8, సెప్టెంబర్ 2014, సోమవారం

నిషిద్ధాక్షరి - 8

కవర్గాక్షరము (క-ఖ-గ-ఘ-ఙ)లను ఉపయోగించకుండా
కైకేయి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

36 కామెంట్‌లు:

  1. మనమున యోచన శూన్యము
    వినెమంధరమాట తాను వేడెను వరముల్
    వనముల పంపన్ రాముని
    పెనిమిటి మృతి హేతువయ్యి విలవిలలాడెన్

    రిప్లయితొలగించండి
  2. రాముడనిన తానమితమౌ ప్రేమ జూపు
    విధి వశంబున వర్తించె వింత వోలె
    లోన యున్నవిధము వేఱు పైన వేఱు
    దశరధ తృతియ సతి రీతి తరచి చూడ!!

    రిప్లయితొలగించండి

  3. భరతు రాజును జేయ దా దలచెనేమొ
    మరియు మంధర మాట యేమార్చెనేమొ
    ధరను బారమ్ము దగ్గించ తట్టెనేమొ
    పంపె పినతల్లి రాముని వనముజేర.

    రిప్లయితొలగించండి
  4. ఈ పద్యానికి కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి శ్రీ రామాయణ కల్పవృక్షంలోని అద్భుతమైన కైక పాత్ర చిత్రణయే ప్రేరణ. అంతటి విశ్లేషణ ఇంకే చోటా చూడలేము. వారి కావ్యం వీలైనపుడు చదవమని కవిమిత్రులకు మనవి.
    రాజ రామావతార ప్రయోజనంబు
    మనసులోన దెలిసినట్టి మాతృ మూర్తి
    పేరు చెడినబో వరముల పేరనాతఁ
    దనుజ సంహార మొనరించ తరలజేసి
    తాచెడి పరహితమొనర్చు ధన్య జీవి!

    రిప్లయితొలగించండి
  5. కైకేయిని నిందించు లక్ష్మణునితో రాముని పలుకులు

    సాధువంశ సంజాతయౌ చల్లనమ్మ
    యెల్లవేళల ప్రేమల నిచ్చు తల్లి
    విధివిలాసమే యియ్యది,-- వేయునేల
    మాట లా,యాస పడనేల?--- మరువరాదు

    రిప్లయితొలగించండి
  6. మల్లెల వారి పూరణలు

    దురము నందున దశరధు తోడవెడలి
    వరము లింపున పొందెను. వాని వలన
    రాము వనముల తోలిన రాణి యామె
    మంచి దైనను మంథర మాట చెడెను

    ప్రేమ మీఱను పెంచిన ప్రియపు రాము
    నడవు లవేడలఁ జేసిన యట్టి యమ్మ
    దుష్ట బోధల విన్నట్టి దుర్బలయయి
    దశరధుని చిన్న రాణియై తాను పొదిలె

    రిప్లయితొలగించండి
  7. సుతుని రాజుని జేసెడి సూత్రమిదని
    దుష్ట మంధర మాటలు దూరచెవిని
    వరము నెపమున రాముని వనము జేర్చి
    దశరధుని చిన్న భార్య యె తల్లడిల్లె.!

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులు గురుదెవులు శంకరయ్య గారికి వందనములు

    వరముల పొందెను దశరథు
    భరతు౦డయ్యోద్యరాజ్య పాలన సేయన్
    సరి రాముడరణ్యమున నీ
    తరుణుల చిత్తమ్ముతెలియ తరమే! వశమే!!

    రిప్లయితొలగించండి
  9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    అగు ధాతువునకు క్త్వార్థకరూపం ‘అయి’. అయ్యి అనేది అయి అన్నదానికి వ్యావహారిక రూపం. ‘హేతు వగుచు’ అనండి.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    తరమే, వశమే అని అర్థపునరుక్తి అయినట్టుంది. అక్కడ ‘ధాతకు తరమే’ అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  11. రాముడు నవ్విన రంజిల్లు మనమున
    .......రాముడేడ్చిన వేళ బాము బడును
    రాము డాడుచు నుండ ప్రేమతో చూచును
    .......తడబడి పడిపోవ తల్లడిలును
    చందమామను జూపి సాధించ రాముడు
    .......నద్దములో దించి ముద్దు వెట్టు
    విలువిద్య వేళలో సులువుల బోధించి
    .......యొజ్జయై రాముని యొడిని జేర్చు

    దశరథుని చిన్నభార్య వాత్సల్య మిద్ది
    రాము డన్నను, సురుల ప్రార్థనల జేసి
    యతని నంపెను వనముల నతివ యెదను
    బాధ దహియింప సహియించి బన్నము పడి.

    రిప్లయితొలగించండి
  12. రామ వనవాసమున్ను భరతుని రాజ్య
    పట్టమహిషత్వమిమ్మని పట్టుబడెను
    తనదు ప్రియతమ భార్యదీ దౌష్ట్యమరసి
    ధరణిఁ బడిపోయెనంత నా దశరథుండు

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారూ,
    మంచి పద్యాన్ని అందించారు. అభినందనలు.
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. దశరథుని ముద్దు పత్ని తా దాశరథిని
    ప్రేమతోడను పెంచిన పిన్న తల్లి
    విధి వశమ్మున వరములన్ విశద పఱచి
    భర్త యాజ్ఞతో రాముని పంపెవనికి

    రిప్లయితొలగించండి
  15. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఇంతకు ముందే ‘ఈనాడు’ వారి ‘తెలుగు వెలుగు’ పత్రిక సంపాదకులు నాకొక మెయిల్ పెట్టారు. అది ఇది..
    సార్ నమస్కారం,
    మీ బ్లాగు గురించి తెలుగు వెలుగులో ఇవ్వాలనుకుంటున్నాం.
    శంకరాభరణం బ్లాగుని నిర్వహిస్తున్నారు కదా. ఎప్పుడు ప్రారంభించారు? ఇప్పటివరకు ఎంతమంది పద్యాలు రాయడం నేర్చుకున్నారు? మీ స్పందన తెలుపగలరు.
    మీ దృష్టిలో పద్యాలు నేర్పే బ్లాగులు, వెబ్సైట్లు వుంటే వివరాలు పంపగలరు.
    ధన్యవాదాలు.
    - గణేష్ బెహరా
    తెలుగు వెలుగు
    80085 51843

    బ్లాగును గురించిన వివరాలు నాకంటే మీరే ఎక్కువగా ఇవ్వగలరని నా నమ్మకం. అందువల్ల బ్లాగు గురించి పైన వారడిగిన వివరాలను ఎవరికి వారు నాకు పంపిస్తే వాటిని క్రోడీకరించి ఆ పత్రికకు పంపిస్తాను. దయచేసి నా మెయిల్ కు పంపండి.
    shankarkandi@gmail.com

    రిప్లయితొలగించండి
  17. పూజ్యులు గురుదెవులు శంకరయ్య గారికి వందనములు
    మీసవరణశిరోధార్యము,కానీ "ధాతకు"అన్నమాటలో
    "క"వర్గాముకూడదు కదా

    రిప్లయితొలగించండి
  18. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    నిజమే సుమా! మరిచేపోయాను. మన్నించండి.
    “ధాత తరమ్మే?” అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  19. గురువుగారికి శుభాభినందనలు. నిత్యం వాణీ యుపా సనను చేసే శంకరభరణమునకు గుర్తింపు అంటే వాగ్దేవికి సన్మానం చెయ్యడమే.

    రిప్లయితొలగించండి

  20. ఆ|వె|
    మంచి మనసు లోన మాత్సర్య మెట్లుండు
    వంచనయదె విధివిపంచి నుడువ
    ప్రాణతుల్యమైన రాముని వనవాస
    పాతృజేయఁ స్వార్థి భరతమాత

    కం||
    సతియన నతిమోహమొ తన
    తృతీయతో వరములిడుట ధశరథవిదియై
    జతజేరెనదే త్రేతా
    న్విత దానవ నాశనమున హితపోషణమై

    ముత్యాలసరము||
    ఎంత దూషించినను భరతుడు
    స్వాంత పశ్చాత్తాప దగ్ధ, వ
    నాంతమున రాఘవుని వేడెను
    యింతి వరమాతృ

    తే|గీ|
    వినెను మంథర దుర్బోధవేరులూర
    రగుల రాజ్యాశ మరణించె రాముమమత
    భరతుడేవమునదిట్టి దుర్భాషలాడ
    భారమై మనసు, మారింది భరతుదల్లి

    శా|వి
    ఇదెరా తథ్యము రాజ్యమేల సుతుడున్ శ్రీరామువన్యాంకమున్
    హృదయాంతర్ధ్వని సత్యమై భరతుడెలెన్ సర్వ సామ్రాజ్యమున్
    పదునై ముచ్చెయె రాజుడా? భరతుడా? భావంబదెట్లుండునో
    చదుపెన్ శాంతిని, మాతృవన్నవరముల్ జాళించె సత్యంబునన్

    రిప్లయితొలగించండి
  21. కె.ఎస్.గురుమూర్తి ఆచార్య గారి పూరణ

    రాముడి౦ట నుండి రావణు డిటు తట్టు
    ననుచు వ్యధను జెందు యమరుల గని
    అభయమొసగి రాము నడవికి బంపిన
    దూరనేల నామె దోషి యనుచు

    రిప్లయితొలగించండి
  22. కె.ఈశ్వరప్ప గారి పూరణ
    భరతుని తల్లి,మంధర యుపాయము నందున వెళ్ల భర్తయే
    మరణము పొందుటాయెపరమార్ధము దీర్చనుదానవత్వమున్
    చెరిపెడి రామతత్వమునుచేర్చిన సారధి ధైర్యశాలి యౌ
    తరుణి చె రామనామ మిల ధన్యత నొందెను వింత పంతమున్

    రిప్లయితొలగించండి

  23. పూజ్యులు గురుదెవులు శంకరయ్య గారికి వందనములు
    ధాత తరమ్మే?” అంటే ఎలా ఉంటుంది?
    మహాభాగా!బాగున్న్దది

    రిప్లయితొలగించండి
  24. మిత్రులు కంది శంకరయ్యగారికి శుభాభినందనలు! సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు.

    ||సీ||
    శంబరాసురునితో సమరమ్ముఁ జేయుచోఁ
    ......బతితోడఁ జని, సాయపడిన పడతి;
    భర్త వరములీయ, "వలయుచో వేడెద"
    ......నంచు వారించినయట్టి సాధ్వి;
    పుత్రేష్టి పాయసమ్మునఁ బాలుపంచియు,
    ......సవతిని మన్నించు సమరసవతి;
    మంథరాబోధిత మాయాప్రచోదయౌ
    ......పతిమృతిపూర్వ సత్స్వార్థవనిత;
    ||గీ||
    రాముఁ డారామమునఁ దన రామతోడ,
    సోదరునితోడ నివసింప నాదరమున
    మఱలి, పరిపాలనము సేయు మనుచు వేడు
    దశరథుని పత్ని, భరతుని తల్లి యామె!!

    రిప్లయితొలగించండి
  25. భరతుడు :

    మూడవ భార్యవై, విభుని ముద్దుల భార్యవునై, రణంబునన్
    తోడయి పోరు వేళ మది దోచి, వరంబుల నొంది తీవు! ఆ
    పాడు వరంబులే యతని ప్రాణములన్ హరియించె - మాతరో!
    వాడనిచో మనీష ఋజు వర్తనమై, వర మౌను శాపమే!

    రిప్లయితొలగించండి
  26. మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
    ఛందోవైవిధ్యంతో మీరు వ్రాసిన పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటగా టైపాట్లు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. కొండొకచో అన్యయక్లేశం కూడా కనిపించింది. ముత్యాలసరములో ‘దగ్ధ’ అనీ, తేటగీతిలో ‘రగుల’ అనీ, శార్ధూలంలో ‘వన్యాంక’మనీ కవర్గాక్షరాలను ప్రయోగించారు.
    *
    కె.యస్. గురుమూర్తి ఆచార్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తరుణుచె’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    చాలా మంచి పద్యాన్ని అందించారు. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. గుండు మధుసూదన్ గారు!

    అన్ని పద్యాలను రాశి వోసి గుట్టలా పేరిస్తే, దానిపై శిఖరాగ్ర పతాకలా మీ సీస పద్యం ఎగురుతున్నది. మీకు నా హృదయ పూర్వక శుభాభినందనలు!

    రిప్లయితొలగించండి
  28. మన్మిత్రులు డా.ఆచార్య ఫణీంద్రగారికి నమస్కారములు. నా పద్యము మీ మెప్పులనందినందుల కెంతయుఁ గృతజ్ఞుఁడను. ధన్యోఽస్మి!

    రిప్లయితొలగించండి
  29. శ్రీ శంకరయ్యగారు,

    ధన్యవాదాలు.ప్రయాణంలో ఉంటూ కొంచం, ఒత్తిడిగాఉండి, టైపాటులూ కవర్గాక్షరములూ దొర్లాయి. రెండవసారి చదవలేక పోస్ట్ చేసాను.మన్నించాలి.

    రిప్లయితొలగించండి
  30. భరతుడె రాజని దశరధు
    వరమీమని సతి వచించె భారతి పూనన్
    ధరణీపతివనములలో
    పరిమార్చన్ దనుజ తతిని భారము వీడన్

    రిప్లయితొలగించండి
  31. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. శ్రీగురుభ్యోనమ:

    రాముడు జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు
    భామా,యనె భరత జనని, భయమున దెల్పె
    న్నామంధర,విని తడబడె
    యేమందుము, విధి బలీయమేనాడైనన్

    రిప్లయితొలగించండి
  33. నాపూరణలో చివర "వనికి" అని వ్రాశాను అది " వనము" అని మార్చాను
    దశరథుని ముద్దు పత్ని తా దాశరథిని
    ప్రేమతోడను పెంచిన పిన్న తల్లి
    విధి వశమ్మున వరములన్ విశద పఱచి
    భర్త యాజ్ఞతో రాముని పంపె వనము

    రిప్లయితొలగించండి