.

    రిప్లయితొలగించండి
  9. జెట్టులోనెక్కుట చిరకాల స్వప్నంబు - సాకార మవబోవు సమయమిదియె
    గాలిలోననెగురు గరుడపక్షినిబోలు -నెయిరుబస్సునుజేరి యెక్కుచుండ
    చిరునవ్వు చిందించి చేతులు జోడించి -స్వాగతమిడెనొక సరసిజాక్షి
    సీటులో గూర్చుంటి శీతలీకరణపు - చల్లదనమ్ములో మెల్లగాను
    యెగిరె లోహవిహంగమీ యిలను వదిలి
    వాయువేగంబునజనుచు హాయిగాను
    గనులు మూయంగ నిదురలో కలలుమూగె
    గగన చరులైన దివిజుల గంటినచట

    రిప్లయితొలగించండి
  10. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు.తమరి సవరణకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. మాస్టారూ! మీపద్యము మూడవ పాదంలో గణభంగమయినట్లున్నది

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    విమానప్రయాణాన్ని సవివరంగా సీసపద్యంలో చెప్పారు. బాగుంది. అభినందనలు.
    నా పద్యంలో గణదోషం గుర్తించి తెలిపినందుకు ధన్యవాదాలు. అక్కడ ‘చొప్పడు నని’ అని సవరిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  13. మానము అవకాశమ్ము , వి
    మానము మేమెక్క గలుగు మహదవకాశం
    కానగ జూతుము, యెక్కుట
    కా నగవుల మోము దలచి గడిపెదమికపై.

    రిప్లయితొలగించండి
  14. గగన సంచారమది క్రొత్త కాదు మనకు
    రాజు దుష్యంతుడు దిగిన రమ్యవర్ణ
    నమ్ము, మేఘ సందేశ విహంగ వీక్ష
    ణమ్ము ఋజువులనుటయేను నాదు మతము.

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘అవకాశం’ అని వ్యావహారికాన్ని, ‘జూతిము + ఎక్కుట = జూతి మెక్కుట’ అన్నచోట యడాగమాన్ని ప్రయోగించారు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. ఆకాశమ్మున హంసల
    నాకవి వర్ణించినట్లు నభమున మనుజుల్
    తేకువ జూపుచు నెగురుట
    నవకమ్మగు శాస్త్ర మహిమ నతి విజ్ఞతకున్

    (నతి=నమస్కారము)

    రిప్లయితొలగించండి
  17. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి