9, జులై 2014, బుధవారం

సమస్యా పూరణం – 1468 (ఏలూరున నుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
ఏలూరున నుండువార లెల్లరు కవులే.

18 కామెంట్‌లు:

  1. ఆలయము దిగ్గజ ముల
    కేలూరు ననుండు వార లెల్లరు కవులే
    కాలము రాయలి కొలువున
    పాలన చేయంగ నిలచె పండితు లెల్లన్

    రిప్లయితొలగించండి
  2. గురువులు క్షమించాలి
    మొదటి పాదం " ఆలయమది దిగ్గజ ముల " అనిఉంటే బాగుంటుం దేమొ అనుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  3. కాల మహత్యమె! మాణి
    క్యాల మరకత రతనాల యంగళ్ల కొనే
    శ్రీలు మెరయు రాయల వా
    రేలూరున నుండు వార లెల్లరు కవులే!

    రిప్లయితొలగించండి
  4. ఏలూరి పిచ్చికవియనె
    "భూలోకపు కవులకెల్ల బోద్ధనునేనె !
    బాల స్త్రీ పశు పక్షులు
    ఏలూరున నుండువార లెల్లరు కవులే" !!

    రిప్లయితొలగించండి
  5. ఏలిక సద్గుణ గణముల
    పాలితులలవరుచు కొనుట భావ్యమె సుమ్మీ
    పాలసుడు కాని కవిరా
    జేలూరున నుండు వారలెల్లరు కవులే

    రిప్లయితొలగించండి
  6. మేలగు రచనలు జేయుచు
    భూలోకమునందు గీర్తి బొందిన ఘనుడౌ
    పాలకుడా రాయల వా
    రేలూరున నుండు వారలెల్లరు కవులే!

    రిప్లయితొలగించండి

  7. మల్లెల వారిపూరణలు
    ఏలెను రాయలు హంపిని
    వాలాయముగను కవులను పాలన యందున్
    కేలొన జేసెను యాతం
    డేలూరున నుండు వార లెల్లరు కవులే
    శ్రీలల రంగాజమ్మను
    వేలలితను ముద్దు పళని వెంకట కవినిన్
    పాలిత రఘునాధుడతడు
    ఏలూరున నుండు వార లెల్లరు కవులే
    ఏలూరు,సామవేదము,
    కాలూనిన వద్దిపర్తి కైతల దిట్టల్
    చాలగ గలరీ పట్టణ
    మేలూరున నుండు వార లెల్లరు కవులే

    రిప్లయితొలగించండి
  8. కూలంకషముగ కవిత స
    మూలముగా పరుగు వెట్టె మును రాయల దౌ
    కాలము నందున ; కవితల
    నే లూరున నుండువార లెల్లరు కవులే.

    కవితలను + ఏలు + ఊరున = కవితలనేలూరున

    రిప్లయితొలగించండి
  9. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    ఏలుబడి సేయు వారలు
    ఏలూరున నుండువార లెల్లరు. కవులే
    పాలున మీగడ తరకలు
    పాలకులకు కీర్తినొసగ వ్రాసిరి కైతల్

    రిప్లయితొలగించండి
  10. అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    ‘వారు + ఏలు + ఊరు’ అన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ ‘రాజు + ఏలు + ఊరు..’ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    ‘రాయలవారు + ఏలిన + ఊరు’తో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    రెండవ పూరణలో ‘రఘునాథుఁ డతం/ డేలూరున...’ అనండి.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. గురువు గారు నేను నిన్న పెట్టిన మెయిల్ జూచి ఈ రోజు సమస్యను ఇచ్చినారు

    గురువు గారికి,కవి పండితులకు వరప్రసాదు నమస్కారములతో ...

    మీ మధ్యకు వచ్చినందులకు సంతోషముతో ..

    ఇక పై ఏలూరు నుండి నా పూరణలు
    ============*===========
    కాలుని బాధల నొందుచు
    పాలక వర్గమును దిట్టి పరుష పదములన్
    జాలము నందున పంచెడి
    యేలూరున నుండువార లెల్లరు కవులే"

    రిప్లయితొలగించండి
  12. వరప్రసాద్ గారూ,
    సంతోషం. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పేలవమగు కవితలవిని
    ఏలూరున నుండువారలె,ల్లరు కవులే
    ఈ లీలనవని యందున్?
    హా! లేరే సుకవు?లనుచు నాశ్చర్య పడెన్ !

    రిప్లయితొలగించండి
  14. కాలంబప్పుడు చూడ, ర
    సాలూరగ కాళిదాసు సభలో కవియే
    మేలుగ భోజ మహారా
    జేలూరున నుండు వార లెల్లరు కవులే

    రిప్లయితొలగించండి
  15. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    భోజుని కాలంలో అతడేలిన ఊరు ధారానగరంలోనే కాదు, ఆ రాజ్యమంతటా కవులే!

    రిప్లయితొలగించండి
  16. కాలువల మురికి మధ్యన
    నేలూరున నుండువార లెల్లరు; కవులే
    కాలమున లేరు నిజముగ...
    పీలేరున నుండు వారు ప్రియతమ కపులే!

    రిప్లయితొలగించండి


  17. బాలా కుమారి వినుమా
    ఏలూరున నుండువార లెల్లరు కవులే
    మా లావుగ చెప్పెదర
    మ్మా లక్షణముగ కవితల మాటల కైపున్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. పీలేరున నుండు ప్రజకు
    పీలేరున వార లెల్ల విజ్ఞులు కారే!
    ఏలూరుననుండు ప్రజకు
    నేలూరున నుండువార లెల్లరు కవులే!

    రిప్లయితొలగించండి