25, జూన్ 2012, సోమవారం

పద్య రచన - 32


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

స్పందించిన కవిమిత్రులు

౧. లక్ష్మీదేవి

చిన్నికృష్ణ! నీ యల్లరి చేష్టలింక
మానుమయ్య, వినుము నాదు మాటలిపుడు
నల్లనయ్య! కోపమ్మేలనయ్య ! ముద్దు
లొలుకు తండ్రి! నిన్నుగనగ నూరిలోని
గొల్లభామలెల్లరు వచ్చి గొప్పపనులు
తమరు చేసినారంచును, తగవు బెట్టి
చోద్యమంచు నిలిచి యుండి చూసినట్టు
చెప్పిన కథల నమ్ముటె? చిన్నవానిఁ
జూచి యోర్వలేక పలుకుచుంద్రు వారు.
పాలు వెన్నలింట నదులు పాఱుచుండు
నీకు కొఱత వచ్చునొ? యింపు నీకు కలుగ!

నెల్లవేళల దొఱకునవెల్ల నీకు.

౨. సుబ్బారావు

మన్ను తిం టివి లోటు రా వెన్న నీ కు
ఏమి యీ పని ? తిం దు రె యె వ్వ రైన
నెందు బోకుము కద లకు మిచట నుండి
ననుచు నా యశో దమ్మ నె దనయు తోడ

కుండ నిండుగ నుండెను గృష్ణ ! వెన్న
తనివి తీరను భుజియించు తప్పు పట్ట
నంతె కాకయ పొరుగింటి చెంత కేగ
చెంప వాయింతు లాగుదు చెవులు నీవి .

౩. హరి వేంకట సత్యనారాయణ మూర్తి

చిట్టికన్న! నీవు చేయకల్లరి నాన్న!
దౌష్ట్యమింతయేని తగదు నీకు,
ఇరుగు పొరుగువారి నీరీతి బాధించి
గోల చేయుటెల్ల మేలు గాదు.

చిన్ని కృష్ణ నిన్ను మన్నించగాబోను
మన్ను తింటివంచు మాకు దెలిసె
పాలు పెరుగు వెన్న చాలక పోయెనా?
చెప్పరోరి బిడ్డ! తప్పులేల?

కల్లలాడవద్దు కన్నయ్య! నీవింక
మన్ను తినుట నిజమ? నన్నుఁ జూచి
చెప్పుమయ్య తండ్రి! చేరలు నిండంగ
వెన్నఁ బెట్టు దాన వినుము కృష్ణ!

వాదులాట లేల వారింటి పడతితో?
వీరిబిడ్డతోడ భేదమేల?
వెక్కిరింతలేల పెద్దవారలతోడ?
చిన్ని కృష్ణ! నీకు చెప్పుమయ్య!

బుద్ధి గలిగి యుండు, పోవల దటునిటు
కోప మింత నాకుఁ గూర్చబోకు
మని యశోద పలికె, నామోహనాంగుడే
పరమపురుషుడంచు నెరుగలేక.

౪. పండిత నేమాని

కన్నయ్యా! కన్నయ్యా!
విన్నావా యిరుగు పొరుగు వెలదుల పలుకుల్
తిన్నావా వారిండ్లను
వెన్నలు మీగడ లనుచు చెవిని నులుపంగా

అమ్మా! అసత్యములనే
అమ్మానిను లాడుచుందు రవి వినకమ్మా!
అమ్మాయావులు నన్నెపు
డమ్మో వేధించు చుందు రవహేళనతో

అనుచున్ దల్లికి విన్నవించుకొను ప్రేమానంద శోభామయున్
వనజాతాయత లోచనున్ వరగుణస్వాంతున్ ప్రశాంతున్ ఘనా
ఘన నీలాంగుని గోపికాప్రియు శుభాకారున్ యశోదాసుతున్
మనమారన్ వినుతించి మ్రొక్కులిడుదున్ మా తప్పులన్ గావగా





వందే గోకుల బాలం
వందే శ్రీకృష్ణ మఖిల భక్త శరణ్యం
వందే నందకుమారం
వందే సురబృంద వినుత భవ్య గుణాఢ్యం

౫. ‘మనతెలుగు’ చంద్రశేఖర్

వెన్నడు దొంగిలి జేసిన
దెన్నడు? కన్నడు యశోద కెన్నడు చిక్కెన్?
మన్ననగ వెన్న రూపము
నున్న తెలిప్రేమ కోలగ చిక్కెన్!


౬. నేదునూరి రాజేశ్వరి 
మన్ను తింటివ మనకింత వెన్న కఱువ
చెవి మెలేసియు బెదిరించె చిన్ని కృష్ణుఁ 
దెఱఛి చూపిన యానోట వెఱగు పడుచు
భువన భాండము నిండిన బొజ్జ కనగ ! 


౭. సహదేవుడు

వెన్న గిన్నె నేల వీధుల దేచ్చేవు
నాడి పోసు కొనగ నాడ వారు
దొంగ వాడవనుచు తోటి వారాలు దిట్ట
నింద లన్ని స్తుతుల? నీకు కృష్ణ?

౮. మిస్సన్న

నల్ల పిల్లి వోలె మెల్ల మెల్లన జేరి
వెన్న పాలు పెరుగు కన్నమేయు
గొల్ల పడుచులంత గోలెత్తి రా తల్లి
కొంగు చాటు జేరు దొంగ బుడుత.

అమ్మ యెంతగాను రమ్మని పిలిచినా
పాల బువ్వ తినక పరుగు వెట్టు
పరుల యిండ్ల దూరి పాల్వెన్న కాజేయు
ఏమి చోద్యమమ్మ యింతులార.

నల్ల కలువ మోము పిల్లన గ్రోవియున్
ఘల్లు ఘల్లు మంచు కాలి గజ్జె
చిట్టి పొట్టి యడుగు లిట్టిట్టు వేయుచు
అందు నిందు తిరుగు నందు పట్టి.

చేత కొంత వెన్న మూతిని మరి కొంత
మెడను గోరు పులిది మెరయుచుండి
బెట్టు సేయు ముద్దు పెట్టవేరా యన్న
చుట్టు బుంగ మూతి సున్న వోలె.

* వందే కృష్ణం భజామ్యహం *


౯. కమనీయం

చిన్ని కృష్ణ నీవేలరా ,మన్ను దింటి
వన్నయున్,సఖులు చెప్పుచునున్నవారు
నేవి వలసిన కల మన యింటియందు
నేమి లోటని యిటు జేసితీవు ,తప్పు.

నిన్ను దండింతు కదలక నిలువుమంచు
తల్లి యనగ నమాయకత్వము నటించి
అమ్మ,మన్నుదినంగ నేనంత యల్ప
బుద్ధిగాను ,నన్ శిక్షింప బోకు మమ్మ.

తనపై కొండెము లాడుచుండ్రి బలభద్రాదుల్ వినంబోకుమా
జననీ వారల మాట కల్ల నిజమున్ జాటించి నే బల్కెదన్
కనుమా యంచును నొరు విప్పగను లోకాలన్ని కన్ పించగా
దన లీలన్ భ్రమియింప జేసెడి హరిన్ దైత్యారి నే గొల్చెదన్ . 


 

17 కామెంట్‌లు:

  1. చిన్నికృష్ణ! నీ యల్లరి చేష్టలింక
    మానుమయ్య, వినుము నాదు మాటలిపుడు
    నల్లనయ్య! కోపమ్మేలనయ్య ! ముద్దు
    లొలుకు తండ్రి! నిన్నుగనగ నూరిలోని
    గొల్లభామలెల్లరు వచ్చి గొప్పపనులు
    తమరు చేసినారంచును, తగువు బెట్టి
    చోద్యమంచు నిలిచి యుండి చూసినట్టు
    చెప్పిన కథల నమ్ముటె? చిన్నవానిఁ
    జూచి యోర్వలేక పలుకుచుంద్రు వారు.
    పాలు వెన్నలింట నదులు పాఱుచుండు
    నీకు కొఱత వచ్చునొ? యింపు నీకు కలుగ
    నెల్లవేళల దొఱకునవెల్ల నీకు.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. మన్ను తిం టివి లోటు రా వెన్న నీ కు
    ఏమి యీ పని ? తిం దు రె యె వ్వ రైన
    నెందు బోకుము కద లకు మిచట నుండి
    ననుచు నా యశో దమ్మ నె దనయు తోడ .

    రిప్లయితొలగించండి
  4. చిట్టికన్న! నీవు చేయకల్లరి నాన్న!
    దౌష్ట్యమింతయేని తగదు నీకు,
    ఇరుగు పొరుగువారి నీరీతి బాధించి
    గోల చేయుటెల్ల మేలు గాదు.

    చిన్ని కృష్ణ నిన్ను మన్నించగాబోను
    మన్ను తింటివంచు మాకు దెలిసె
    పాలు పెరుగు వెన్న చాలక పోయెనా?
    చెప్పరోరి బిడ్డ! తప్పులేల?

    కల్లలాడవద్దు కన్నయ్య! నీవింక
    మన్ను తినుట నిజమ? నన్నుఁ జూచి
    చెప్పుమయ్య తండ్రి! చేరలు నిండంగ
    వెన్నఁ బెట్టు దాన వినుము కృష్ణ!

    వాదులాట లేల వారింటి పడతితో?
    వీరిబిడ్డతోడ భేదమేల?
    వెక్కిరింతలేల పెద్దవారలతోడ?
    చిన్ని కృష్ణ! నీకు చెప్పుమయ్య!

    బుద్ధి గల్గి యుండు, పోవల దటునిటు
    కోప మింత నాకుఁ గూర్చబోకు
    మని యశోద బల్గె, నామోహనాంగుడే
    పరమపురుషుడంచు నెరుగలేక.

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని గారి పద్యములు.......

    కన్నయ్యా! కన్నయ్యా!
    విన్నావా యిరుగు పొరుగు వెలదుల పలుకుల్
    తిన్నావా వారిండ్లను
    వెన్నలు మీగడ లనుచు చెవిని నులుపంగా

    అమ్మా! అసత్యములనే
    అమ్మానిను లాడుచుందు రవి వినకమ్మా!
    అమ్మాయావులు నన్నెపు
    డమ్మో వేధించు చుందు రవహేళనతో

    అనుచున్ దల్లికి విన్నవించుకొను ప్రేమానంద శోభామయున్
    వనజాతాయత లోచనున్ వరగుణస్వాంతున్ ప్రశాంతున్ ఘనా
    ఘన నీలాంగుని గోపికాప్రియు శుభాకారున్ యశోదాసుతున్
    మనమారన్ వినుతించి మ్రొక్కులిడుదున్ మా తప్పులన్ గావగా

    రిప్లయితొలగించండి
  6. సత్యనారాయణ గారి వ్యాఖ్య.....

    ఆర్యా!
    నమస్కారములు.
    నా చివరి పద్యం మొదటి పాదంలో "బుద్ధి గలిగి" అనియు, మూడవ పాదంలో "యశోద పలికె" అనియు చదువవలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  7. సుబ్బారావు గారి పద్యము....

    కుండ నిండుగ నుండెను గృష్ణ ! వెన్న
    తనివి తీరను భుజియించు తప్పు పట్ట
    నంతె కాకయ పొరుగింటి చెంత కేగ
    చెంప వాయింతు లాగుదు చెవులు నీవి .

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారి వ్యాఖ్య......

    అందరికీ శుభాభినందనలు. అందరి పద్యములు అలరారుచున్నవి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. వెన్నడు దొంగిలి జేసిన
    దెన్నడు? కన్నడు యశోద కెన్నడు చిక్కెన్?
    మన్ననగ వెన్న రూపము
    నున్న తెలిప్రేమ కోలగ చిక్కెన్!

    రిప్లయితొలగించండి
  10. మన్ను తింటివ మనకింత వెన్న కఱువ
    చెవి మెలేసి బెదిరించె చిన్ని కృష్ణు
    తెఱఛి చూపిన యానోట వెఱగు పడుచు
    భువన భాండము నిండిన బొజ్జ కనగ !

    రిప్లయితొలగించండి
  11. వెన్న గిన్నె నేల వీధుల దేచ్చేవు
    నాడి పోసు కొనగ నాడ వారు
    దొంగ వాడవనుచు తోటి వారాలు దిట్ట
    నింద లన్ని స్తుతుల? నీకు కృష్ణ?

    రిప్లయితొలగించండి
  12. వందే గోకుల బాలం
    వందే శ్రీకృష్ణ మఖిల భక్త శరణ్యం
    వందే నందకుమారం
    వందే సురబృంద వినుత భవ్య గుణాఢ్యం

    రిప్లయితొలగించండి
  13. నల్ల పిల్లి వోలె మెల్ల మెల్లన జేరి
    వెన్న పాలు పెరుగు కన్నమేయు
    గొల్ల పడుచులంత గోలెత్తి రా తల్లి
    కొంగు చాటు జేరు దొంగ బుడుత.

    అమ్మ యెంతగాను రమ్మని పిలిచినా
    పాల బువ్వ తినక పరుగు వెట్టు
    పరుల యిండ్ల దూరి పాల్వెన్న కాజేయు
    ఏమి చోద్యమమ్మ యింతులార.

    నల్ల కలువ మోము పిల్లన గ్రోవియున్
    ఘల్లు ఘల్లు మంచు కాలి గజ్జె
    చిట్టి పొట్టి యడుగు లిట్టిట్టు వేయుచు
    అందు నిండు తిరుగు నందు పట్టి.

    చేత కొంత వెన్న మూతిని మరి కొంత
    మెడను గోరు పులిది మెరయుచుండి
    బెట్టు సేయు ముద్దు పెట్టవేరా యన్న
    చుట్టు బుంగ మూతి సున్న వోలె.

    ******వందే కృష్ణం భజామ్యహం******

    రిప్లయితొలగించండి
  14. గురువు గారు,
    నా పద్యములో చివరి పాదము మీరు ప్రకటించిన వాటిలో లేదు.సవరించగలరు.

    రిప్లయితొలగించండి
  15. మనోహరమైన పద్యాలలో చిన్ని కృష్ణుని లీలలను వర్ణించిన కవిమిత్రులు
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    పండిత నేమాని వారికి,
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    సహదేవుడు గారికి,
    మిస్సన్న గారికి,
    ............. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. చిన్ని కృష్ణ నీవేలరా ,మన్ను దింటి
    వన్నయున్,సఖులు చెప్పుచునున్నవారు
    నేవి వలసిన కల మన యింటియందు
    నేమి లోటని యిటు జేసితీవు ,తప్పు.

    నిన్ను దండింతు కదలక నిలువుమంచు
    తల్లి యనగ నమాయకత్వము నటించి
    అమ్మ,మన్నుదినంగ నేనంత యల్ప
    బుద్ధిగాను ,నన్ శిక్షింప బోకు మమ్మ.

    తనపై కొండెము లాడుచుండ్రి బలభద్రాదుల్ వినంబోకుమా
    జననీ వారల మాట కల్ల నిజమున్ జాటించి నే బల్కెదన్
    కనుమా యంచును నొరు విప్పగను లోకాలన్ని కన్ పించగా
    దన లీలన్ భ్రమియింప జేసెడి హరిన్ దైత్యారి నే గొల్చెదన్ .

    రిప్లయితొలగించండి