2, జులై 2014, బుధవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 17

రామాయణము-
చం.    పసనది దాటి తన్ (మృదుసుభద్రయశస్కులు హెచ్చులక్క)డన్
మసలు, చెడారియౌ (నెలవు నవ్యముదంబు జనించుచుండఁ)గా
నసురనుఁ దాటకం (గనిరి, హాళిని దానిని గండడై స)రిన్
వెస శరవహ్ని వై(రికృతిభీముఁడు రాముఁడు ప్రీతిఁ గాల్చెఁ) దాన్. (౩౨)

భారతము-
గీ.      మృదుసుభద్రయశస్కులు హెచ్చులక్క
నెలవు నవ్యముదంబు జనించుచుండ
గనిరి, హాళినిఁ దానిని గండడై స
రి కృతి భీముఁడు రాముఁడు ప్రీతిఁ గాల్చె. (౩౨)

టీక- (రా) వైరికృతిభీముఁడు = నేర్పరులగు శాత్రవులకు భయంకరుఁడు; (భా) సరికృతి = సరియగు నేర్పరి; రాముఁడు = రమ్యముగా నుండువాఁడు; హెచ్చులక్క నెలవు = గొప్ప లక్కయిల్లు.

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి