11, సెప్టెంబర్ 2014, గురువారం

సమస్యా పూరణం – 1516 (పార్వతి తనయుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పార్వతి తనయుండు పుష్పబాణునిఁ జంపెన్.

31 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    విద్యాధిపతి-గణపతి
    మన్మథహరుడు - శంభుడు :

    01)
    ________________________________

    సర్వులకు విద్య నిచ్చును
    పార్వతి తనయుండు; పుష్ప - బాణుని జంపెన్
    సర్వేశ్వరుడౌ శంభుడు
    గర్వంబున నేయ పుష్ప - కాండము దనపై !
    ________________________________

    రిప్లయితొలగించండి
  2. వసంత కిశోర్ గారూ,
    విరుపుతో చక్కని పూరణ నందించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. సర్వము నిండిన దేవుడు
    గర్వము లేనట్టి తానుకరిముఖు డెవరో?
    శర్వుడు జంపె నెవరినన
    పార్వతి తనయుండు ,పుష్పబాణుని జంపెన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  4. ఉర్వినిటీవల తనకొక
    పర్వము కనువిందుఁజేసె; పాపండెవరో?
    శర్వుడు చంపినదెవరిని?
    పార్వతి తనయుండు; పుష్పబాణునిఁ జంపెన్

    రిప్లయితొలగించండి
  5. పూర్వము మృచ్చకటికమున
    ఖర్వుడు శకటారుడొచ్చి కక్కగ నిటులే
    సర్వులు ఘోల్లనిరిది విని
    “పార్వతి తనయుండు పుష్పబాణునిఁ జంపెన్”

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సలు.

    శర్వాణియనఁగ నెవ్వరు?
    శర్వునకేమగునయా గజాస్యుండెలమిన్?
    శర్వుండెవ్వనిఁ జంపెన్?
    బార్వతి, తనయుండు, పుష్పబాణునిఁ జంపెన్!!

    రిప్లయితొలగించండి
  7. శ్రీగురుభ్యోనమ:

    గర్వము జూపక వ్యాసుడు
    పర్వంబులు జెప్పుచుండ వ్రాసినదెవరో ?
    శర్వుని కోపంబెట్టిది?
    పార్వతి తనయుండు, పుష్పబాణుని జంపెన్

    రిప్లయితొలగించండి
  8. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మనతెలుగు చంద్రశేఖర్ గారూ,
    శకారుడు విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    శకారుని ‘శకటారుడు’ అన్నారు. ఆ పాదాన్ని “ఖర్వుండు శకారుఁ డనెనుగద నిట్టులనే’ అందామా?
    *
    గుండు మధుసూదన్ గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. సర్వులు గొలిచే గణపతి
    పార్వతి తనయుడు,పుష్పబాణుని జంపెన్
    గర్వమున శల్య మొదిలిన
    శర్వరుని భసిత మొనర్చె సర్వేశ్వరుడె !

    రిప్లయితొలగించండి
  10. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఒదిలిన’ గ్రామ్యం. అక్కడ ‘గర్వమున శరము వదిలిన’ అనండి.

    రిప్లయితొలగించండి
  11. పూజ్యగురుదేవులకు ధన్యవాదములు. ..సవరణతో

    సర్వులు గొలిచే గణపతి
    పార్వతి తనయుడు, పుష్ప భాణుని జంపెన్
    గర్వమున శరము వదిలిన
    శర్వరుని భసిత మొనర్చె సర్వేశ్వరుడే. !

    రిప్లయితొలగించండి
  12. మల్లెల వారి పూరణలు

    ఉర్వర విష్ణుడె గణపతి
    పార్వతి శివులను కలుపగ బాణమునేయన్
    హర్వుగ, నాతని తలపక
    పార్వతి తనయుండు పుష్పబాణునిఁ జంపెన్

    పేర్వడె గణపతె శివుగా
    హర్వున శరముల మదనుడునాతని నేయన్
    తెర్వడె మూడవ కన్నును.
    పార్వతి తనయుండు పుష్పబాణునిఁ జంపెన్

    ఉర్వర తనయుడె తండ్రిని
    హర్వుగ శాస్త్రాలు తెలుప హరుడు గణపతౌ,
    గర్వపు మదనుని నణచగ
    పార్వతి తనయుండు పుష్పబాణునిఁ జంపెన్

    పార్వతి తనయుడు గణపతి.
    పార్వతి పెండ్లాడ కుండ పాపని గనెనా?
    ఉర్విని విడ్డూరంబే
    పార్వతి తనయుండు పుష్పబాణునిఁ జంపెన్

    రిప్లయితొలగించండి
  13. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    నిర్వర్తించెను తనవిది
    శర్వునిపై బాణమేసి స్కందుడు బుట్టన్
    దుర్విధి !,పుట్టకమునుపే
    పార్వతి తనయుండు పుష్ప బాణుని జంపెన్

    రిప్లయితొలగించండి
  15. కె.యెస్.గురుమూర్తి ఆచార్యగారి పూరణ
    సర్వావరోధపతియగు
    పార్వతి తనయు౦డు.పుష్పబాణుని జంపెన్
    శర్వుదు.మరి కాదు సుమా
    పార్వతి తనయుండు; పుష్పబాణుని జంపెన్

    రిప్లయితొలగించండి
  16. సర్వవిఘాత హరుండా
    పార్వతి తనయుండు, పుష్పబాణుని చంపెన్
    సర్వేస్వరుండు, శంభుడు
    పర్వత శిఖరంబుపైన, పార్వతి కనగన్

    రిప్లయితొలగించండి
  17. గురువుగారికి నమస్కారములు.

    క్రమాలంకారము.

    పర్వతపతి సుత యెవ్వరు
    సర్వేశునకును గణపతి సరియేమగునో
    శర్వుఁడు మూడవ కంటన్
    పార్వతి, తనయుండు, పుష్పబాణుని చంపెన్.

    రిప్లయితొలగించండి
  18. కే,ఈశ్వరప్ప గారి పూరణ
    పూర్వులను౦డియు దైవమె
    పార్వతి తనయుండు; పుష్పబాణుని జంపెన్
    గీర్వాణుడగుశివుండే
    సార్వజనీనం బిదియని శాస్త్రియు దెలిపెన్

    రిప్లయితొలగించండి
  19. మాస్టారూ, చక్కటి సవరణకు ధన్యవాదాలు.
    మా చిన్నప్పుడు పిట్టల దొరలని పగటి వేషగాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇట్లాగే మాట్లాడి నవ్వించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళున్నారో లేదో కూడా తెలియదు.

    రిప్లయితొలగించండి
  20. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కె.యస్.గురుమూర్తి ఆచార్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనల.

    రిప్లయితొలగించండి
  23. శర్వాణిఁ జూడ మోహిత
    శర్వుడు తప భంగమాయె శాపంబదియే
    నుర్విని పుట్టక మునుపే
    పార్వతి తనయుండు పుష్ప బాణుని జంపెన్!
    ( ఉదయంనుండి పోస్ట్ చేయలేక పోవడం వల్ల ఈ లోపు శ్రీ కెంబాయిగారి పూరణ
    వచ్చింది. )

    రిప్లయితొలగించండి
  24. ఆరయ గజ ముఖుడే మఱి
    పార్వతి తనయుండు, పుష్ప బాణుని జంపెన్
    శార్వరి నాధుడు శంభుడు
    మీరుట దనహద్దు కతన మిడిసిడి పాటన్

    రిప్లయితొలగించండి
  25. శర్వుడు నగజను కలవగ
    గర్వమ్మును త్రుంచి తారకాసురు గూల్చన్
    పర్వముగ బుట్ట భావిని
    పార్వతి తనయుండు, పుష్ప బాణుని జంపెన్.

    రిప్లయితొలగించండి

  26. పర్వున జని జనకునిపై
    గర్వము తో తూపు నేసె ఘాసి నయనుడున్
    పర్వును మాపెను, చెప్పెను
    పార్వతి తనయుండు, పుష్పబాణునిఁ జంపెన్

    రిప్లయితొలగించండి
  27. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    శాపంబదియేను + ఉర్విన్... అని మీ భావమా? శాపంబదియే + ఉర్విన్.. అంటె మాత్రం నుగాగమం రాదు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది కానీ, ఒకటవ, నాలుగవ పాదాలలో ప్రాస తప్పింది. సవరించండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. అన్వయము సరిగ కుదిరిందో లేదో తెలియదు. నేను చెప్పదలచు కున్నది, శివుని చూపుల తేజమే, కుమార స్వామి, అతని జననానికి కారకుడైన మన్మథుని ఆ చూపులే చంపినవి అని.

    సర్వ జగంబులు కోరగ
    కర్వరు మదమడచ, లోక కళ్యాణార్థ
    నిర్వర్ణనముల శివమే
    పార్వతి తనయుండు, పుష్ప బాణుని జంపెన్!

    రిప్లయితొలగించండి
  29. శర్వుని రాకను కనుగొని
    గర్వముతో నడ్డగించు ఘటికున కౌరా!
    ఇర్వురు సతులుండ నెచట
    పార్వతి తనయుండు పుష్పబాణునిఁ జంపెన్?

    రిప్లయితొలగించండి


  30. విష్ణువు చెల్లెలు పార్వతి తో తన తనయుని గురించి చెప్పినట్టు


    గర్వము నణచగ గనుమా
    పార్వతి, తనయుండు పుష్పబాణునిఁ జంపెన్,
    సర్వము తెలిసిన శివుడు, ని
    గర్విగ దాయాతడమ్మ గట్రాచూలీ!

    జిలేబి

    రిప్లయితొలగించండి