నలుపన్నది లేనియెడల తెలుపును గుర్తించలేము తెలియుమునరుడా యలుసుగ జూడకు నలుపేసులువుగ ఖరకిరణములను శోషింౘునిలన్ నలుపని చులకన కూడదు వలువలు దోచి లలనలకు వలపులు మదిలో కలిగించినట్టి కృష్ణుడు మిలమిల లాడెడు నలుపని మీకుతెలియదే
నల్లని మేఘము జూడగనల్లన నామనసు పొంగె హర్షముగలుగన్వెల్లువ వలెవ ర్షము మరిచల్లగ బడుననుచు నిపుడు చారలు తోడన్
నలుపు రంగును నందురు నాణ్య మనియునలుపు వర్ణము గలవాడు నల్ల నయ్యవర్ష మిచ్చె డు మేఘాలు వరుస నలుపునలుపు రంగును సాటిది యిలను లేదు
కాకి నలుపు కాదె? చీకటి తెలుపొకో? బొగ్గు నలుపు కాదె? సిగ్గు మాలి దోచి దాచి నట్టి దుడ్డు నల్పే గదా! జుత్తు తెల్ల బడిన శోక మేల?
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.*సుబ్బారావు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.‘రంగుకు సాటిది’టైపాటు వల్ల ‘రంగును..’ అయినట్టుంది.*మిస్సన్న గారూ,‘దాచిన దుడ్డు నలుపు’ అన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.‘జుత్తు నలుపుఁ జేయ శోభ హెచ్చు’ ననుకునేవాళ్ళుకు మంచి చురక అంటించారు. బాగుంది.
గురువుగారికి ధన్యవాదాలు.
నల్లని వానిని కృష్ణునియెల్లరు ప్రేమించుచుంద్ర,దేమొకొ భువిలోనొల్లరు నల్లని మనుజులనల్లరి చేయుదురు వింతయౌనిదిగాదే?
నలుపు న విశ్వము నుండెన్నలుపు నెగద జనన మరణ నటనలు జరుగున్!నలుపున జనియించు వెలుగునలుపుని బొగడంగ తరమె? నలుసుని గానా!
లక్ష్మీదేవి గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.*శైలజ గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నవ్వుముఖముండి, సన్నని నడుము గల్గునల్లనమ్మను కోరరు యుల్లమందుయెత్తుపళ్ళున్న యెఱుపైన యేడ్పుగొట్టునైన చేపట్టు చుండిరి యర్థితోడ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.పద్యం యడాగమాలన్నీ రాకూడనివే... మీ పద్యానికి నా సవరణ....నవ్వుమొగ ముండి, సన్నని నడుము గల్గునల్లనమ్మను కోరరె యుల్లమందునెత్తుపళ్ళున్న నెఱుపైన నేడ్పుగొట్టునైన చేపట్టు చుండిరి యర్థితోడ
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణలకు ధన్యవాదములు.
నీరిచ్చు మేఘము నలుపు!తారా జాబిలి మెరిసెడు తామసి నలుపే!తీరైనది నలుపేననిచేరెను తలపైకి నలుపు శిరములు మెరయన్!
నలుపన్నది లేనియెడల
రిప్లయితొలగించండితెలుపును గుర్తించలేము తెలియుమునరుడా
యలుసుగ జూడకు నలుపే
సులువుగ ఖరకిరణములను శోషింౘునిలన్
నలుపని చులకన కూడదు
వలువలు దోచి లలనలకు వలపులు మదిలో
కలిగించినట్టి కృష్ణుడు
మిలమిల లాడెడు నలుపని మీకుతెలియదే
నల్లని మేఘము జూడగ
రిప్లయితొలగించండినల్లన నామనసు పొంగె హర్షముగలుగన్
వెల్లువ వలెవ ర్షము మరి
చల్లగ బడుననుచు నిపుడు చారలు తోడన్
నలుపు రంగును నందురు నాణ్య మనియు
రిప్లయితొలగించండినలుపు వర్ణము గలవాడు నల్ల నయ్య
వర్ష మిచ్చె డు మేఘాలు వరుస నలుపు
నలుపు రంగును సాటిది యిలను లేదు
కాకి నలుపు కాదె? చీకటి తెలుపొకో?
రిప్లయితొలగించండిబొగ్గు నలుపు కాదె? సిగ్గు మాలి
దోచి దాచి నట్టి దుడ్డు నల్పే గదా!
జుత్తు తెల్ల బడిన శోక మేల?
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘రంగుకు సాటిది’టైపాటు వల్ల ‘రంగును..’ అయినట్టుంది.
*
మిస్సన్న గారూ,
‘దాచిన దుడ్డు నలుపు’ అన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘జుత్తు నలుపుఁ జేయ శోభ హెచ్చు’ ననుకునేవాళ్ళుకు మంచి చురక అంటించారు. బాగుంది.
గురువుగారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినల్లని వానిని కృష్ణుని
రిప్లయితొలగించండియెల్లరు ప్రేమించుచుంద్ర,దేమొకొ భువిలో
నొల్లరు నల్లని మనుజుల
నల్లరి చేయుదురు వింతయౌనిదిగాదే?
నలుపు న విశ్వము నుండెన్
రిప్లయితొలగించండినలుపు నెగద జనన మరణ నటనలు జరుగున్!
నలుపున జనియించు వెలుగు
నలుపుని బొగడంగ తరమె? నలుసుని గానా!
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నవ్వుముఖముండి, సన్నని నడుము గల్గు
రిప్లయితొలగించండినల్లనమ్మను కోరరు యుల్లమందు
యెత్తుపళ్ళున్న యెఱుపైన యేడ్పుగొట్టు
నైన చేపట్టు చుండిరి యర్థితోడ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
పద్యం యడాగమాలన్నీ రాకూడనివే... మీ పద్యానికి నా సవరణ....
నవ్వుమొగ ముండి, సన్నని నడుము గల్గు
నల్లనమ్మను కోరరె యుల్లమందు
నెత్తుపళ్ళున్న నెఱుపైన నేడ్పుగొట్టు
నైన చేపట్టు చుండిరి యర్థితోడ
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణలకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండినీరిచ్చు మేఘము నలుపు!
రిప్లయితొలగించండితారా జాబిలి మెరిసెడు తామసి నలుపే!
తీరైనది నలుపేనని
చేరెను తలపైకి నలుపు శిరములు మెరయన్!