27, సెప్టెంబర్ 2014, శనివారం

సమస్యా పూరణం – 1524 (వెంటఁబడి చంపువాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వెంటఁబడి చంపువాఁడె పో ప్రియసఖుండు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

40 కామెంట్‌లు:

 1. పరమ రాక్షసు డౌ గద భరణి యందు
  వెంట బడి చంపు వాడె పో, ప్రియస ఖుండు
  కష్ట కాలము లందున కనిక రించి
  యాదు కొనునుని జముగ దా నాప్తు డగుచు

  రిప్లయితొలగించండి
 2. ఒంటిగ నిశిరాత్రి సమయమింటిలోన
  కనులు మూసిన తెరచిన కానిపించి
  తుంటరి పనుల సలుపుచు కొంటె కలల
  వెంటఁబడి చంపువాఁడె పో ప్రియసఖుండు

  రిప్లయితొలగించండి
 3. మసియేమొ బుగ్గపై మగువ! జూసెద నీదు
  *****చెక్కిలి చెంతకు చేరనిమ్ము
  రుచి జూచుటందు గురువును నేనిట నీదు
  *****పెదవి రుచికి పేరు పెట్టనిమ్ము
  మిక్కిలి ఘనుడను లెక్కలందున, నీదు
  *****కౌను కొలతలను కాననిమ్ము
  చీకటి యన నాకు చిఱుభయంబగు నీదు
  *****కౌగిలింతలలోన దాగనిమ్ము

  మనకు వెడబాటు వలదిక మధురవదన!
  కలసి యుండుము ననుగూడి కలలరాణి!
  యనుచు నన్నివేళలలోన నలుపు లేక
  వెంటఁబడి చంపువాఁడె పో ప్రియసఖుండు!!

  రిప్లయితొలగించండి
 4. కౌగిలింతల జూతుమో కఱకుదనము
  ముద్దుమురిపెమ్ములందున మోటుదనము
  నిన్ను విడలేననుచుజెప్పు చిన్నతనము
  వెంటబడి జంపువాడె పో ప్రియసఖుండు.

  రిప్లయితొలగించండి
 5. నన్ను ప్రేమించు మీనాడె నలిన వదన!
  నీకు జూపింతు స్వర్గమ్ము నిశ్చయముగ
  లేక మరణింతు నిదెనాదు లేఖయనుచు
  ఆమ్ల వర్షాన బెదరించు హంతయౌచు
  వెంటబడి చంపువాడె పో ప్రియసఖుండు!!

  రిప్లయితొలగించండి
 6. కలికి మోమది పూవని కందునట్లు
  తేటి వ్రాలుచు రెక్కల మీటగాను
  భయము జెంద జలజముఖి, పట్టి తేటి
  వెంటబడి జంపువాడె పో ప్రియసఖుండు.

  రిప్లయితొలగించండి
 7. మిత్రులందఱకు నమస్కృతులు.

  సుబ్బారావుగారూ, మీ పూరణము బాగున్నది. అభినందనలు. ఇందు "ధరణి" యనునది "భరణి"గా టైపాటు దొరలినది కాఁబోలు!
  *
  చంద్రమౌళి సూర్యనారాయణగారూ, మీ పూరణ మద్భుతముగనున్నది. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణగారూ, మీ సీసపద్యమునఁ బ్రాబంధికమైన పోఁకడలు కన్పట్టుచున్నవి. ప్రియసఖుని చేష్టలను శ్లాఘనీయముగ వర్ణించినారు. అభినందనలు.

  మఱియొక విషయము...తమరు పద్యాంతమందలి సమస్యా పాదమును ప్రత్యేకముగఁ గానుపింపఁజేసిన వైనము నాకొకింతఁ గుతూహలముం గలిగించుచున్నది. వ్యాఖ్యలం దట్లు నెటుల చేయవచ్చునో యట్టి కిటుకుం దెలుపఁగలరు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రిగారూ, మీ పూరణము బాగున్నది. అభినందనలు.
  *
  రెండు చింతల రామకృష్ణమూర్తిగారూ, మీ పూరణము నేఁటి నరమృగాల చేఁతలఁ బ్రకటించుచున్నది. ప్రశస్తముగనున్నది. అభినందనలు. కాని, ఆ మృగ తుల్యుఁడు ప్రియసఖుండెటుల కాఁగలఁడా యని నా సందేహము.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రిగారూ, తేఁటి వలని భయముం బోగొట్టు ప్రియసఖునిఁ గూర్చిన మీ పూరణము ప్రశంసాపాత్రము. అభినందనలు.
  *
  స్వస్తి

  రిప్లయితొలగించండి
 8. ప్రేమపేరుతోడ సతము వేడుకొనుచు
  కల్మషములేని మదితోడ కరము భక్తి
  వెంటబడి చంపువాడె పో ప్రియసఖుండు
  వానిప్రేమను బొందిన పడతి ధన్య

  రిప్లయితొలగించండి
 9. అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారూ, మీ పూరణమందు నిష్కల్మష హృదయముతో వెంబడించు ప్రియసఖుని ప్రేమనుఁ బొందిన పడతిని ధన్య యనుట బాగున్నది. అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. గుండు మధుసూదన్ గారికి - గురువుగారి బాధ్యతలను మీబోటి పెద్దలు (కవిత్వంలో)పంచు కోవటం ముదావహం. మీ సవరణలకు సలహాలకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 11. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న అకస్మాత్తుగా మా అక్కయ్య వాళ్ళ ఊరు వెళ్ళి ఇప్పడే తిరిగివచ్చాను. అందువల్ల నిన్నంతా బ్లాగుకు అందుబాటులో లేను. మన్నించండి.
  నిన్నటినుండి సమస్యాపూరణలు, పద్యాలు రచించిన మిత్రులందరికీ అభినందనలు.
  నా విన్నపాన్ని మన్నించి నిన్నటి నుండి ఇప్పటిదాకా పూరణలను, పద్యాలను సమీక్షిస్తూ, చక్కని సవరణలను, సూచనలను ఇచ్చిన మిత్రులు గుండు మధుసూదన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 12. మల్లెల వారి పూరణలు

  మంచి వాడౌచు విద్దెల మానకుండ
  తాను శ్రమియించి, మనలను ధర్మగతిని,
  సరిగ శ్రమియింపఁ జేయంగ సాధురీతి
  వెంటఁబడి, చంపువాడె పో? ప్రియసఖుండు

  సత్య, శౌచాల, ధర్మాల చటుల గతిని
  మనల నడుపుచు శ్రమఁజేయు మాన్యమతియు,
  మనుజులందున గొప్పగా మనగ, మనను
  వెంటఁబడి చంపువాడె పో ప్రియసఖుండు

  తనకు నుద్యోగ మబ్బుటే ధన్యమనక,
  మనకు కూడను జీవన మందు భృతిని
  కలుగ, మనలను త్రోయుచు, కలుగు దనుక
  వెంటబడి చంపువాడె పో ప్రియసఖుండు

  కీడు చేయక, నెయ్యాన కేవలంబు
  మేలుఁగావింపఁజూచుచు, మెలగు వాడు,
  కీడు నీకును కలిగించు, పాడు జనుల
  వెంటబడి చంపువాడె పో ప్రియసఖుండు

  తనదు లాభంబు కొంతయు తానువీడి,
  మనకు లాభంబు కలిగించు మంచివాడు,
  పాటు పడుచును, మేలైన పనులుఁ జేయ,
  వెంటబడి చంపువాడె పో ప్రియసఖుండు

  రిప్లయితొలగించండి
 13. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు తుంటరులగుంపు పాలైన తోయజాక్షి
  కంట కన్నీరొలుకగను గావు మనుచు
  క్రందు చుండంగ, చిత్రమ్ము కాముకులను
  వెంటబడి చంపు వాడెపో ప్రియ సఖుండు

  రిప్లయితొలగించండి
 14. మధుసూదన్ గారికి ధన్యవాదములు.
  అక్షరములను BOLDగా చేయుటకు HTML టాగ్‌లను మీరు ఉపయోగించవచ్చు.
  "<"B">" tag BOLD చేయుటకు ఉపయోగ పడుతుంది
  ఉదాహరణకు 'మధుసూదన్' అనే పదమును BOLD చెయ్యాలనుకుంటే, ఈ క్రింది విథముగ TYPE చెయ్య వలెను
  "<"B">"మధుసూదన్"<'/ "B">"
  గమనిక;- కొటేషన్షును తొలగించ వలెను
  అనగా ఎక్కడ నుండి BOLD మొదలవ్వాలో అక్కడ ""
  ఎక్కడకి ముగియాలో అక్కడ "" ఇవ్వాలి.
  ఇదేవిథముగా i ని Italic కొరకు వాడవచ్చు.

  రిప్లయితొలగించండి
 15. అనగా ఎక్కడ నుండి BOLD మొదలవ్వాలో అక్కడ "<"B">"
  ఎక్కడకి ముగియాలో అక్కడ "<" /"B>" ఇవ్వాలి.
  ఇదేవిథముగా i ని Italic కొరకు వాడవచ్చు.

  రిప్లయితొలగించండి
 16. కీచకా యేల నన్నిట్లు కిన్చపరుచ
  జూచెదవు నీవు? ప్రేమించి చోద్యమౌను
  వెంటఁబడి చంపువాఁడె పో ప్రియసఖుండు?
  దారి నిమ్ము కాకుండగ తగినశాస్తి.

  రిప్లయితొలగించండి
 17. నేనడిగిన కిటుకునుఁ దెలిపినందులకు ధన్యవాదములు సత్యనారాయణగారూ.

  రిప్లయితొలగించండి
 18. కె యెస్ గురుమూర్తి ఆచారి గారిపూరణ
  వలపు వలపన్నియువతిని పట్టుకొనుచు
  బాహు బంధాన బంధించు వాడు ప్రియుడు
  మన్మధ శరాల సంధించి మసలనీక
  వెంటఁబడి చంపువాఁడె పో ప్రియసఖుండు

  రిప్లయితొలగించండి
 19. కె.ఈశ్వరప్ప గారి పూరణ
  పూలునవ్వంగ మేనంత పులకరింఛ
  చందమామిడువెన్నెల కుంద జేయ
  కన్నె వయసున వలపులు కలుగ గానె
  వెంటఁబడి చంపువాఁడె పో ప్రియసఖుండు
  2.ఆశలజ్ఞానిగా మార్చ న౦తరమ్ము
  ఆత్మ,పరమాత్మ,లేదని యనుట కద్దు
  యట్టి నమ్మక మెందున్న గట్టిగాను
  వెంటఁబడి చంపువాఁడె పో ప్రియసఖుం

  రిప్లయితొలగించండి
 20. మనుజరూపాన మసలెడి దనుజుడౌను
  వెంటబడి చంపువాడె పో, ప్రియసఖుండు
  యన్నివేళల తోడౌచు నహరహమ్ము
  సంతసమ్ము ను గలిగించు సఖియ మందికి!

  రిప్లయితొలగించండి
 21. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీరు తెలిపిన "<"B">"కిటుకు"<"/"B>" బాగున్నది. ధన్యవాదాలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నవి. అభినందనలు.
  *
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ప్రియసఖుండు నన్నివేళల..’ అనండి.

  రిప్లయితొలగించండి
 22. జిగురు వారూ,
  మీరు చెప్పిన కిటుకు పనిచేయలేదు... నేనేమైనా పొరపాటు చేశానా? కాస్త వివరించండి.

  రిప్లయితొలగించండి
 23. శ్రీగురుభ్యోనమ:

  ఎవడు ప్రేమికు డెవ్వడు హితుడు జూడ!
  పంచజేరుచు వంచించు వాడతండు
  వెంటబడి చంపువాడె పో, ప్రియసఖుండు
  కాడు, కపటి మదాంధుడు ఖలుడు కాడె.

  రిప్లయితొలగించండి
 24. మధుసూధన్ గారికి నమస్తే
  ఆమె అంగీకరించలేదు, వికటించిన ప్రేమికుడు అంతకంటే ఏం చేయగలడు!!

  రిప్లయితొలగించండి
 25. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  ఈ రోజుల్లో అంతే మరి
  వదిలించు కోవాలంటే ఖర్చవుతుంది
  పెళ్ళి చేసుకుంటే యిష్టుడౌతాడు :

  01)
  _______________________________

  తుంటరి పనుల జేయుచు - వెంటబడుచు
  నింట బయట వేధించుచు - కంటకముగ
  కంట నీరు వెల్వడినను - జంట గూడ
  వెంటఁబడి చంపువాఁడె పో - ప్రియసఖుండు !
  _______________________________
  ప్రియ సఖుడు = ఖరీదైన సఖుడు లేక యిష్ట సఖుడు
  చంపు = చంపు లేక (విపరీతముగ విసిగించేవాడు)

  రిప్లయితొలగించండి
 26. గురువుగారు,
  నేనిచ్చిన కోడులోని Quotationsని Ignore చెయ్యండి
  వరసగా చెప్పాలంటే
  1. < గుర్తు
  2. B
  3. > గుర్తు
  4. మనకు BOLD గా కనపడవలసిన వాక్యము
  5. మరల < గుర్తు
  6. / గుర్తు
  7. B
  8. > గుర్తు

  రిప్లయితొలగించండి
 27. మాస్టరుగారికి, చక్కని వ్యాఖ్యానము చేసిన మధుసూదన్ గారికి ధన్యవాదములు.
  " బోల్డు " కిటుకులు చెప్పిన జిగురు వారికి ధన్యవాదములు
  ( అయ్యా నేను లేఖిని లో ప్రయత్నించాను...రాలేదు..ఆ కిటుకు ఎందులో అయితే చిటుకు మంటుంది. )

  రిప్లయితొలగించండి
 28. హనుమచ్ఛాస్త్రి గారు,
  మొదట లేఖినిలో మములుగా TYPE చేసుకొనండి.
  ఆ తరువాత Comment Boxలో paste చేసి ప్రివ్యు Button నొక్కే ముందు, ఈ Codesని ఇరికించండి.

  రిప్లయితొలగించండి
 29. బోల్డు కిటుకులు చెప్పిన జిగురు వారికి ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 30. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  ధన్యవాదాలు

  రిప్లయితొలగించండి
 31. జిగురు సత్యనారాయణ గారూ మీ కిటుకు చాలా బాగుంది ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 32. బోల్డు కిటుకులు తెలియజేసిన శ్రీ జిగురు సత్యనారాయణగారికి, తెలుసుకునేందుకు అవకాశం కలిగించిన /శ్రీ మధుసూధన్ గారికి మరియు గురువుగారికి ధన్యవాదములు .

  రిప్లయితొలగించండి
 33. మిత్రులకు నమస్కారములు,

  మిత్రులు జిగురు సత్యనారాయణగారికి ప్రత్యేక ధన్యవాదములు.

  పనుల యొత్తిడిచే నేను నిన్న బ్లాగును చూచుట వీలుపడలేదు. జిగురువారి కిటుకును మిత్రులందఱు నాచరించిచూచి యవగతముఁ జేసికొనుట నాకు సంతోషమునుం గూర్చినది. స్వస్తి.
  భవదీయుఁడు
  గుండు మధుసూదన్

  రిప్లయితొలగించండి
 34. బయట కేగిన వీడక పలుకు లాడి
  కళ్లు తెరచిన కొంటెగా కలియ జూచి
  కళ్లు మూసిన వేళలో కలలఁ జేరి
  వెంటఁ బడిచంపు వాడెపో ప్రియసఖుండు!

  రిప్లయితొలగించండి
 35. At Delite Cleaning Services We care about the needs of our clients and endeavour to meet their needs with excellence. Excellent at cleaning and maintaining great relationships with our clients.

  రిప్లయితొలగించండి