4, సెప్టెంబర్ 2014, గురువారం

పద్యరచన - 667 (తుపాకి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“తుపాకి”

10 కామెంట్‌లు:

  1. రక్షణకైనను దుష్టుల
    శిక్షణకైనను తుపాకి చేతన్ గొనుమా
    కక్షల సాధించంగ వి
    చక్షణ లేకుండ వాడ చతురత కాదోయ్

    రిప్లయితొలగించండి

  2. తుపాకి కి అయినా
    'టు' పాక్ కి ఐనా
    మా సమాధానం ఒక్కటే
    అహింసా పరమో ధర్మః !!


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. సూర్య నారాయణ గారూ బాగుంది..
    జిలేబి గారూ ... జిలేబి లాంటి మాట చెప్పారు.

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    _/\_

    రిప్లయితొలగించండి
  5. రక్షణ నిచ్చును జనులకు
    శిక్షించును ఖలుల నెల్ల శీఘ్రముగానే
    కక్షగ తుపాకి వాడగ
    దక్షకు సేమంబుగాదు దామోదరుడా!

    రిప్లయితొలగించండి
  6. కీడునుకలిగించు తుపాకి రూఢిగాను
    క్రూరమనుజుల కరములఁగూడినపుడు
    మేలు కలిగించు దృఢముగా నాహవముల
    శత్రువులను తేకువతోడ సంహరించ

    రిప్లయితొలగించండి
  7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో యతి తప్పింది. ‘మేలు కలిగించు దృఢముగా మేడెములను’ అవండి. (మేడెము = యుద్ధము)

    రిప్లయితొలగించండి
  8. పూజ్యగురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణకు ధన్యవాదాలు. ప్రాసయతితో " ఆలములను" అని టైపు చేయబోయి పొరపాటున "ఆహవముల" అని టైపుచేశాను.

    రిప్లయితొలగించండి