27, జులై 2014, ఆదివారం

పద్యరచన - 633

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

 1. తీవ్రవాదులకని మనదేశమునకు
  పొరుగు దేశము పంపగా, బోలెడన్ని
  మారణాయుధములు వచ్చుమార్గమందె
  రక్షకదళములా గుట్టును రట్టుచేసె

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  ఎ.కె.47 న్నే చంపేస్తే ???
  (అంటే ఆయుధాల్నీ తీవ్రవాదాన్నీ నిషేదిస్తే)
  (అంటే ప్రపంచ రాజ్యాధి నేతలంతా అశోకుని మార్గ మవలంబిస్తే)

  01)
  ____________________________

  చిన్న పెద్ద యనక - నెన్నియో ప్రాణముల్
  చిటిక లోన దీయు - చిత్ర మిదియె !
  మంచి చెడ్డ యనక - మారణ హోమంబు
  సలుప గలుగు దీని - జంపు నెవరు ???
  ____________________________

  రిప్లయితొలగించండి
 3. ఉగ్రవాదులు గుట్టుగా నుంచి నట్టి
  గన్ను లన్నియు దొరకగా కాన లోన
  తెచ్చినారు జవానులు తెగువ తోడ
  మరణ కాండను ధిషణతో మాపినారు

  రిప్లయితొలగించండి
 4. మారణాయుధములు వైరి చంపుకొరకు
  మానవాళి మేలు మరువరాదు
  జనుల మేలుకోరు చాల యావిష్కార
  ములను చేయవలయు ముందు ముందు

  రిప్లయితొలగించండి
 5. నక్సలైట్లను దునుమాడి నగర జనులు
  తెచ్చి పెట్టిరి గన్నులు దెలివి గాను
  చిత్ర మందున్న వాటిని శేషు !చూసి
  లెక్క పెట్టుమ యొకసారి యన్ని యూను

  రిప్లయితొలగించండి
 6. శిక్షణ నొంది మానవత చింతన వీడుచు నుగ్రవాదులై
  భక్షణ జేయ వచ్చిరి తుపాకుల బేల్చుచు భారతీయులన్
  తక్షణమే జవానులిక తాళక వారిని చంపి వేయుచున్
  రక్షణ జేసి పౌరులను; రాశిగ గూర్చిరి యాయుధమ్ములన్!

  రిప్లయితొలగించండి
 7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. సాటి ప్రాణినిట్లు చంపుట కొఱకయి
  మనిషి చేసె నిట్టి మారణాయు
  ధముల వేనవేలు ధనపు మూట కొలది
  దక్కునిట్టి వకట! దైత్యగుణమ!

  రిప్లయితొలగించండి
 9. ఆయుధములఁ బట్టి నారని
  సాయుధులై కూల్చి వారి సామాగ్రి నిలా
  తూయగ సమాజ మందలి
  రోయన్ దగు నుగ్రవాద రూపము గనమే!

  రిప్లయితొలగించండి
 10. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి