24, సెప్టెంబర్ 2014, బుధవారం

దత్తపది - 45 (తల)

కవిమిత్రులారా!
‘తల’ను నాలుగుపాదాలలో ఉపయోగిస్తూ
పూలతోటను వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. తలపగ నీతోట నుమఱి
    తలపునకుం వచ్చెనాకు తలిరుల బోడుల్
    తలచుకొని బూ లతోటను
    తలపులవల జిక్కు కుంద్రు దారలవోలెన్

    రిప్లయితొలగించండి
  2. చెలిమి చూలింత కోతల చేయి చేత ,
    చెలిమి బాలింత మాతల చేయిచేత ,
    చిట్టి చేతుల చేతల చిన్న బోయి
    వెతల బారిన పూదోట వెలసి పోయె
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  3. పూతల పూవుల తోటను
    భూతలమున పెంచుడయ్య పోయగ నీరున్
    రోతల దుస్థితి మాపును
    చేతల, తల సున్నితమగు చేష్టలు గలుగున్.

    రిప్లయితొలగించండి
  4. తల వాకిట నిలువంగా
    పొలుపుగ మాపూల తోట పూలతలన్నీ
    తలలూపుచు చేరబిలువ
    తలమున బోయంగ నీరు తరలితినటకే!

    రిప్లయితొలగించండి
  5. మల్లెల వారి పూరణలు

    నెలతల తలపుల యందున
    తలనెత్తెను కోర్కెలనగ, తావిని పూలే
    మొలిచెను. లతలను, చెట్లను
    పొలుపుగ తోటలు వెలుగనె భూతల మందున్

    తలపు నందున వలపును తట్టిలేపు
    తలపగా విరులవియతా ధరణి మొలిచి
    తలల నెత్తి వివిధ, మగు తావి, విరి,ల
    తలను, చెట్లను, ప్రాభాత తరుణ మందు

    తలల కొప్పట్లు గుబురుగా తరులు వెలుగ
    నెలత తలపట్లు, లతలవ్వి నెనరుగ సాగ
    కలత లన్నియు తొలగింప ఘనపు రుచుల
    నిలను తలపించు పోదోట లింపునగుచు

    ఇలపై తలపగ జాతులు
    పలుగతి పూవుల యటులను వేతల లెత్తున్
    తలకొక తావున వెలుగన్
    పులకించు తలప నిలయొక పూదోట యగున్

    తలపగ రంగుల వలయము
    కలిగించును మదికి నింపు- కైతల కవులే
    పలుగతి పఠితల కిడరే
    నిలతల లెత్తెడి కుసుమపు నేర్పులు తోటన్

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    పూ లతలకౌగిలిని జేర్చు పొదల గదులు
    కాంత లరసెడు మల్లెలు బంతి పూలు
    కతల దెల్పు గులాబీలు జతల కొరకు
    భూతలస్వర్గ మవదె యీ పూలతోట

    రిప్లయితొలగించండి
  7. పుణ్యవతులై సహస్రాధికముగ దేవలోకముజేరి దేవకాంతలుగా మారిన మనస్త్రీరత్నాలు మానవస్వభావన్నే చూపగ
    పునర్జన్మశాపగ్రస్తులైరి. తమ తలలు పవిత్రభావంతో నిండియుండీ శీఘ్రంగా జన్మముగిసి స్వర్గానికి
    తరలిరావచ్చేలా ఎదో ఉపాయన్ని కనిబెట్టవలెననుకోగా, అక్కడ నందనోద్యానాధికారియైన పుష్పకవి, జంధ్యాలపాపయ్యశాస్త్రిగారు, మీరు పూవ్వులుగాబుట్టవలిసిదిగా విమోచనాన్ని వేడుకొండి అని సలహాఇచ్చారు. ఈ పద్యం అప్పటిది !
    ........................
    సౌమ్య కాంతలఁ తలకెక్కె శాపమొకటి
    తలలె పువ్వులై బుట్టమని తలఁచివేడ
    పుట్టిరవతల జన్మాన భూతలమున
    లతలవిరులైరి తలనిక్కులంతమాయెన్
    ..........................

    రిప్లయితొలగించండి
  8. కే.ఈశ్వరప్ప గారి పూరణ
    దైవ పూజకు దండగా తలచు కొరకు
    వనిత లజ్జల తెలుపు గా వన్నెలన్న
    పూల తోటలు మమతల నేల గాయ
    వింత లక్ష్యాల నెంచెడి సంత గాదె

    రిప్లయితొలగించండి
  9. కవిమిత్రులకు నమస్సులు.

    వనితల తలఁపులఁ బొదలుచు
    ననల సువాసనలె తలల నర్తిత లతలై
    తనరు వనధృత లలితలనుఁ
    గనఁగా వెతలన్ని సమయు క్ష్మాతలమందున్!!

    రిప్లయితొలగించండి
  10. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తలపునకున్ వచ్చె’ అనండి. అక్కడ ద్రుతకార్యం జరగలేదు కనుక ద్రుతం అనుస్వారంగా మారదు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మూడవ పూరణలో ‘నెనరుగ సాగ’ అన్నచోట గణభంగం. ‘నెనరు గొనగ’ అందామా? ‘పూదోట’ టైపాటు వల్ల ‘పోదోట’ అయింది.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో ‘పుట్టమని’ అన్నచోట గణభంగం. ‘పుట్టగ’ అనండి. పద్యాంతంలో ‘ఆయెన్’ అన్నా గణదోషం. ‘ఆయె’ అంటే సరి!
    *
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    పూలతోట :

    01)
    _____________________________

    తలను పూలను బెట్టగా - ధరణి మీద
    తలచు చుందురు పురుషులు - తరుణులకును
    తలల సింగారమును బెంచు - నలరు లనిన
    తలలు పండిన వారికిన్ - వలపు గలుగు
    స్త్రీల వ్యామోహమును పెంచు - పూలతోట
    రంగు రంగుల పూలతో - పొంగిపొరల !
    _____________________________
    అలరు = పువ్వు
    పొంగిపొరలు = అధికమగు, మిక్కుటమగు.

    రిప్లయితొలగించండి
  12. సలలితముగ భూతలమున
    నెలతలకై పూలనిడగ నెగడెనుతోటల్
    తలదన్నును దివినియనుచు
    తలచెదనే శంకలేక తాదాత్మ్యముతో

    రిప్లయితొలగించండి
  13. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    (తల శబ్దాన్ని శిరస్సు అనే అర్థంలో పద్యంలో ఎక్కడా వినియోగించవద్దని చెప్పలనుకున్నాను. కాని మరిచిపోయాను. :-)

    రిప్లయితొలగించండి
  14. శ్రీగురుభ్యోనమ:

    రంగురంగుల సుమముల లతల తోడ
    భూతలమ్మున వెలసె నీ పూలతోట
    స్వర్గసీమను తలపించు వనమనంగ
    కవితలల్లెడి కవులకు కల్పవల్లి.

    రిప్లయితొలగించండి
  15. నాల్గు పాదాలలోనూ తలను పెట్టెసరికి నాకు తల తిరిగిపోయిందండీ గురువు గారూ............

    కలతల పారద్రోలగనఖండముగా విరబూసి యీ మహో
    త్పల సముదాయమానమగు భవ్యసుమవ్రజ దీప్తిమంత విం
    తల తలమానికంబగు సుధారస ధారల పుష్పమాలికల్
    వెలసిన పూలతోటలు సవిస్తరమై వెలసెన్ తలంపగన్.

    రిప్లయితొలగించండి
  16. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    విస్తృతావకాశం ఉన్న వృత్తాన్ని పూరణ కెన్నుకున్నాక కూడా తలతిరిగిపోయిందంటే ఎలా? మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని... రెండవ పాదంలో తల లేదండీ...

    రిప్లయితొలగించండి
  17. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మన్నించండి. పొరపాటు.
    నా జిమెయిల్‍కు వచ్చిన మీ పూరణను చదివి చాలా బాగున్నదని అనుకున్నాను కూడా. బ్లాగులో సమీక్షించినప్పుడు అది నా దృష్టికి రాలేదు.
    నిజానికి మీ పూరణ ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. క్షమించాలి గురువుగారూ, మీరన్నది నిజమే. కానీ ఈరోజు సఫలీకృతం కాలేక పోయాను.

    రిప్లయితొలగించండి

  19. పూలతోట :
    (తల శిరస్సు గాకుండా)

    02)
    _____________________________

    పాదతలమున పూవులే - పాడువడును !
    కరతలము సోక పువ్వులు - పరవశించు !
    కలతలను మాపు తావులన్ - గాలి నింపి !
    మెలతల మనసులను గెల్చు - నలరులిచ్చి !
    పూలతోటలె కుతలపు - పుష్కరములు !

    సుమలతల రంగు హంగులు - శోభగూర్చ
    అతల వితలాది పాతాళ - సుతలములను
    వనితలకు నిష్టమగు నట్టి - వాసతలము
    నెలతలదె ప్రియుల గలియ - నెలవు లయిన
    పూలతోటలె కుతలపు - పుష్కరములు !

    వెతల దీర్చగ శీతల - తతము నిడెడి
    నీత లతలకు నిలయమై - నెమ్మి గూర్చు
    వాత తోడుత లతల సు - వాసన లిడి
    లేత లతలెన్నొ జనతల - ప్రీతి బెంచు
    పూలతోటలె కుతలపు - పుష్కరములు !
    _____________________________
    తావి = పరిమళము
    తలము = ప్రదేశము
    కుతలపు పుష్కరములు = భూలోక స్వర్గములు
    నీత = పొందింపబడిన (కత్తిరింపబడిన)
    లేత = సుకుమారము

    రిప్లయితొలగించండి
  20. పుష్ప భరితమగు లతలఁ బూనియున్న
    పందిరుల క్రింద మెలతల వలపుఁ గొనుచు
    పూవనములోన తలకూడు మురిపములను
    తలచి నంత మదిచలించు తనివితోడ

    రిప్లయితొలగించండి
  21. విరులమరిన లతలల్లిన
    పరిమళముల పూల తోట వనితల కందన్
    తరియించెడు తలపులతో
    కరివరదున కిడగ మాల కలతల బాపున్!

    రిప్లయితొలగించండి