రామాయణము- (ముక్తపదగ్రస్తము)
సీ. ఘనఘనశ్యాము రాఘవునిఁ గాంచి
(మురిసి
పురివిప్పి యాడు కొమరునమిళ్ల)
నమిలియాట కనుగుణ్యపుటలల, (నలల
యం దుయ్యెలల నూఁగు
నంచలగమి,)
నంచలగమి వెక్కిరించు చుఱికి (వల్ల
రుల లీల నూఁగెడు బలితకపులఁ)
గపితతిచేతఁ మెక్కఁబడు పండ్లనుఁ (బండ్ల
బరువునఁ దలలను వంచు
చెట్లఁ)
గీ. జెట్లకొమ్మల నెఱుపుఁ జేసెడు
చివుళ్లఁ,
జివురులఁ దిని క్రొవ్వి పలుకు చిలుకపౌజు
చిలుకపౌజున కులుకు జింకల గలిగి క
ర మలరించె నారామ మా రామముఖులు. (౩౯)
భారతము-
గీ. మురిసి పురివిప్పి యాడు కొమరునమిళ్ల
నలల యందుయ్యెలల నూఁగు నంచలగమి
వల్లరుల లీల నూఁగెడు బలితకపులఁ
బండ్లబరువునఁ దలలను వంచు చెట్ల. (౩౯).
టీక- నమిలి = నెమలి; అంచలగమి = హంసలగుంపు; వల్లరులు = తీగలు; ఆరామము = వనము;
రామముఖుల = రాముఁడు మొదలగు వారిని. (భారతమునఁ గ్రింది పద్యమున కన్వయము.)
రావిపాటి లక్ష్మీనారాయణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి