23, జూన్ 2012, శనివారం

పద్య రచన - 30


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. రాణా ప్రతాప సింగు ఖ-
    జానా మన భారతీయ శౌర్యము కెన్నన్
    వానికి జోతలు పల్కుట
    ధీనిధి విహితమ్ము మనకు తెలియుము వత్సా!

    రిప్లయితొలగించండి
  2. భారతమున శత్రు భరతము బట్టుచు
    ధాత్రి వెలిసెనా ప్రతాప రాజు
    కీర్తి గలిగి వెలిగె గెలిచెను, మేవాడు
    ఘనత పెంచె నాడు గట్టివాడు.

    రిప్లయితొలగించండి
  3. వల దని మొఘలుల దాస్యము
    చెలఁగి స్వతంత్రమ్ముఁ గోరి చేసెను సమరం
    బలయక; వనములలో వం
    తలఁ బడె; రాణాప్రతాపునకు వందనముల్.

    రిప్లయితొలగించండి
  4. గురువుగారూ,
    చివరి పాదంలో యతి ఎలా వేశారో అర్థం కాలేదండి.

    రిప్లయితొలగించండి
  5. లక్ష్మీదేవి గారూ,
    సాధారణంగా వర్గాక్షరాలలో మొదటి నాలుగు ఆయా వర్గాలలో ఐదవదైన అనునాసికాక్షరాలతో యతి చెల్లదు (ఉదా.. త,థ,ద,ధ లకు ‘న’తో యతిమైత్రి లేదు) ఐతే ఆ వర్గాక్షరాలు అనుస్వారయుక్తాలైనప్పుడు వాటి అనునాసికాక్షరాలతో యతి చెల్లుతుంది. (ఉదా.. ంత, ంథ, ంద, ంధ లకు నకారంతో యతి చెల్లుతుంది) దీనిని ‘అనుస్వార యతి’ అంటారు.

    భువి ననుస్వారయతి బిందుపూర్వకముగ
    ణాకు నిట నాల్గు చెల్లుఁ బాండవసహాయ!
    నాకు నిట నాల్గు చెల్లుఁ గందర్పజనక!
    మాకు నిట నాల్గు చెల్లు సంపదలరాజ! (అనంతుని ‘ఛందోదర్పణము’ నుండి)

    రిప్లయితొలగించండి
  6. మొఘలు సామ్రా జ్య మంతయు మో హరించి
    పా ఱ ద్రోలితి వీ వయ్య ! వారి నెట కొ
    నీ దు శౌర్యము , శక్తియు నె ఱు గ దరమె ?
    అందు కొను మయ్య ! రా ణా జి ! వంద నాలు .

    రిప్లయితొలగించండి
  7. నిజమే, గురువుగారు.
    ధన్యవాదములు ఓపిగ్గా సందేహం తీర్చినందుకు. పై పాదమును కలుపుకుంటూ చూడాలనేది తఱచుగా మఱిచిపోతున్నాను.

    రిప్లయితొలగించండి
  8. సీ.
    రాణాప్రతాపుండు రణరంగ ధీరుండు
    విశ్వవిఖ్యాతుడౌ వీరవరుడు,
    మాతృదేశావన మహితయజ్ఞమునందు
    బద్ధకంకణుడైన భాగ్యశాలి
    మొగలాయిలను గూల్చ మూర్తీభవించిన
    క్షాత్రతేజమువోలె ఘనత గాంచె
    చిత్తోడు కోసమై సిరులు, ప్రాణంబులన్
    ధార పోసినయట్టి ధన్యుడతడు
    తే.గీ.
    సర్వసుఖములు త్యజియించి శక్తులన్ని
    దేశమునుఁ గావ వెచ్చించి లేశమైన
    స్వార్థమూనక స్వారాజ్యసవనమందు
    సమిధయైనట్టి ఘనుడీత డమలగుణుడు.

    రిప్లయితొలగించండి
  9. గురువు గారు,
    ఈ రోజు కళ్యాణ రాఘవము చదివి తరించాను.
    శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల వారికి భక్తిపూర్వక ప్రణామములు.
    చాలా చక్కటి గ్రంథాన్ని మా చేత చదివించినందుకు మీకు ధన్యవాదములు.
    మొదటి భాగములోనే పులస్త్యబ్రహ్మాటవి యను వంశమందు దావాగ్ని (వంటి రావణుని , కులనాశకుని ) ని ఆర్పటానికి వచ్చిన క్రమ్మిన నీలమేఘునిగా శ్రీరాముని వర్ణించుట. ఆహా!
    పిదప గ్రొమ్మెఱపుతో నాలింగితంబైన నీలాంబుదముగా విశ్వామిత్రుని మదిలో సీతారాముల ఊహాదర్శనము. ఓహ్!
    శతానందుల వారి ఆనందం గురించి _ సార్థకనామధేయులనుట, సూర్యుడు ఇంటిపెద్దయై ఇనకుల వంశపు పెండ్లి పత్రికలను కరకిరణములతో ఇంటింటికీ అందజేయుట. చదివే కొద్దీ ఇన్ని చమత్కారపు వర్ణనలు, గంభీరశబ్దసౌందర్యము ఒకదాన్ని మించినదొకటి.
    అద్భుతమైన కావ్యము. మరొక్కసారి మా గురుదేవులకు, వారి గురుదేవులకు వందనములు.

    రిప్లయితొలగించండి
  10. అన్నట్టు మఱిచాను.
    అచ్చుప్రతి గురించి మీ చర్చ చూశాను.
    ఈ పుస్తకం కినిగె.కామ్ ఆన్లైన్ షాప్ లో కొనవచ్చు.
    http://kinige.com/kbook.php?id=784

    ఈ సైట్లో ఆర్డర్ చేస్తే పంపిస్తారు.

    రిప్లయితొలగించండి
  11. మానధనుడు, స్వేచ్ఛాప్రియుడు, మహాయోధుడు అయిన రాణా ప్రతాప సింహుని గురించి అద్భుతమైన పద్యాలు రచించిన మిస్సన్న గారికి, లక్ష్మీదేవి గారికి, సుబ్బారావు గారికి, సత్యనారాయణ మూర్తి గారికి అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ఆచార్యుల కళ్యాణ రాఘవము మీకు నచ్చినందుకు సంతోషం!

    రిప్లయితొలగించండి
  12. లక్ష్మీ దేవి గారూ కల్యాణ రాఘవం గురించిన మీ అభిప్రాయంతొ సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.
    http://kinige.com/kbook.php?id=784
    ఈ సైటులొ e-book ప్రతి పంపుతాను అంటున్నాడు. అంటే అచ్చుప్రతి కాదేమో. గురువుగారు పంపిన pdf ప్రతి లాంటిదేనేమో అని సందేహం.

    రిప్లయితొలగించండి
  13. నిజమే మిస్సన్న గారు, ఇప్పుడే చూచాను. అది ఈ- కాపీనే.

    రిప్లయితొలగించండి
  14. అక్బరు పాదుషా యడుగులకుమడుగు
    లొత్తుచు రారాజు లొదిగియుండ
    రణమున గాసిలి రాజ్యమ్ము గోల్పోయి
    వనముల పాలయ్యు వనరకుండ
    ఇడుమల బడుచును ,సడలనిపట్టుతో
    ధైర్యాన లక్ష్య సాధనకు బూని
    చండ భానుసమాన శౌర్య సాహసము తో
    తిరిగి రాజ్యమ్ము సాధించె నతడు
    దీక్ష,బలపరాక్రమమును ,దేశభక్తి
    కతడు మారుపేరనగ బ్రఖ్యాతి గాంచె
    భారత చరిత్ర జెరగని పేరు బొంది
    యలరు రాణా ప్రతాప సిం హాఖ్యు డతడు.

    రిప్లయితొలగించండి