5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం – 1513 (గురునకు పంగనామముల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్.

21 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పరమానందయ్యశిష్యులు సినిమాలో
    చిత్రలేఖ శాపమున బుద్ధిహీనులైన వారు
    తప్పు చేసినా ఒప్పు చేసినా గురువుకు
    మంచే జరుగుతుంది కాబట్టి వాళ్ళే ఉత్తమ విద్యార్థులు :

    01)
    ________________________________________

    నిరుపమ ఙ్ఞాన వంతులదె ♦ నిగ్గడులౌటను చిత్ర శాపమున్
    మరచిరి పూర్వ సంగతుల ♦ మంచిని చెడ్డను సర్వ విద్యలన్ !
    గురువుగ నొక్క పండితుని ♦ గూటికి జేరిరి బృందమందరున్
    తరచుగ జేయు చుండిరట ♦ తప్పుల నొప్పుల పిచ్చి చేష్టలన్ !
    గురువుకు పంగనామముల ♦ గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్ !
    ________________________________________
    నిగ్గడి = మూర్ఖుడు
    చిత్ర = చిత్రమైన (లేక చిత్రలేఖ)
    గూడు = ఆకుగుడిసె
    గూటికిజేరు = క్షేమమగు స్థానమునకు చేరు

    రిప్లయితొలగించండి
  2. కవిమిత్రులు మన్నించాలి.
    నిన్న సమస్యను షెడ్యూల్ చేసే తొందరలో గమనించకుండా ‘గురువుకు’ అన్నాను. ‘గురువునకు’ సాధురూపం. అందువల్ల ‘గురునకు’ అని సమస్యను సవరించాను.
    *
    వసంత కిశోర్ గారూ,
    పరమానందయ్య శిష్యుల కథను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నిరుపమ జ్ఞాన’ అన్నప్పుడు ‘మ’ గురువై గణదోషం. ‘నిరుపమ బుద్ధిమంతులదె...’ అందామా?

    రిప్లయితొలగించండి

  3. మెరయగ మూలమూర్తియగు వేంకటనాథుడు యేడుకోండ్లపై
    ధర హరివాసమైవెలుగ, ధారుణిదేవతలర్చకోత్తముల్
    కరముల శంఖచక్రముల గైకొని నిల్చిన స్వామికిన్, జగ
    ద్గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్.

    రిప్లయితొలగించండి
  4. చందామర్కులు ప్రహ్లాదునితో అన్నట్లుగా భావించి:

    గురువులు చెప్పిరంచు గుణ కోవిదు డా హరి యంచు నిష్ఠతో
    పరువును మాప మాకిచట భావ్యమె బాలక పల్కి మాటికిన్
    చెరుపగు నీదు తండ్రి విన శీఘ్రమె జూపుము మాకు వారినిన్
    త్వరితమె మూడు, కాదనెదవా హరి గూర్చి వచించు నీచులౌ
    గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్.

    రిప్లయితొలగించండి
  5. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    తిరిపరులై చరించెదరు తీవ్రపుశిక్షల పొ౦దు వారలా
    గురునకు బంగ నామములు గుట్టుగ బెట్టెడి శిష్యు, లుత్తముల్
    తరతమ భేదముల్ మరచి తద్గురు బోధలు దేశసేవకై
    బరపెడి వారలీ భువిని పాలన సేయ సమర్ధులై తగన్

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    మల్లెఇఅ వారి పూరణలు
    1.గురువుల పూజ సేయుటది గొప్పగుసంస్కృతి
    భారత౦బునన్
    గురువులుశిష్యకోటినకుగోముగనె౦చని బిడ్డలట్లు తా
    గురునకు బంగ నామములు గుట్టుగ బెట్టెడి, శిష్యు, లుత్తముల్
    గురువులతప్పు లేన్చకయే గొల్తురు వానిని దైవమట్లుగాన్
    2.గురువులుతప్పుజేసినను కూడదువారి నగౌరవింపగా
    గురువుల వద్ద శిష్యులకు గొప్పగ పొందక మంచి వర్తనన్
    గురునకు బంగ నామములు గుట్టుగ బెట్టెడి శిష్యు, లుత్తముల్
    గురువులవద్ద నేర్తురిక గొప్పగుస౦స్కృతి వర్తనంములన్

    రిప్లయితొలగించండి
  7. కె.ఈశ్వరప్ప గారిపూరణ
    అరయగ విష్ణు నామ జప మంతర మ౦దువిభూతిరేఖనా
    గురునకు బంగ నామములు గుట్టుగ బెట్టెడి, శిష్యు, లుత్తముల్
    సరియగు మార్గమున్ తెలిసి సాధన బోధననేర్చి బుద్ధిగా
    వరలెడి భావి పౌరులను వారల జూసిన మెప్పు పొందగా

    రిప్లయితొలగించండి
  8. కరుణయొకింతలేక తనకార్యములన్ నెరవేర్చనెంచి యా
    తురతఁ ఘటించి బాలకులతోఁ బరిచర్యల చేయబంచి స
    త్వరము విభిన్న రీతి నిహితం బొనరించుచునున్న యట్టి యా
    గురునకుఁ బంగనామములు గుట్టుగఁ బెట్టెడు శిష్యులుత్తముల్.

    నిహితము = కొట్టుట

    రిప్లయితొలగించండి
  9. చెరగని జ్ఞాపకంబులగు చిన్నతనంబున పాఠశాలలో
    తరగతి పాఠముల్ వినక తన్నులు తింటయు చేసినట్టి య
    ల్లరి పనులట్టివారిపుడు లాయరు డాక్టరు లైరి యక్కటా!
    గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్

    రిప్లయితొలగించండి
  10. గురువుగారికి వందనములు.

    నిన్నటి పద్యములో కొంత తప్పిదము దొర్లినది. యతిమైత్రి దోషము.

    టాయువెదిరించి రావణునమిత శక్తి

    లోని తప్పును చూపిన ( యతిమైత్రి లేనివిషయము ) విషయాన్ని ఆలస్యంగా చూసాను. మన్నించండి. దానిని యీ క్రింది విధంగా సవరించినాను. తెలియజేయగలరు.

    జనక పుత్రిని కావఁగ సాహసపు జ
    టాయువదె వచ్చె నంత నడ్దంబుగాగ
    యుక్తులను బూని చివరకునోడెను ప్రభు
    వునకునర్పించె జీవితమనవరతము.


    రిప్లయితొలగించండి
  11. నిరతము నీతి మార్గమున నీమము దప్పని వారి దూలుచున్,
    తర తమ భేద మెంచుచును ధర్మము దప్పె డి వారి గాచుచున్,
    గురువులు కొం ద రుం డగను , కోవిదు లెల్లరు మెచ్చునట్లు, ఆ
    గురువుకు బంగ నామములు గుట్టుగ బెట్టె డి శిష్యు లుత్తముల్
    కొరుప్రోలు రాధ కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  12. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు.


    (ప్రహ్లాదకుమారునకుం గల హరిభక్తిని మాన్పించుటకు నిరంతరము యత్నించుచున్న గురులపైఁ దిరస్కారభావముతో నతని స్నేహితులు చేసిన దుడుకు చేష్ట యంగీకృతమేయని సమర్థించు సందర్భము)


    గురువులు చండమర్కులకుఁ గూరిమి విష్ణుని నామమెన్నఁగన్
    నిరసనయుంట నోర్చకయ నేర్పున శిష్యులు పంగనామముల్
    హరిని స్మరించి దిద్దిరి!! యహమ్మును గల్గినయట్టి మూర్ఖుఁడౌ
    గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్!!

    రిప్లయితొలగించండి
  13. గురువును నేనె సాధకులు గుంపుగ రండని బోధసేయుచున్
    మరుగున రాత్రివేళలను మారుని కేళికి శిష్యురాండ్రనే
    సరగున బిల్చు వారికిని శాస్తిని జేయ రహస్య చిత్రణన్
    గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్.

    రిప్లయితొలగించండి
  14. శ్రీగురుభ్యోనమ:

    గురువు అనగా కేవలము ఉపాధ్యాయుడనే కాకుండా వివిధ కార్యాలయములలో తమ పై అధికారులను గురువులుగానే పిలుస్తుంటారు. అటువంటి అధికారులు కొందరు తమ పనిని విడచి యితర (రియలెస్టేట్, చీటిలు మొ//) పనులు చేస్తుంటారు. అటువంటివారిని నొప్పించకుండా విమర్శించే శిష్యులు) ఆ భావంతో

    భరత విశాల ఖండమున బాధ్యత వీడుచు నెందరెందరో
    గురుతర లక్ష్యమున్ విడచి గోప్యముగా పలువృత్తులెన్నియో
    స్థిరముగ జేయుచుండ, గని దృష్టి మరల్చగ సున్నితమ్ముగా
    గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్

    రిప్లయితొలగించండి
  15. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి గురు పూజోత్సవ శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులకు నమస్కృతులు.
    ముందుగా నిన్న శుభాకాంక్షలు తెల్పిన అందరికీ ధన్యవాదాలు.
    నిన్న గ్రామాంతరం వెళ్ళి ఉదయమే తిరిగి వచ్చాను. అందువల్ల నిన్నటి పూరణల, పద్యల సమీక్ష చేయలేకపోయాను. మన్నించండి. వీలైతే ఈ సాయంత్రం లోగా చేస్తాను.
    నిన్నటి సమస్యకు చక్కని పూరణ లందించిన మిత్రులు....
    వసంత కిశోర్ గారికి,
    మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారికి,
    మిస్సన్న గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. సరకులు మోసి వేగమె పచార్లు ముగించి రసోయి చేర్చుడన్
    కరములు మోడ్చి శ్రీమతికి గంటలు గంటలు సేవ జేయుడన్
    పరుగులు బెట్టి థీసిసు గభాల్న ఛపావని పోరుబెట్టెడౌ
    గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్

    రసోయి = వంటగది
    ఛపావు = ముద్రించు

    రిప్లయితొలగించండి
  18. మురియుచు కన్ను గొట్టుచును పూవుల నిచ్చుచు రోజురోజునన్
    విరివిగ మార్కులొందుటకు వేగమె రమ్మని రూమునందునన్
    తరుణుల జేర్చి కౌగిలిడ, తన్నుచు త్రోయుచు నేలమీదనా
    గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్

    రిప్లయితొలగించండి