5, జులై 2014, శనివారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 20

రామాయణము-
ఉ.      ఔచితి రాముఁడున్ (మురిసి యచ్చటి శిష్టులు పొంగఁగా బ)లున్
నీచు సుబాహు సో(కు ధరణీజనదూరునిఁ గ్రూరుఁ గూల్చె,) మా
రీచునిఁ జిమ్మె సద్(ధృతి వరించి కడున్ గడితేఱి భీముఁ)డై,
ప్రోచె సవమ్ము గో(డడల బొందుచు దుష్టజనాళి కుంద)గన్. (౩౫)

భారతము-
గీ.      మురిసి యచ్చటి శిష్యులు పొంగఁగా బ
కు ధరణీజనదూరునిఁ గ్రూరుఁ గూల్చె,
ధృతి వరించి కడున్ గడితేఱి భీముఁ,
డడలుఁ బొందుచు దుష్టజనాళి కుంద. (౩౫)

టీక- (రా) భీముఁడై = భయంకరుఁడై; సోకు = రాక్షసుని; గోడు = దుఃఖము; అడలు = భయము.

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి