12, జులై 2014, శనివారం

సమస్యా పూరణం – 1471 (జనకుని పెండ్లాడు మనుచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
జనకుని పెండ్లాడు మనుచు జానకి కోరెన్.
(చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో...)

33 కామెంట్‌లు:

 1. జనకుడను పేరు వినగను
  మనమున నుప్పొంగు ప్రేమ మామను గాంచన్
  తనరుచు నాతని మదిగని
  జనకుని పెండ్లాడు మనుచు జానకి కోరెన్

  మామ = మేనమామ

  రిప్లయితొలగించండి
 2. అక్కయ్యా,
  మేనమామకు జనకుడన్న పేరు పెట్టి చక్కని పూరణ నందించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. గురువులకు గురుపూర్ణిమ సందర్భముగా ప్రణామములు + ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 4. ఇనకుల తిలకుని,ఘన శివ
  ధనువెత్తిన శౌరిఁ, రాముఁ ,తారక నామున్
  ముని జన సన్నుతుఁ గరుణా
  జనకుని పెళ్లాడు మనుచు జానకి కోరెన్

  రిప్లయితొలగించండి
 5. తన తల్లి గతించగ సూ
  నను కని తండ్రి పడుచున్న నానా వ్యధలన్
  కని చింతను పొంది మరల
  జనకుని పెండ్లాడ మంచు జానకి కోరెన్

  రిప్లయితొలగించండి
 6. ఇనకుల తిలకుని మదిలో
  గనగనె తనపాలి భర్త ఖగపతియనుచున్
  ధనువంది గెల్చి గంగా
  జనకుని పెండ్లాడు మనుచు జానకి కోరెన్

  రిప్లయితొలగించండి
 7. శ్రీ గురుభ్యో నమః గురుపూర్ణిమ సందర్భముగా గురువులకు వందనములు.

  అక్కయ్య గారూ చక్కని పూరణ...
  సహదేవుడుగారూ బాగుంది...
  అన్నపురెడ్డి గారూ భళా...

  రిప్లయితొలగించండి
 8. సహదేవుడు గారూ,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.
  అరసున్నాల విషయంలో జాగ్రత్త పడండి.. ‘శౌరిఁ, రాము’... శౌరి తర్వాత అరసున్నా రాదు. ‘రాముఁ, తారక’ అన్నచోట ‘రాముఁ, దారక..’ అని ఉండాలి.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  తండ్రిని మళ్ళీ పెళ్ళి చేసుకోమన్న జానకి అనే అమ్మాయిని గురించిన మీ పూరణ బాగున్నది.అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఖగపతి’ అంటే గరుత్మంతుడు... అక్కడ ‘ఖగరథుఁ డనుచున్’ అంటే బాగుంటుందేమో?

  రిప్లయితొలగించండి
 9. పోరీ నన్ను పెండ్లాడ మని
  రావణుండు బేజారు చేయ ,
  ఓరీ రాక్షసా,పోపో, 'తే
  జనకుని' పెండ్లాడు మనుచు జానకి కోరెన్ !!

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. జనని వసుధయన సీతకు
  జనకుడె భూభర్త విష్ణు, చనవరుసగతుల్
  మనుజ మతితర్కము, మదన
  జనకుని పెండ్లాడు మనుచు జానకి కోరెన్

  రిప్లయితొలగించండి
 11. మాస్టరు గారూ ! తొందరపాటులో జరిగిన పొరపాటు...సవరణకు ధన్యవాదములు..
  సవరణతో...


  ఇనకుల తిలకుని మదిలో
  గనగనె తనపాలి భర్త ఖగరథుడనుచున్
  ధనువెత్తి గెల్చి గంగా
  జనకుని పెండ్లాడు మనుచు జానకి కోరెన్

  రిప్లయితొలగించండి
 12. గురుదేవులకు ధన్యవాదాలు.
  సవరించిన పద్యం :
  ఇనకుల తిలకుని ఘన శివ
  ధనువెత్తిన శౌరి, రాముఁ దారక నామున్
  ముని జన సన్నుతుఁ గరుణా
  జనకుని పెళ్లాడు మనుచు జానకి కోరెన్

  రిప్లయితొలగించండి
 13. గురుపూర్ణిమ సందర్భముగా గురువులకు వందనములు

  రిప్లయితొలగించండి
 14. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  ఘనమగు శివ చాపమ్మును
  యినకులమణి రామచంద్రు డెత్తగవలె నా
  ప్రణతిని గొనుమనుచు జగ
  జ్జనకుని పెండ్లాడ మనుచు జానకి కోరెన్

  రిప్లయితొలగించండి
 15. మల్లెల వారిపూరణలు
  జనకుడు నౌనుగ రాముడు
  కనభూమియెభార్యయగును కమలాక్షునకున్
  తనుసీతకు. నా జనకుడు
  జనకుని పెండ్లాడ మనుచు జానకి కోరెన్
  2.జనకుని యి౦టనువింటిని
  గొనయము సాగంగ దీయ కూలెను నదియే
  జనకుడు వేగమె విశ్వపు
  జనకుని పెండ్లాడ మనుచు జానకి కోరెన్

  రిప్లయితొలగించండి
 16. తనయుని లవునిన్ కలలో
  గని సీత వచించె నతని కనుటకుమున్నే
  తన వరునిగ కలను లవుని
  జనకుని పెండ్లాడు మనుచు జానకి కోరెన్.

  రిప్లయితొలగించండి
 17. తనయుని లవునిన్ కలలో
  గని సీత వచించె నతని కనుటకుమున్నే
  తన వరునిగ కలను లవుని
  జనకుని పెండ్లాడు మనుచు జానకి కోరెన్.

  రిప్లయితొలగించండి
 18. మనమున గల తన కోరిక
  ధను వెత్తియు వంచి నట్టి దశరథ సూనిన్
  గన దీరెను, విశ్వ రక్షక
  జనకుని పెండ్లాడు మంచు జానకి కోరెన్.

  రిప్లయితొలగించండి
 19. గుండు మధుసూదన్ గారి పూరణ...

  త్రినయన ధనుభిద్యోధుని,
  దనుజాంతకు, సవనరక్షిఁ,ద్వరితోద్యన్నూ
  తన వరరాగ మనస్సం
  జనకునిఁ బెండ్లాడు మనుచు జానకి కోరెన్.

  రిప్లయితొలగించండి
 20. జిలేబీ గారూ,
  అర్థం కాలేదు. ☺

  *
  యం.ఆర్. చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘చాపమ్మును + ఇనకుల’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘ఘనమగు శంకరు చాపము/ నినకుల...’ అందామా?
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  కొంచెం గడబిడగా ఉన్నా పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవ పాదంలో ఒక లఘువు ఎక్కువయింది. ‘గన దీరె విశ్వరక్షక’ అంటే సరి.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  ఒక ప్రౌఢకావ్యంలోని పద్యం చదివిన అనుభూతి కలిగింది మీ పూరణతో. చాలా బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. జననీ జనకులకు జరుపు
  చును 'జానకి' షష్టిపూర్తి, సొగసులగనియౌ
  తన తల్లి తరపు పెద్దగ,
  జనకుని పెండ్లాడు మనుచు జానకి కోరెన్

  రిప్లయితొలగించండి
 22. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. నమస్కారములు
  గోలి వారికి ధన్య వాదములు సోదరు లందరికీ గురుపూర్ణిమ సందర్భముగా శుభాకాంక్షలు

  అవునూ ! ఇంచక్కా " అక్కయ్యా " అనిపిలవచ్చుగా .గార్లు ఆవళ్ళూ " ఎందుకు ?

  రిప్లయితొలగించండి

 24. శ్రీ శంకరయ్య గారు,

  గుండు మధుసూదన్ గారి పూరణ మీరన్నట్లు ప్రౌఢమైనదే. పూరణలోని రెండవ పాదంలో
  ని నాలవగణం ఛందస్సుకు కుదురుటలేదు. టైపాటనుకుంటాను.

  నమస్సులు

  రిప్లయితొలగించండి
 25. చంద్రమౌళి గారూ,
  గుండు మధుసూదన్ గారి పూరణలో ఏ దోషమూ లేదు. మళ్ళీ ఒకసారి పరిశీలించండి.

  రిప్లయితొలగించండి

 26. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  మీసూచనకు ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 28. అన్నపురెడ్డి వారి పూరణ చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 29. కనియెను మైథిలి నయ్యెడ
  నినకుల తిలకుండు ప్రేమ కిరవగు మదితో
  ననుమతి యడుగుము స్వామీ
  జనకుని, పెండ్లాడు మనుచు జానకి కోరెన్

  రిప్లయితొలగించండి
 30. మిస్సన్న గారి బాట లోనే - కలియుగ జానకి

  తనవెంట నిరంతరముగ
  మనువాడెద ననుచు తిరుగు మన్మధ రూపుం
  డను, యొప్పించి తొలుత నా
  జనకుని, పెండ్లాడు మనుచు జానకి కోరెన్.

  రిప్లయితొలగించండి
 31. గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, మిస్సన్న గారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 32. అనుకూల వతిని రామా!
  వెనువెనుకనె నిన్ను నేను వెంటాడ గలన్;
  ఘనముగ రప్పించుము నీ
  జనకుని!; పెండ్లాడు! మనుచు జానకి కోరెన్! 😊


  "ఇయం సీతా మమ సుతా సహ ధర్మచరీ తవ |
  ప్రతీచ్ఛ చ ఏనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా |
  పతివ్రతా మహభాగా ఛాయే వానుగతా సదా ||"

  రిప్లయితొలగించండి