28, జులై 2014, సోమవారం

పద్యరచన - 634

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    తెలుగమ్మాయి :

    01)
    ___________________________

    తెల్ల తెల్లని దంతముల్ - దీప్తి నిడగ
    తెలుగు కట్టును బొట్టును - తీర్చు కొనిన
    తేట నవ్వులు చిందించు - తెలుగు పిల్ల
    తెలుగు వెలుగులు నింపవే - దిశల దెసల !
    ___________________________

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు
    పొందగ మీదీవె నలను భూరి యశంబుల్
    చందనము వంటి చల్లని
    బంధన ములనడుమ నుండు భాగ్యము గలుగన్

    రిప్లయితొలగించండి
  3. బ్లాగు కవులకు నేనుగా భక్తి తోడ
    వంద నంబులు సేతును వంద లాది
    అందు కొనినాకు మన సార , యాశిసులను
    నీయ గోరుదు మిమ్ముల నిప్పు డార్య !

    రిప్లయితొలగించండి
  4. తెలుగు కట్టు బొట్టు తీరుగా ధరియించి
    చెంగలించు చుండె చిట్టి తల్లి
    అంజలి ఘటియించి యాశీర్వచనముల
    కోరుచుండె జయము కూరగాను

    రిప్లయితొలగించండి
  5. వందనము చేయు చుండెను
    నందముగా చిన్నిపాప నాహ్లాదముతో
    విందగు చూచిన వారికి
    బంధమ్ములువేయుచుండె భళిభళి!పాపా!


    వందనమమ్మా భారతి
    వందనమో భరతమాత వందన మార్యా!
    వందనము తెలుగు భాషకు
    వందనములు తెలుగుపద్య వైభవమునకున్!

    రిప్లయితొలగించండి
  6. అందాని కందమనదగు
    కుందన భూషిత నవసుమ కోమలి వమ్మా!
    చందన చర్చిత మోమున
    వందనమిదె శ్రావణమని బలుకు పయనమా!

    రిప్లయితొలగించండి
  7. అందము చిందెడు పాపా
    వందనమని చెప్పుట మన పద్ధతి సుమ్మా
    వందేళ్ళుగ వర్ధిల మే
    మందరమందింతు మందుమాశీస్సులనే.

    రిప్లయితొలగించండి
  8. చక్కని కట్టుబొట్టులను సాదరమొప్పగ వందనాలతో
    మిక్కిలి భక్తిభావనను మేలగుచల్లని మందహాసియై
    యెక్కడి బాలికో కదలి యిచ్చట జేరుట చూడగా నహో
    చుక్కయె మిన్నుదాటియిటచోద్యముగొల్పగ నిల్చినట్లయెన్

    రిప్లయితొలగించండి
  9. హారము కంఠ సీమపై , హాయిగ నూగెడు బుట్టలున్ చెవిన్,
    బారెడు కేశపాశములు పాపిడి బిళ్ళయు శోభకూర్చ సం
    స్కారము మెండుగాఁ గలిగి చక్కని ముద్దుల పాప తా నమ
    స్కారము చేయమోడ్చె తనగాజుల చిట్టి కరాలు మ్రోగగన్

    రిప్లయితొలగించండి
  10. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న ప్రయాణంలో ఉండి మీ పద్యాలను వెంటవెంట సమీక్షించలేకపోయాను. మన్నించండి.
    నిన్నటి పద్యరచన శీర్షికను తమ పద్యాలతో అలరించిన మిత్రులు.....
    వసంత కిశోర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    సుబ్బారావు గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    శైలజ గారికి,
    సహదేవుడు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి,
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి