21, సెప్టెంబర్ 2014, ఆదివారం

సమస్యా పూరణం – 1521 (తల్లికి ముక్కు కోసి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తల్లికి ముక్కు కోసి పినతల్లికి ముక్కెర పెట్ట మేలగున్.
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  గత పాలకుల దుశ్చర్యలను గనిన - నదేగదా జరిగినది :

  01)
  _________________________________________

  గొల్లున కోట్ల మంది తమ - గోడును కీడును విప్పిచెప్పగా
  నల్లన రోడ్ల మీద బడ; - నన్నెము పున్నెము నెంచకుండగన్
  యుల్లము రంజిలన్ బిలచి - వ్యూహము జెప్పక; నేక పక్షమై
  చెళ్లున చీల్చివేయు టది - చీకటి మాటున దుర్భరంబుగన్
  "కొల్లగొనోట్లు సీట్ల నెడి - ఘోరపు యోచన " నెంచి జూడగన్
  "తల్లికి ముక్కు కోసి పిన - తల్లికి ముక్కెర పెట్ట మేలగున్ " !
  _________________________________________

  రిప్లయితొలగించండి
 2. వసంత మహోదయా! మంచి మాట మంచి ఊపులో చెప్పారు. బాగుంది.

  రిప్లయితొలగించండి
 3. వసంత కిశోర్ గారూ,
  చక్కని పూరణ చెప్పారు.అభినందనలు.
  ‘ఎంచకుండగన్ + ఉల్లము’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘ఎంచకుండ తా/ ముల్లము...’ అనండి.

  రిప్లయితొలగించండి
 4. కిశోజీ ! చక్కని అంశముతో ధాటిగా పూరించారు...అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. మల్లెల వారి పూరణలు

  ఉల్లము నందు తల్చుటది, యుత్తమ మెప్పుడు కాదు నెంచగా.
  "తల్లికి ముక్కుఁ గోసి, పిన తల్లికి ముక్కెర పెట్ట మెలగున్,
  పెల్లుగ దాన మిచ్చుటది పెద్దగ మేలగు ధర్మ" మంచు, వే
  చెల్లదు తన్ను మాలినది చేసిన,-పాపమ దౌను నెంచగా

  చెల్లదు భార్య బిడ్డలను, చిక్కుల పాలునుఁ జేసి, పుణ్యమే
  కొల్లగ వచ్చునంచు పరు, కోర్కెలుఁ దీర్చుట. ధర్మమౌనొకో?
  ఒల్లవు నట్టి చేష్టలిల, గొప్పను పొందగ తన్నుమాలి.- ఏ
  తల్లికి ముక్కు గోసి, పిన తల్లికి ముక్కెర పెట్ట మేలునౌ?

  రిప్లయితొలగించండి
 6. పల్లెలె భాగ్య సీమలవి భారత దేశము వెల్గునిండగన్
  కుళ్లి కృశించు రైతులకుఁ గూర్చెడు ద్రవ్య సహాయమెప్పుడున్
  కొల్లగ భాగ్యవంతులకుఁగూడెడు రాయితి కంటె మించ దే
  తల్లికి ముక్కుఁగోసి పినతల్లికి ముక్కెర పెట్ట మేలగున్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉల్లము పొంగదే కొడుకు యోగ్యుడు రాముడు రాజుగా యనన్!
   భల్లున తెల్లవారగనె పాతకి కైకకు లొంగు తండ్రికిన్
   జెల్లునె రామమూర్తినటు చేర్చగ కానల కంచు దెల్ప? నే
   తల్లికి ముక్కుఁగోసి పినతల్లికి ముక్కెర పెట్ట మేలగున్?

   తొలగించండి
 7. ఎల్లెడలాంధ్రదేశముననెండిన పంటలగాంచి నాయకుల్
  తల్లడిలంగఁజూతుముకదా మరి నేడు కుబుద్ధియుక్తులై
  పల్లపు రాష్ట్రభూములకు పారగజేసె నదీజలంబులన్
  తల్లికి ముక్కుఁ గోసి పినతల్లికిఁ ముక్కెరఁ బెట్ట మేలగున్ ??

  రిప్లయితొలగించండి
 8. పూజ్యులుగురు దేవులు శంకరయ్య గారికి వందనములు

  తల్లి స్తనమ్ము గ్రోలి యెద తన్నిన రీతి స్వదేశ ఖర్చుతో
  నెల్లలు దాటి ధీమణులు నేరుపు జూపి విదేశ వృద్ధికై
  యిల్లును వీడి యచ్చటనె నిబ్బడిలాభముపొందు వారికిన్
  "తల్లికి ముక్కు కోసి పిన - తల్లికి ముక్కెర పెట్ట మేలగున్ "

  సెప్టెంబర్

  రిప్లయితొలగించండి
 9. శ్రీగురుభ్యోనమ:

  నల్లనివాడవీవనుచు నాతి వచింపగ నాగ్రహించి యా
  యల్లరి చిన్నికృష్ణుడు భయమ్మును పొందక నిట్లు పల్కెనా
  "తల్లికి ముక్కు కోసి పినతల్లికి ముక్కర పెట్ట మేలగున్"
  గొల్లున నవ్విరా జనులు గొల్లలు గోపికలున్ గొనియాడి కృష్ణునిన్

  రిప్లయితొలగించండి
 10. మిత్రులందఱకు నమస్కారములు.

  ఉల్లమెలర్పఁగాఁ బరుల కోపిక నన్ని యమర్చి, యింటిలోఁ
  దల్లికి బువ్వఁ బెట్టకయ తప్పుడు కూఁతలు కూసి నిర్దయన్
  ద్రెళ్ళుచు విఱ్ఱవీఁగు కుమతిన్ దగఁ బెద్దలుఁ దిట్ట నెట్టు లా
  తల్లికి ముక్కు కోసి పినతల్లికి ముక్కర పెట్ట మేలగున్?

  రిప్లయితొలగించండి
 11. చెల్లునె రాష్ట్రసంపదలఁజేకొని యొక్క పురమ్ముకిచ్చుటే
  తల్లికి ముక్కుకోసి పినతల్లికి ముక్కెర పెట్ట మేలగున్?
  కల్లదనమ్ముతో సతము కల్మష మానసులైన నాయకుల్
  చల్లని మాటలన్ ప్రజల చక్కగ వంచనఁ జేయుచుండెడిన్

  రిప్లయితొలగించండి
 12. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  చివరిపాదంలో గణదోషం. ‘గొల్లలు’ తొలగిస్తే సరి!
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. కె.ఈశ్వరప్ప గారి పూరణ
  పిల్లలు మాతృభాష యనిప్రీతిని జూపగ నాన్న కోర్కెతో నల్లెడి యూహలందుకొని యందరి వోలెను యాంగ్ల భాషనే
  జెల్గగ జేయ బూనుటన చిత్రము గాదటె మాతృ భాషనే
  తల్లికి ముక్కుకోసి పిన-తల్లికి ముక్కెర పెట్ట మేలగున్ " !

  రిప్లయితొలగించండి
 14. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. మనతెలుగు చంద్రశేఖరులవారికి ధన్యవాదములు !
  శంకరార్యా ధన్యవాదములు !
  శాస్త్రీజీ ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 16. తల్లియె తెల్గుభాష పినతల్లియె చూడగ నాంగ్ల, మాంధ్రుడా !
  తల్లికి ముక్కు కోసి పిన తల్లికి ముక్కెర పెట్టినావుగా !
  చెల్లదు పుత్ర ! దోషమది - ముక్కుకు చక్కగ నుంచి చూడుమా
  తల్లికి - ముక్కు కోసి పిన తల్లికి - ముక్కెర పెట్ట మేలగున్.

  రిప్లయితొలగించండి
 17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  విరుపులతో చమత్కారాన్ని సాధించి మంచి పూరణ చేశారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. శాస్త్రీజీ ! పినతల్లి ముక్కే కోయమన్న మీ విరుపు - బహు చక్కనిది !

  రిప్లయితొలగించండి
 19. పైగా ముక్కుకు అనరాదుగా ముక్కునకు అనవలెను
  కావున

  శాస్త్రీజీ ! యిలా మారిస్తే !
  ---చెక్కిలి ముక్కును శోభనొందగా / తల్లికి

  రిప్లయితొలగించండి
 20. వసంత కిశోర్ గారూ,
  గోలి వారి పద్యంలో దోషాన్ని గుర్తించడమే కాక, చక్కని సవరణ సూచించినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 21. మాస్టరు గారూ !ధన్యవాదములు.
  కిశోర్జీ ! దోషమును చూపి చక్కని సవరణ సూచించిన మీకు ధనయవాదములు.
  నా సవరణతో..


  తల్లియె తెల్గుభాష పినతల్లియె చూడగ నాంగ్ల, మాంధ్రుడా !
  తల్లికి ముక్కు కోసి పిన తల్లికి ముక్కెర పెట్టినావుగా !
  చెల్లదు పుత్ర ! దోషమది - చేకొని యందము గల్గ జేయగా
  తల్లికి - ముక్కు కోసి పిన తల్లికి - ముక్కెర పెట్ట మేలగున్.

  రిప్లయితొలగించండి
 22. పిల్లలు పాపలున్ జడిసి పిన్నమ కొంపకు పారిపోవగా
  గొల్లున కేకలెట్టుచును గోడను దూకుచు కాళిమాత వోల్
  కల్లును త్రాగి కైపునను కత్తిని చేకొని నాట్యమాడెడిన్
  తల్లికి ముక్కు కోసి పినతల్లికి ముక్కెర పెట్ట మేలగున్

  రిప్లయితొలగించండి