16, సెప్టెంబర్ 2014, మంగళవారం

న్యస్తాక్షరి -5

అంశం- నగర జీవనము
ఛందస్సు- కందము
మొదటిపాదం మొదటి అక్షరం ‘న’, రెండవపాదం రెండవ అక్షరం ‘గ’, మూడవ పాదం మూడవ అక్షరం ‘ర’, నాల్గవ పాదం నాల్గవ అక్షరం ‘ము’.

37 కామెంట్‌లు:

  1. నగరంబున జీవనములు
    తగరపు మెరపులను బోలి ధగధగ పొలుచున్
    తెగ రగులును మది బాధల
    విగతము దరిచేరి గనగ భీతినిగొలుపున్

    రిప్లయితొలగించండి


  2. అక్కడ బ్లాగు లోకంలో
    మాకు కామెంట్లు రావటం లేదు బాబోయ్ అని బ్లాగర్లు
    వాపోతోంటే ఇక్కడ అయ్య వారు, న్యస్తాక్షరి అన్నా కూడా కామెంట్లు వరదలే వరదలు !!

    బ్లాగ్ సైకాలజిస్ట్లు ఈ ట్రెండ్ ని పరిశీలించి దీని వల్ల బెనిఫిట్ పొంద వచ్చు = ఒక మంచి థీసిస్ రాయ వచ్చు !!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    నగర జీవితము :

    01)
    _____________________________

    నగరపు జీవన మది యిల
    గగనపు పుష్పంబె జూడ ♦ కౌతుక మిడుటన్ !
    నగరమున కాసు లేనిదె
    సుగమముగా బ్రతుక లేము !♦ శోకమె మిగులున్ !
    _____________________________
    కౌతుకము = సంతోషము

    రిప్లయితొలగించండి
  4. నగరజీవనము :

    02)
    _____________________________

    నగుబాట్లపాలు బ్రతుకగు
    ధగధగమని మెఱయు గాని- తాలుల కిరవౌ
    నగరపు జీవిత మది యిల
    నగరముగా మిగులు నయ్య - యర్థపు లేమిన్ !
    _____________________________
    తాలు = మోసము
    అగరము = అమావాస్య

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    _/\_
    నా బ్లాగులో కామెంట్లు ఎన్ని ఎక్కువ వస్తే నాకు అంత పని ఎక్కువ. కామెంట్లు చదివి సంతోషించడమే కాదు, అవి పద్యరూపంలో ఉంటాయి కనుక వాటి బాగోగులు పరిశీలించి ఛందోవ్యాకరణ దోషాలేమైనా ఉంటే పేర్కొని సవరణలను సూచించడం నాలాంటి వృద్ధుడికి శ్రమయే!
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. నగములు, నదులును, గాలియు,
    జగడములను చిఱు నగవుల సరిజేయుటలున్
    నగరమునందని వెన్నడు
    తగరము వంటివి మెఱుగులె తక్క కనకమే?

    రిప్లయితొలగించండి
  8. మల్లెల వారి పూరణలు

    నగరము చేరరె యెల్లరు
    తగ సుఖముల కొఱకునౌచు, ధరలో ప్రకృతే
    వగరగ నుండగ, కృత్రిమ
    మగుగా! మురికగును గాలి, మంచిగి నీరున్

    నగరాలందున మేడలు
    తగ నిరుకుగ నుండి గాలి, ధాటిగ రాకన్
    పొగ రగిలెడు రీతినుడుకు
    ను గనన్, ముదమెంతొ వీడ నుక్కయు హెచ్చున్

    రిప్లయితొలగించండి
  9. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. నగరమున బ్రతుకు జూడగ
    సుగమముగా నుండు మిగుల సొమ్ములు యున్నన్
    దగరములొచ్చిన దీరును
    నగరము లో జీవనమ్మె నయముగ దోచున్ !

    రిప్లయితొలగించండి
  11. నగములఁ గనబోమిచ్చటఁ
    దగవులకొకలెక్క లేదు దౌష్ట్యము మించన్
    తగఁ రంజిల్లెడు మనుషులు
    నగరములోనుందురనుట నయవంచనయే.

    ( నగర ప్రేమికులు నన్ను మన్నించాలి ).


    రిప్లయితొలగించండి
  12. నగరమ్మున నాగరికత
    పగబూనిన పగలె హెచ్చి ప్రాణము దీయున్!
    పొగరన్నది వీడి మసల
    సుగమము జీవన మనంగ సుధలే కురియున్!

    రిప్లయితొలగించండి
  13. నగలను భూముల నమ్ముచు
    జగమే పురిలను గలదని సతము తలచుచున్
    నగరములకేగి మనుజులు
    గగనము నంటు ధరలఁగని క్రాలుటఁగనమే!

    రిప్లయితొలగించండి
  14. పూజ్యులు గుర్గుదేవులు శంకరయ్య గారికి వందనములు

    1.నగరపుజీవన మది యా
    జగడపు నేతలకు దొరలు సార్ధకులకునిం
    పుగరక్షణ సైన్యము కే
    యగారము కద యితరులకు నతి కష్టమ్మౌ
    2.నగవులు చిందెడి ప్రతిమర
    మొగమున పౌడర్లు సెంట్లుముడుసలియౌ యీ
    నగరపుతీరింతయె గన
    తగరము బంగార మౌన తళతళ మెరయన్

    రిప్లయితొలగించండి
  15. మిత్రులకు నమస్కృతులు.

    నగరమునఁ గృత్రిమత్వ
    మ్మగపడు నెటఁజూడఁ జనవు మానవబంధా
    లొగి రవరవలం గనఁ జా
    టుగఁ గుములుచు బయటికిఁ బొగడుదురయ మిగులన్!!

    రిప్లయితొలగించండి
  16. నగలమ్మియు పొలమమ్మియు
    తెగ సుఖముల ననుభవింప తేలిక యనుచున్
    నగరమునకు చేరి బ్రతుకు
    సుగమము కాదని యనుభవ సూక్ష్మము దెలిపెన్ !

    రిప్లయితొలగించండి
  17. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సొమ్ములు + ఉన్నన్’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ ‘సొమ్ములు గలుగన్’ అనండి.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో ‘రం’ వేశారు. న్యస్తాక్షరి నియమాలకు విరుద్ధమేమో? అలాగే ‘మనుషులు’ అనడం దోషమే. ‘మనిషి’ జనవ్యవహారంలో ఉన్నా వ్యాకరణ సమ్మతం కాదు. అక్కడ ‘తగ రసికులైన మనుజులు’ అనండి.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో ‘పగ’ పునరుక్తమయింది.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో ‘పురిలను’ అర్థం కాలేదు. ‘పురి + ఇలను’ అనుకుంటె సంధి లేదు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘సైన్యముకే యగారము’... అర్థం కాలేదు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  18. పూజ్యులు గుర్గుదేవులు శంకరయ్య గారికి వందనములు
    అగారము అనగా నివసించు ప్రదేశము,ఇల్లు
    సేన+అగారము=సేనాగారము
    చూడుడు జి.యెన్.రెడ్డిగారి పర్యాయపద నిఘంటువు
    2203 శ్రమయిస్తున్నందుకు మన్నించవలెను

    రిప్లయితొలగించండి
  19. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    (పరిశీలించ ప్రార్థన)
    నగరమ్మున నాగరికత
    పగబూనిన కక్ష లెగసి ప్రాణము దీయున్!
    పొగరన్నది వీడి మసల
    సుగమము జీవన మనంగ సుధలే కురియున్!

    రిప్లయితొలగించండి
  20. కె.ఈశ్వరప్పగారి పూరణ
    నగరమ్ముల జీవనమన
    అగచాట్లకె నిండియున్న ఆర్భాటముచే
    తగురక్షణలకరువరువు
    లగని ముఠా కోరులున్నలౌక్యుల గల్లా

    రిప్లయితొలగించండి
  21. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగుంది. వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
    *
    సహదేవుడు గారూ,
    సవరించిన మీ పద్యం బాగుంది. సంతోషం!

    రిప్లయితొలగించండి
  22. శ్రీగురుభ్యోనమ:

    నగుమోములు కృత్రిమమే
    పగలును రాత్రియును జూడ పనులే ప్రజకున్
    నగరపు జీవన సరళిని
    స్వగతమునన్ దలుప నదియు సాధారణమే

    రిప్లయితొలగించండి
  23. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. నగరపు జీవన మరయగ
    గగనమె మరి బడుగు జనుల కందరి కచట
    న్న గరము నందున నుండుట
    సుగమము కాదార్య !మనకు శోచింపంగాన్

    రిప్లయితొలగించండి
  25. నగరపు జీవన చిత్రము
    ప్రగతిని సూచించు చుండె పైకపు గతిలో
    నగరము చీల్చు చు యుండెను
    వగరము చే బాధ బెట్టి పల్లియ గుండెన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  26. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. రెండవ పాదాన్ని మార్చి పంపుచున్నాను. తమరి సూచనలను సవరణలను తెలియ జేయండి
    నగలను భూముల నమ్ముచు
    సుగములు కలుగుననితలచి సోలముతోడన్
    నగరములకేగి మనుజులు
    గగనము నంటు ధరలఁగని క్రాలుటఁగనమే!

    రిప్లయితొలగించండి
  27. కె.ఈశ్వరప్ప గారి పూరణ
    నగదీనగలుగ గనబడు
    సగభాగమె సంతసమ్ము సంపదలున్నా
    నగర రసికత గనగా
    సగటు మురిపెములతొ ముంచు సాంగత్యమునే

    రిప్లయితొలగించండి
  28. నగరము మురికికి చిహ్నము
    రగడకు నది మారు పేరు బ్రతుకులు కనగా
    నగరము నందున నరకము
    తగులము నగరమ్ము తోడ తప్పిన మేలౌ.

    రిప్లయితొలగించండి
  29. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ సవరణ బాగుంది. సంతోషం!
    *
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘నగదీ నగలుగ’ అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి
  30. గురువుగారికి వందనములు.

    తగు విధములైన సూచనలు చేసినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  31. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  32. నగలున్నను లేకున్నను
    పగలైనను తిరుగలేరు పడతులు , పగలన్
    తెగరగిలెడు ముష్కరులును
    కనలేముగ ' బాంబు ' లెఛట" కని " పెట్టెదరో !

    రిప్లయితొలగించండి
  33. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  34. నాగరాజు రవీందర్ గారి పద్యం మూడవ పాదం, గోలి హనుమఛ్చాస్త్రి గారిపద్యములో నాలుగవ పాదం లొ ప్రాస పరిశీలించ వలసిందిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  35. రెడ్డి గారూ ! దోషమును తెలిపినందులకు ధన్యవాదములు
    సవరణతో....


    నగలున్నను లేకున్నను
    పగలైనను తిరుగలేరు పడతులు , రోడ్లే
    తెగ రక్తము త్రాగుచుండు
    నగరములో బాంబులెచట నక్కునొ ప్రేలన్..

    రిప్లయితొలగించండి
  36. పూజ్యులు గుర్గుదేవులు శంకరయ్య గారికి వందనములు
    కె.ఈశ్వరప్ప గారి పూరణ
    సవరించిన పద్యము చిత్తగించండి
    నగిషీ నగలుగ గనబడు
    సగభాగమె సంతసమ్ము సంపదలున్నా
    నగర రసికత గనగా
    సగటు మురిపెములతొ ముంచు సాంగత్యమునే

    సెప్టెంబర్ 16, 2014 9:12 PM

    రిప్లయితొలగించండి