6, సెప్టెంబర్ 2014, శనివారం

పద్యరచన - 668 (అన్నసంతర్పణము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“అన్నసంతర్పణము”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

12 కామెంట్‌లు:

 1. అన్నసంతర్పణంబులనన్నిచోట్ల
  నిర్వహించెడి జనులార నిదురలెండి
  పేదవారికి పెట్టక ప్రియము మీర
  విందు చేసికొనిననేమి పొందు మేలు?

  రిప్లయితొలగించండి

 2. బోడిగుండు నగర మునకు తర్పణ మిచ్చి
  దూర గమ్యముగ విజయమ్మును వరించి
  అన్న 'some' తార(క) 'ఫణము'జేసే
  రాచ వాడ అయ్యే విజయవాడ రాజ్యమునకు !!


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పద్యము....

  వెన్నుని సేవలకంటెను
  జన్నము, చయనమ్ము,తపము జపముల కంటెన్
  మున్నేత్రు పూజకంటెను
  ఎన్నగ నన్నంపుదానమెక్కుడు సుమ్మా

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘ఏమి పొందు మేలు’ అన్నదానిని ‘మేలు పొందగలరె’ అంటే ఇంకా బాగుంటుందేమో!
  *
  జిలేబీ గారూ,
  _/\_
  *
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. అన్నిదానములను నన్న దానమె మిన్న
  యన్న బుధుల మాట లున్నతములు
  యన్న మిచ్చు వారి నన్న పూర్ణ యనుచు
  పిలుచు చుంద్రు జనులు పేర్మితోడ

  రిప్లయితొలగించండి
 6. లోకము నందలి జీవుల
  కాకలె పెంపును బలమ్ము నందగ జేయున్
  రూకలు లేనట్టి జనుల
  సాకెడు మహనీయ మన్న సంతర్పణమే !

  రిప్లయితొలగించండి
 7. అమ్మ క్యాంటీనులచ్చట యిమ్ముగుండె
  అన్న క్యాంటీనులిచ్చట మన్ననొంద
  అన్నసంతర్పణమనిన యదియు యిదియె
  నోట మెతుకు పడిన చాలు పూట గడుచు!!

  రిప్లయితొలగించండి
 8. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘ఉన్నతములు + అన్నము’ అన్నపుడు యడాగమం రాదు. ‘మాట యుత్తమ మగు/ నన్నము...’ అనండి.

  రిప్లయితొలగించండి
 10. మాస్టారూ! శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పద్యములో "పూజకంటెను+ఎన్నగ సంధి అవుతుందేమో!

  రిప్లయితొలగించండి
 11. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  నిజమే.. నేను గమనించలేదు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి