పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు గట్టిగా నీవు తిట్టిన తిట్టులన్ని కొట్టు కొని పోయెగాలికి. కొండ లెల్ల మారు మ్రోగి నీ చెవులను దూరి నిన్ను పాపకర్ముని జేయును పతన మవగ
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * యం.ఆర్. చంద్రమౌళి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. * ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ, మీ పూరణ, దానికి ముందు ప్రస్తావన పద్యాలు బాగున్నవి. అభినందనలు. * శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘శీఘ్రముగను + ఆంజనేయుడు’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మేరునగములనతగిన మేటి నేత
రిప్లయితొలగించండిలెల్ల 'మోడీ'యను సుడిగాలి నెదిరించ
లేక ఓటమి పాలైరి కాఁక తగిలి
కొట్టుకొనిపోయె గాలికిఁ గొండ లెల్ల
రాయలాస్థాన మందలి రామకృష్ణు
రిప్లయితొలగించండిడతుల మేధావులమటంచునరుగుదెంచు
కవుల నోడించె క్షణములో కవనమందు
కొట్టుకొనిపోయె గాలికిఁ గొండ లెల్ల.
విరివి పెరుగ తృణావర్తు భీతి మెరయ
రిప్లయితొలగించండికొట్టుకొనిపోయె గాలికిఁ గొండ లెల్ల
బాలకృష్ణుడెగసిపడి వానిజంప
విరిగె రెండు, కంసధృతి ; పీడ జనుల
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
గట్టిగా నీవు తిట్టిన తిట్టులన్ని
కొట్టు కొని పోయెగాలికి. కొండ లెల్ల
మారు మ్రోగి నీ చెవులను దూరి నిన్ను
పాపకర్ముని జేయును పతన మవగ
దనుజులెందరెందరుగాని దైవ బలము
రిప్లయితొలగించండిముందు నిలువంగ జాలరు పుడమియందు
స్వామి ధాటిని యిసుమంత సైపలేక;
కొట్టుకొనిపోయె గాలికిఁ గొండ లెల్ల.
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
మల్లెలవారి పూరణలు
ఇంద్ర పూజను సేయక నెల్లరుండ
నందు పల్లెను. జనులపై నలుక జెంది
గాలివానను గురిపి౦చె గట్టుదాయ
కొట్టు కొని పోయె గాలికి కొండలెల్ల
భీమసూనుడు యుధ్ధాన భీమముగను
కౌరవాళిని రాక్షస ఘనపు విద్య
నోట గాలిని ని౦పుచు నూదగాను
కొట్టు కొని పోయె గాలికి కొండలెల్ల
గురువు గారికి ప్రయాగ శ్రీరామ చంద్ర మూర్తి నమస్కారములు.
రిప్లయితొలగించండికొంపలన్ని కొట్టుకొనిపోయె గాలికిఁ
గొండలెల్ల విరిగి బండలుపడె
విశ్వమందు తాను వీరుడను మనిషి
నిలవరింప గలడె విలయములను?
కడలి పొంగి పొరల అడ్డగించగ లేడు
భీతినొందు మనిషి పిడుగు పడిన
పంచ భూతములను పట్టియుంటి ననుచు
విర్ర వీగు మనిషి వెర్రి వాడు
పంచ భూతము లాగ్రహింపగ వణికెను
ధరణి యెల్ల, పొలములన్ని వరద లోన
కొట్టుకొనిపోయె, గాలికిఁ గొండ లెల్ల
కదిలె, భూకంపనము జేత యిళ్ళు గూలె.
సీత జాడను కనుగొన శీఘ్రముగను
రిప్లయితొలగించండిఆంజనేయుడు లఁఘించె నాకశమున
వాయుజాతుని ధాటికి వణకిపోయి
కొట్టుకొనిపోయె గాలికి కొండలెల్ల
మోడి రాకతో ప్రజలకు వేడి యెక్కి
రిప్లయితొలగించండిసంత సంబులు మది నిండ సంతరించి
యోటు వేయుట మూలాన రాట దేల
కొట్టు కొనిపోయె గాలికి గొండ లెల్ల
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ...
రిప్లయితొలగించండిచంద్రశేఖర రావును జనులు మెచ్చి
యోటు వేసిరి వానికి నొప్పుగాను
పెక్కుపార్టీల బలములు చిక్కిపోవ
కొట్టుకొనిపోయె గాలికి కొండలెల్ల.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
యం.ఆర్. చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
మీ పూరణ, దానికి ముందు ప్రస్తావన పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘శీఘ్రముగను + ఆంజనేయుడు’ అన్నప్పుడు సంధి జరుగుతుంది.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఊరు మనదైన దోచగ నేర మనక
రిప్లయితొలగించండినోబులాపుర గనులెల్ల నూర్చి నారు
పూర్తి నైసర్గిక స్వరూప గుర్తు చెదర
కొట్టుకొనిపోయె 'గాలి 'కిఁ గొండలెల్ల
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
`స్వరూప గుర్తూ అని సమాసం చేయరాదు కదా. అక్కడ `స్వరూపములఁ జెఱుపఁగ ... అనండి.
పాప భారము మోయక వ్యధను జెంది
రిప్లయితొలగించండిప్రళయ తాండవ మాడెను వసుధ యనగ
వీచి యనిలుడు సృష్టించె భీక రమ్ము
కొట్టు కొనిపోయె గాలికి గొండ లెల్ల
guruvu gaariki dhanyavaadhamulu. savarincina padyam :
రిప్లయితొలగించండిఊరు మనదైన దోచగ నేర మనక
నోబులాపుర గనులెల్ల నూర్చి నారు
పూర్తి నైసర్గిక స్వరూపములఁ జెఱుపఁగ
కొట్టుకొనిపోయె 'గాలి 'కిఁ గొండలెల్ల